తెలంగాణ కోసం అంతిమ సమరం, కాంగ్రెస్, టిడిపి పార్టీల ఎం.ఎల్.ఎల రాజీనామా అస్త్ర ప్రయోగం
తెలంగాణ రాష్ట్రం కోసం అంతిమ సమరం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులలో సగం కంటే ఎక్కువమంది సోమవారం రాజీనామా చేశారు. పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన 37 మంది ఎం.ఎల్.ఎ లు, పతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 28 మంది ఎం.ఎల్.ఎ లు తమ రాజీనామా లేఖలను డిప్యుటీ స్పీకర్‌కు అందించినట్లు ప్రకటించారు. అంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, కేంద్ర హోం మంత్రి చిదంబరం ఎ.పి లొ పరిస్ధితి అదుపులోనే ఉందనీ,…