తెలంగాణపై త్వరలో అఖిలపక్షం -కేంద్రం
తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోసారి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కేంద్రాన్ని కోరామని, ఒక్కో పార్టీ నుండి ఒక్కరే ప్రతినిధిగా పిలవాలని కూడా చెప్పామని సి.పి.ఐ నాయకులు నారాయణ గారు విలేఖరులకు ఈ రోజే…
