నేను ఛండాలుడ్ని ఎట్లా అయ్యాను?

ఈ వీడియో నాకు వాట్సప్ మేసెజ్ గా వచ్చింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యం అని వీడియో చివర తనే చెప్పారు. ఆయన తాను రాసిన కవితను ఈ వీడియోలో చదివి వినిపించారు. కవిత అద్భుతంగా ఉన్నది. సహజంగానే కవిత నచ్చని వారు ఉండవచ్చు. వారికి నా వైపు నుండి ఒక విజ్ఞప్తి ఏమిటంటే కవిత ఎందుకు నచ్చలేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (ఆఫ్ కోర్స్, కామెంట్ ద్వారా నన్ను కూడా ప్రశ్నించవచ్చు.) సత్యం గారు…

‘అంటరానితనం’ ఎటూ పోలేదు -వీడియోలు

‘అంటరానితనం చట్టరీత్యా నేరం’ అంటోంది భారత రాజ్యాంగం. ‘అస్పృశ్యత’ ని నిషేధించామంటున్నాయి దళిత చట్టాలు. దళితుల అభ్యున్నతికి ఎన్నో చట్టాలు చేశామంటున్నాయి రాజకీయ పార్టీలు. ప్రపంచంలో ఘనమైన ప్రజాస్వామిక దేశం భారతదేశమని విద్యాధికులు కీర్తిస్తున్నారు. భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని మన్మోహన్, అహ్లూవాలియా, చిదంబరం ల కూటమి గర్వంగా చాటుతోంది. కులాల పునాదులు బలహీనపడ్డాయి అంటున్నారు కమ్యూనిస్టు కార్యకర్తలు. ఇవేవీ భారత దేశ దళితులను ‘అంటరానితనం’ నుండి విముక్తి చేయలేదని ఈ వీడియోలు చెబుతున్నాయి.  దేవాలయాల్లో…