ఫేస్ బుక్ లో 10 శాతం మంది తిట్లు తింటున్నారట!

ఫేస్ బుక్ ఖాతాదారుల్లో కనీసం నూటికి పది మంది తిట్లు, అవమానాలు ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం ఫేస్ బుక్ వినియోగదారుల్లో పది శాతం మంది తమ ‘వాల్‘ పైన అభ్యంతరకరమైన, అవమానకరమైన సందేశాలు పోస్ట్ చేయబడిన అనుభవాలు ఎదుర్కొన్నారు. తమకు నచ్చని యూజర్‌లను తిట్టడం, అవమానించడం, వ్యక్తిగతంగా ఎగతాళి చేయడం బూతురాయుళ్ళ పనిగా ఉంటోంది. బెదిరిస్తూ ప్రైవేటు సందేశాలు ఇవ్వడం కూడా వీరి పనుల్లో ఒకటని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ఇంకా ఘోరం…