అద్వానీజీ, హామీలు మరిస్తే నిషేధం వద్దా?
బి.జె.పి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రజాస్వామ్యంపై హఠాత్తుగా బెంగ పట్టుకుంది. జనం ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చుంటున్నందుకు ఆయనకు కోపం వచ్చింది. ఓటు హక్కు ఉండి కూడా ఓటు వేయని జనం ఇక భవిష్యత్తులో ఎప్పటికీ ఓటు వేయకుండా నిషేధం విధించాలని ఆయన ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నారు. జనం కోసం జరిగే ఎన్నికల్లో జనమే ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యం ఎలా బతికేను అన్నది అద్వానీ భయం! “ఓటు వేయని ప్రజలపైన అపరాధ రుసుము…