ఐ.ఎం.ఎఫ్ పదవికి దేశం కాదు, ఏకాభిప్రాయమే ప్రాతిపదిక -ఇండియా
ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ప్రతిభ, ఏకాభిప్రాయమే ప్రాతిపదికగా ఉండాలి తప్ప జాతీయత, దేశం కాదని ఇండియా ప్రకటించింది. యూరోపియన్ దేశం నుండి మాత్రమే ఆ పదవికి ఎన్నుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రకటించడం పట్ల ఇండియా తో పాటు ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే తాను ఐ.ఎం.ఎఫ్ అత్యున్నత పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇ.యు ఆమెకు పూర్తి…