కుదంకుళం ‘అణు వ్యతిరేక’ ఆందోళనలు, నాలుగు ఎన్.జి.ఓ లపై కేసులు
రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు. కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన…
