గూఢచర్యం: చైనా అమ్మాయితో అమెరికన్ అణు రొమాన్స్

– అమెరికా, చైనాల వైరుధ్యాలు క్రమంగా వివిధ రంగాలలో ప్రస్ఫుటంగా ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పరస్పరం అడపాదడపా గౌరవం ప్రకటించుకుంటూనే ఒకరిపై మరొకరు గూఢచర్యానికి పాల్పడడం అగ్ర దేశాలకు కొత్త కాకపోయినా, చైనా అణు గూఢచర్యం వెల్లడి కావడం ఇదే ప్రధమం కావచ్చు. అమెరికాకు చెందిన ఒక డిఫెన్స్ కాంట్రాక్టర్ అమెరికా అణు రహస్యాలను ఒక చైనా అమ్మాయికి అందజేసి దొరికిపోయాడని ఫెడరల్ పోలీసు సంస్థ ఎఫ్.బి.ఐ ప్రకటించింది. డిఫెన్స్ కాంట్రాక్టర్ హవాయ్ ద్వీపంలో అమెరికా…