బ్రిటిషర్లకు పిల్లల్ని కని పెడుతున్న భారత తల్లులు
గర్భాన్ని అద్దెకు ఇచ్చే పరిశ్రమకు ఇండియా కేంద్రంగా మారుతున్నట్లు ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక వెల్లడించింది. భారత దేశంలో ఇపుడు 1000 కి పైగా క్లినిక్ లు బ్రిటిషర్లు తల్లిదండ్రులు కావడానికి సహాయం చేయడంలో స్పెషలైజేషన్ సాధించినట్లు సదరు పత్రిక కధనం వెల్లడించింది. 1.5 బిలియన్ పౌండ్ల కు (దాదాపు 13,000 కోట్ల రూపాయలకు సమానం) ఈ వ్యాపారం అభివృద్ధి చెందిందని వెల్లడించింది. ఒక్కో జంట లేదా వ్యక్తి ఒక్కో బిడ్డకు సగటున 25,000 పౌండ్లు చెల్లిస్తున్నారని…
