దుర్గా నాగపాల్: 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించా

ఉత్తర ప్రదేశ్ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ను తాను 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించానని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు వాగుతుండగా రికార్డు చేసిన వీడియో బైటకొచ్చింది. దీనితో శాంతిభద్రతలను నియంత్రించడంలో భాగంగానే ఆమెను సస్పెండ్ చేశామన్న యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఫలితంగా అఖిలేష్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందిలో పడినట్లయింది. మింగలేక, కక్కలేక సమాధానాలు వెతుక్కోవలసిన పనిలో రాష్ట్ర ప్రభూత్వం పడిపోయింది. నిజాయితీ అధికారుల కంటే ఇసుక మాఫియాయే…