ఇరాన్ ఆయిల్ దిగుమతులు ఇండియా తగ్గించాల్సిందే -హిల్లరీ హుకుం

ఇండియా, ఇరాన్ నుండి చేసుకుంటున్న ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాల్సిందేనని అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ హుకుం జారీ చేసింది. ఇరాన్ దిగుమతులను ఇప్పటికే గణనీయంగా తగ్గించుకున్నందుకు హర్షం వ్యక్తం చేసిన హిల్లరీ, అది చాలదనీ, ఇంకా తగ్గించుకోవాలని కోరింది. ‘ఇరాన్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకునేది లేదని’ జనవరిలో పెట్రోలియం మంత్రి జైపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఒట్టిదేనని హిల్లరీ హర్షం స్పష్టం చేసింది. ఆ రకంగా బహిరంగంగానే ఇండియాకి ఆదేశాలిస్తున్న హిల్లరీని ‘అదేమని’…