మే నెలలో మళ్ళీ క్షీణించిన భారత పారిశ్రామీక వృద్ధి, షేర్లు పతనం

భారత పారిశ్రామికీ వృద్ధి గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం మే నెలలో మళ్ళీ క్షిణించింది. మే నెలలో పారిశ్రామిక వృద్ధి 5.6 శాతంగా నమోదయ్యింది. రాయిటర్స్ సర్వేలో ఇది 8.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ క్షీణత అంచనాల కంటే ఎక్కువగా ఉండడం, ఇటలీ, స్పెయిన్ దేశాలు సావరిన్ అప్పు సంక్షోభానికి దగ్గర్లోనే ఉన్నాయన్న అనుమానాలు తీవ్రం కావడంతో భారత షేర్ మార్కెట్లు నష్టాల బాటలోనే మూడోరోజూ కొనసాగాయి. గత శుక్రవారం…

మౌలిక కారణాల వల్లనే ఆహార ధరలు పెరుగుతున్నాయ్! -ఆర్.బి.ఐ

గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆహార ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. తాజాగా జూన్ 11 తేదీతో ముగిసే సంవత్సరంలో ఆహార ధరల సూచిక 9.13 శాతానికీ, ఇంధన ధరలు 12.84 శాతానికీ పెరిగాయి. దానికి కారణాలు చెప్పమంటే వర్షాలు కురవక అని ఒక సారీ, సరఫరా ఆటంకాల వలన అని ఇంకొకసారీ, డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్ అని మరొక సారీ అని చెబుతూ వచ్చారు. ముఖ్యంగా భారత దేశ ఆర్ధిక పండితులు, మంత్రులు ఈవిధంగా…

వడ్డీరేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, ద్రవ్యోల్బణం పైనే దృష్టి

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్కు వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగా పెంచడంద్వారా దేశంలో ద్రవ్యోల్బణం ప్రమాదకర స్ధాయిలో ఉన్న విషయాన్ని తెలియజెప్పింది. దాంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గించడమే తన ద్రవ్యవిధానం ప్రధాన కర్తవ్యమని చాటి చెప్పింది. ప్రతి సంవత్సరం ద్రవ్యవిధానాన్ని అర్.బి.ఐ నాలుగు సార్లు సమీక్షిస్తుంది. ద్రవ్యోల్బణం కట్టడి కావడానికి అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు కూడా సమీక్షించడానికి ఆర్.బి.ఐ గత సంవత్సరం నిర్ణయించింది. తాజాగా మంగళవారం…