ఈ దళిత మహిళల ఆత్మగౌరవం మహోన్నతం
భారతదేశ ప్రతిష్ట, ఆత్మగౌరవాలు దేశంలోని కోట్లాది శ్రమజీవుల్లో ఉన్నాయి తప్ప డాలర్ల కోసం దేశ సరిహద్దులు దాటడానికి అవలీలగా సిద్ధపడేవారిలోనో, తెల్లరాజ్యాల పౌరసత్వం కోసం అర్రులుచాచే బుద్ధి జీవుల్లోనో లేదని దళిత మహిళలు అక్కు, లీల లు చాటి చెబుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల పౌరసత్వం సంపాదిస్తేనే ప్రపంచాన్ని జయించినంత సంబరపడే కొద్ది బుద్ధుల అల్పజీవులు, దశాబ్దాల బెత్తెడు వేతన జీవనంలోనూ నిలువెత్తు ఆత్మ గౌరవాన్నీ త్యజించలేని అక్కు, లీలలను చూసి నిష్కళంక హృదయాలతో సిగ్గుపడవచ్చు. లేదంటే…

