లిబియా నిషిద్ధ గగనతలానికి అరబ్ లీగ్ ఆమోదం, గడ్డాఫీ బలగాల పురోగమనం
లిబియా అంతర్యుద్ధంలో గడ్డాఫీ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులను తూర్పువైపుకి నెట్టుకుంటూ వెళ్తున్న నేపధ్యంలో కైరోలో శనివారం సమావేశమైన అరబ్ లీగ్ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” అమలుకు ఆమోదముద్ర వేశాయి. సిరియా, అల్జీరియా మినహా అన్ని దేశాలూ “నో-ఫ్లై జోన్” ప్రతిపాదనను ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిని లిబియాపైన “నో-ఫ్లై జోన్” అమలు చేయాల్సిందిగా కోరుతూ అరబ్ లీగ్ తీర్మానించింది. లిబియాలో ప్రస్తుత సంక్షోభం ముగిసే వరకూ నో-ఫ్లై జోన్ అమలు చేయాలని తీర్మానంలో…