సి.బి.ఐ కేసు కంచికి, ములాయం యు.పి.ఎ గూటికి
సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు మరియు యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లపై జరుగుతున్న అక్రమ ఆస్తుల కేసు విచారణ మూసివేత దిశలో ప్రయాణిస్తున్నదని పత్రికలు ఘోషిస్తున్నాయి. అదే సమయంలో ములాయం పార్టీ యు.పి.ఎ కూటమిలోకి ప్రయాణం చేస్తున్నదని కార్టూన్ సూచిస్తోంది. ఈ రెండు పరిణామాలకు ఎంత గాఢమైన అనుబంధం ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ములాయం, అఖిలేష్…