అజరబైజాన్ ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం లీక్ చేసిన అమెరికా

తన ప్రమేయం లేకుండా ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలు అభివృద్ధి కావడం ఇష్టం అమెరికాకి ఇష్టం లేకపోవడమే, అజరబైజాన్ తో ఇజ్రాయెల్ కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని లీక్ చేయడానికి కారణం అని రష్యా టైమ్స్ పత్రిక తెలిపింది. ఇరాన్ అణు కర్మాగారాలపై బాంబులు వేసి ధ్వంసం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ ఉత్సాహం తన పుట్టి పుంచుతుందని అమెరికాకి భయం. దురాక్రమణ యుద్ధాలు, ప్రభుత్వాల కూల్చివేతలు అమెరికాకి కొత్తేమీ కాదు. కాకపోతే కాస్త సమయం తీసుకుందామన్నదే అమెరికా అభిప్రాయం. ఇజ్రాయెల్…

అజర్ బైజాన్ ఎయిర్ బేస్ నుండి ఇరాన్ పై దాడి చేయనున్న ఇజ్రాయెల్?

వైమానిక బాంబుదాడులతో ఇరాన్ అణు కర్మాగారాలను నాశనం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ కు తమ ఎయిర్ బేస్ లు వినియోగించుకోవడానికి అజర్ బైజాన్ అంగీకరించినట్లు అమెరికాకి చెందిన ‘ఫారెన్ పాలసీ’ పత్రిక వెల్లడించింది. ఈ వార్తలను అజర్ బైజాన్ ప్రబుత్వం ఆగ్రహంగా తిరస్కరించింది. “ఇజ్రాయెల్ ఒక ఎయిర్ ఫీల్డ్ కొనుక్కుంది. ఆ ఎయిర్ ఫీల్డ్ పేరు అజర్ బైజాన్” అని ఒక అమెరికా అధికారి చెప్పినట్లుగా ఫారెన్ పాలసీ పత్రిక చెబుతోంది. అజ్ఞాత సీనియర్ రాయబారులనూ, ఆర్మీ…