మధ్యధరా సముద్రంలో 63 మంది శరణార్ధులను వారి చావుకు వదిలేసిన నాటో యుద్ధనౌక
లిబియా పౌరుల రక్షణే తమ ధ్యేయమనీ, వారిని రక్షించండి అని ఆదేశించిన సమితి తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయడమే తమ కర్తవ్యమనీ నాటో ఆధ్వర్యంలో లిబియాపై బాంబులు మిస్సైళ్ళుతో దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు చెబుతున్నాయి. గడ్డాఫీ ఇంటిపై బాంబులేసి అతన్ని చంపాలని ప్రయత్నించినా, అతని కొడుకూ, ముగ్గురు మనవళ్ళను చంపినా, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులను నాశనం చేసినా, చివరికి లిబియా పౌరులే చనిపోయినా అవన్నీ అంతిమంగా లిబియా పౌరుల రక్షణకోసమే నని ఆ…