సోనియా అంటే మోడీకి భయం -కేజ్రీవాల్
అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆం ఆద్మీ పార్టీ ఈ రోజు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. ఏఏపి నేతలు అనేకమంది పాల్గొన్న ఈ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ర్యాలీకి ముందుగా జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ప్రసంగంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఉబుసుబోక ప్రసంగాలను నిలువునా చీరేశారు.…