నీరుగారిన అత్యాచార వ్యతిరేక చట్టం?

సోమవారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం అత్యాచార వ్యతిరేక చట్టం మరింత నీరుగారినట్లు తెలుస్తోంది. కొన్ని అంశాల్లో మెరుగుగానే ఉన్నప్పటికీ ఇతర అంశాలలో రాజకీయ పార్టీల ఒత్తిడితో చట్టాన్ని బలహీనం చేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ బిల్లును అడ్డుకుంటామని ప్రకటించిన నేపధ్యంలో బిల్లు చట్టంగా రూపొందడం పైన సందిగ్ధత ఏర్పడింది. అంగీకార వయసు…