సాహస కేరళ నర్సులకు కన్నీటి వీడ్కోలు -ఫొటోలు
ఈ ఇద్దరు నర్సుల పేర్లు పి.కె.వినీత, రేమ్యా రంజన్. కోల్‌కతా లో అగ్ని ప్రమాదానికి గురైన ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో వీరిరువురూ ప్రాణాలు కోల్పోయారు. వీరు నిజానికి చనిపోవలసిన అవసరం లేదు. ఆసుపత్రి యాజమాన్యం లాగానే తమ దారి తాము చూసుకున్నట్లయితే వీరు ఇప్పటికి శుభ్రంగా బతికి ఉండేవాళ్ళు. కాని వీరు తమ వృత్తి ధర్మాన్ని పాటించడానికే నిర్ణయించుకోవడంతో అగ్నిప్రమాదం వల్ల ఏర్పడిన దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చనిపోయారు. ఎ.ఎం.ఆర్.ఐ అగ్నిప్రమాదంలో చనిపోయినవారిలో కాలిన గాయాలకంటే ఊపిరాడక…