తననూ వదలొద్దని కోరిన నెహ్రూ -కార్టూన్
ప్రజాస్వామిక వ్యవస్ధకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పత్రికలను అభివర్ణించడం అందరూ ఎరిగిందే. కార్టూన్ ద్వారా రాజకీయ విమర్శలు చేయడం అత్యంత శక్తివంతమైన ప్రక్రియగా పత్రికలు అభివృద్ధి చేశాయి. కాసిన్ని గీతల ద్వారా ప్రకటించే రాజకీయ అభిప్రాయాలని నిషేధించాలని కోరడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్ధలో అత్యంత ముఖ్యమైన ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కు సంకెళ్లు వేయాలని కోరడమే. అందుకే ప్రజాస్వామ్య ప్రియులైన రాజకీయ నాయకులు తమను తాము విమర్శలకు అతీతులుగా ఎన్నడూ పరిగణించరు. భారత దేశ ప్రధమ ప్రధాని ‘జవహర్…


