ఎఎపి పాలన: అంబానీ లైసెన్స్ రద్దుకు సిఫారసు

ఢిల్లీ ప్రభుత్వం అన్నంత పనీ చేస్తోంది. జనానికి సబ్సిడీ ధరలకు విద్యుత్ ఇవ్వడానికి నిర్ణయించిన ఎఎపి ప్రభుత్వం వాస్తవ విద్యుత్ పంపిణీ ఖర్చులను నిర్ధారించుకోడానికి ప్రైవేటు డిస్కంలపై కాగ్ ఆడిట్ చేయించాలని నిర్ణయించడంతో అంబానీ, టాటా కంపెనీలు సహాయ నిరాకరణకు దిగిన సంగతి తెలిసిందే. తొండి కారణాలు చెప్పి విద్యుత్ సరఫరా బంద్ చేయడానికి వీలు లేదనీ, అలా చేస్తే డిస్కంల లైసెన్స్ లను రద్దు చేయడానికి కూడా వెనుకాబడబోమని సి.ఎం ఎ.కె హెచ్చరించినట్లుగానే మొదటి వేటు…