స్విస్ బ్యాంకుల్లో 2570 కోట్ల అదాని ఖాతాల స్తంభన, స్విస్ కోర్టుల విచారణ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి భుజాల పైన అత్యంత భారీ కర్తవ్యమే వచ్చి పడింది. “నేను తినను, ఎవరినీ తిననివ్వను” (मै नहीं खावूंगा , न खाने दूंगा) అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో అట్టహాసంగా, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఇన్నాళ్ళకి చేతి నిండా పని దొరికింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ధనిక వర్గాలు, మాఫియాలు, నల్ల డబ్బు యజమానులు అక్రమంగా తరలించి దాచిన సొమ్మును తాను…