ఇండియా జి.డి.పి వృద్ధి రేటు Vs. ద్రవ్యోల్బణం -కార్టూన్
రెండంకెల జి.డి.పి వృద్ధి రేటు కోసం భారత ప్రభుత్వ ఆర్ధిక విధానాల రూపకర్తలు మన్మోహన్, ప్రణబ్, అహ్లూవాలియా, చిదంబరం తదితరులు కలలు కంటుండగా అధిక స్ధాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వారి కలలను కల్లలుగా మారుస్తోంది. 9 శాతం జిడిపి వృద్ధి రేటుకి మురిసిపోయే మన పాలకులు ఆహార, ఎనర్జీ ద్రవ్యోల్బణాల వలన దేశ ప్రజానీకం జీవనం దుర్భరంగా మారిందన్న సంగతిని పట్టించుకోరు. ఆర్ధిక గణాంకాలతో ఓ ఊహా ప్రపంచం నిర్మించుకుని సంతుష్టి చెందడమే తప్ప నిజ జీవితంలో…