ఎన్నికల హామీ: అంగారకుడిపై ఉచిత భూములు -కార్టూన్
– “నాకనుమానం లేదు. ఇక అంగారకుడిపైన నీరు, ఉచిత భూమి ఇస్తామని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాగ్దానాలు కురిపిస్తారు.” * * * భారత రాజకీయ పార్టీల హామీల వరదకు ఆనకట్ట వేయగల మొనగాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేరని ఇట్టే చెప్పొచ్చు. ప్రజల్ని బిచ్చగాళ్లను చేసి పగ్గం గడుపుకోని పార్లమెంటరీ రాజకీయ పార్టీ కూడా ఇండియాలో కనపడదు. ఇందిరాగాంధి కాలంలో ఎస్.సి, ఎస్.టి ల గుడిసెలకు ఉచితంగా బొంగులు, తాటాకులు ఇవ్వడం…

