ధర్డ్ ఫ్రంట్: మద్దతిస్తాం… అబ్బే, ఇవ్వం… -ఎఎపి

ఆం ఆద్మీ పార్టీ విధాన పరమైన లోపభూయిష్టత, అయోమయం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. బి.జె.పి కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి అవసరమైతే ధర్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అంశాల వారీ మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఆదివారం (మే 11) వారణాసిలో ప్రకటించారు. కానీ అంతలోనే పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అదేం లేదని స్పష్టం చేశారు. అవినీతి నాయకులతో నిండిన నాయకులకు తమ పార్టీ ఎలాంటి మద్దతూ ఇవ్వదని ఆయన స్పష్టం…

డబ్బు, మద్యం లేని ఎన్నికలు సాధ్యం కాదా?

ప్రశ్న (ఎ.మనోహర్): మన దేశంలో డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపలేమా? సమాధానం: ఇది చాలామందిని వేధించే ప్రశ్న. ఎన్నికలు నీతివంతంగా జరిగితే ఆ వచ్చే నాయకులు నీతివంతంగా ఉంటారన్న ఆశ ఈ ప్రశ్నలో ఇమిడి ఉంటుంది. లోక్ సత్తా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ లాంటి నాయకులు సైతం ఎన్నికల్లో సరైన అభ్యర్ధులను ఎన్నుకుంటే దేశం దానంతట అదే బాగుపడుతుందని ప్రబోధిస్తున్నారు. కానీ అది నిజమేనా? చెట్టు ముందా, విత్తు ముందా అని ప్రశ్నిస్తే ఏమిటి…

మా తలుపులు తెరిచే ఉన్నాయి -కార్టూన్

“చర్చల కోసం మన తలుపులు తెరిచే ఉన్నాయని మనల్ని హీనపరిచేవారందరికీ తెలియజెప్పడానికి ఇది చిన్న సూచన మాత్రమే” *** నిన్నటిదాకా 300 సీట్లు గ్యారంటీ అని ప్రకటించుకున్న పార్టీకి వాస్తవ పరిస్ధితి తెలుస్తోందని ఆ పార్టీ నేతల ప్రకటనలు చెబుతున్నాయి. తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పకపోతే తెరిచి ఉన్న మరో ద్వారం వైపు చూస్తారని భయం మరి! మరో వారం రోజుల వరకూ ఈ కఠోరమైన ఎదురు చూపులు తప్పవు కదా!

2వేల ఆఫ్ఘన్లను సమాధి చేసిన రాక్షస భూపాతం -ఫోటోలు

నీళ్ళు ఎత్తైన ప్రదేశం నుండి కిందకు జారిపడితే జలపాతం. ఏకంగా భూమే ఎత్తైన చోటి నుండి జారిపడితే! భూపాతం? గాంధార దేశంలో ఈశాన్య మూలన ఎత్తైన కొండ వాలుల్లో నివసించే గ్రామాల్లో ఓ చిన్న గ్రామాన్ని అలాంటి భూపాతం తాకింది. కొండ వాలులు తప్ప నివశించడానికి మరో చోటే లేని ఈ ప్రాంతంపై కొండ చరియలు విరిగి పడడం, ప్రాణ నష్టం సంభవించడం కొత్త కాదు. కానీ ఈసారి జరిగిన దుర్ఘటనలో 2,000 మందికి పైగా మరణించారని…

ఓటమి: ఎన్నికల ముందు కాంగ్రెస్, ఫలితాల ముందు బి.జె.పి

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి వదిలేసిందని వివిధ పత్రికలు, ఛానెళ్లు తమ తమ విశ్లేషణల్లో పేర్కొన్నాయి. నరేంద్ర మోడి, అమిత్ షా లు చేసిన తాజా ప్రకటనలతో ఫలితాలకు ముందే బి.జె.పి తన ఓటమిని అంగీకరిస్తోందని ఇప్పుడు పత్రికలు, ఛానెళ్లు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ప్రచారం మొదలయిందో లేదో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 7 రేస్ కోర్స్ రోడ్ నుండి కృష్ణ మీనన్ రోడ్ కు తన నివాసాన్ని మార్చేసుకున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్…

మోడి ‘అభివృద్ధి’ పరిణామం ఇదీ! -కార్టూన్

2014 సాధారణ ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే నరేంద్ర మోడి ‘సద్భావనా మిషన్’ పేరుతో తాను అందరివాడినని చెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ప్రకటించాక ‘అభివృద్ధి’ మంత్రం అందుకున్నారు. గుజరాత్ లో తాను చేసిన అభివృద్ధి దేశం అంతా అమలు చేస్తానని ప్రచారం చేస్తారు. తాను ప్రసంగించిన చోటల్లా ఉద్యోగాల ప్రస్తావన తేవడం ద్వారా ఓటర్లలో సగం వరకూ ఉన్న యువతను ఆకర్శించేందుకు ఎర వేశారు. తాను ప్రధాని అయితే ‘ఉద్యోగాలే ఉద్యోగాలు’ అన్నారు. తీరా ఎన్నికలతో పాటు…

రష్యా గ్యాస్ కు ప్రత్యామ్నాయం కోసం జి7 వెతుకులాట!

అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేసినట్లే జరుగుతోంది. ఉక్రెయిన్ సంక్షోభం దరిమిలా యూరప్ గ్యాస్ మార్కెట్ ను అమెరికా చేజిక్కించుకోవడానికి ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. రష్యా నుండి ఇన్నాళ్లూ భారీ మొత్తంలో సహజవాయువు సరఫరా పొందుతున్న ఐరోపా దేశాలకు రష్యాకు ప్రత్యామ్నాయంగా అమెరికా షేల్ గ్యాస్ ను ఉపయోగపెట్టుకోవడానికి నిర్ణయించే వైపుగా అడుగులు పడుతున్నాయి. రోమ్ లో మూడు రోజుల క్రితం ముగిసిన జి7 శక్తి వనరుల మంత్రుల సమావేశం రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత…

మోడి పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండదు -రష్దీ

మోడి నేతృత్వంలోని ప్రభుత్వం అధికరంలోకి వస్తే భారత దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పూర్తిగా అడుగంటడం ఖాయం అని ప్రముఖ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత సల్మాన్ రష్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మోడి అధికారంలోకి రాక మునుపే ఆయన పాలన ఎలా ఉండబోతోందో చాటే ఘటనలు జరుగుతున్నాయని, ఏం రాస్తే ఏమవుతుందో అని భావిస్తూ అనేకమంది సొంతగా సెన్సార్ షిప్ పాటిస్తున్నారని ఆయన చెప్పారు. ‘పెన్ వరల్డ్ వాయిసెస్ ఫెస్టివల్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్…

ఉల్టా పల్టా: జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి -ఫోటోలు

‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అన్నారు పెద్దలు. ఆ పెద్దల భవిష్యద్దర్శనం ఎంత దూరం సాగిందో తెలియదు గానీ, ఈ ఫొటోల్లో కనపడుతున్నంత దూరం మాత్రం సాగి ఉండదని నిస్సందేహంగా చెప్పవచ్చనుకుంటాను. ఎంతో ఖర్చు పెట్టి ప్రఖ్యాత ఆర్కిటెక్చర్లను నియమించుకుని మరీ కట్టుకున్న ఇళ్ళు ఇలా తిరగేసి ఉంటాయని ఊహించగలమా? పోనీ ఒక దేశంలో ఒకరిద్దరికి పుట్టిన ఆలోచనా ఇది అంటే, కానే కాదు. కనీసం నాలుగు దేశాల్లో కట్టిన ఇళ్ళు మనం ఇక్కడ చూడవచ్చు. చైనా,…

ఇది సెల్ఫీ రాజకీయాల యుగం! -కార్టూన్

“మీ సెల్ఫీకి ఊహించలేనంత బ్రహ్మాండమైన స్పందన వస్తోంది సార్ – ఇక చూస్కోండి, బంపర్ మెజారిటీతో గెలవడమే మిగిలింది…” *** ఊహించనంత వేగంగా కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం రాజకీయాల్లోనూ తన హవా చాటుతోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వార్తా ఛానెళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి ఇల్లూ ఒక శబ్ద కాలుష్య కర్మాగారం అయిపోయింది. ఛానెళ్లలో వివిధ రాజకీయ నాయకుల సొంత డబ్బాలు వినలేక పత్రికల వైపు మళ్లుదామంటే అక్కడా అదే గోల. ఒక్కో పత్రికా ఒక్కో…

అస్సాం మత హింసకు మోడీయే కారణం -ఒమర్

జమ్ము & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అస్సాం మతోన్మాద దాడులపై నోరు విప్పారు. ఎన్నికల సమయంలో మతోన్మాద దాడులు చెలరేగడానికి కారణం నరేంద్ర మోడియే అని ఆయన ఆరోపించారు. మూడు రోజుల క్రితం అస్సాంలో ఎన్నికల ప్రచారం చేసిన మోడి అస్సాంలో నివశిస్తున్న ముస్లింలు అందరూ విదేశీయులే అని స్ధానికులను రెచ్చగొట్టారని దాని ఫలితమే దాడులు జరిగి డజన్ల మంది మరణించారని ఆరోపించారు. “అస్సాంలో 30 మంది ముస్లింలను చంపేశారు. ఎందుకు? ఎందుకంటే బి.జె.పి ప్రధాన…

కోడ్ పాటించని నేతలు దేశ గతి మారుస్తారా? -కార్టూన్

“నీ ఓటు నాకివ్వు” “నీ తలరాత మార్చేస్తా” “ఈ దేశ గతిని కూడా మార్చేస్తా” “చట్టాన్ని ఉల్లంఘించకుండా ఓటు వెయ్యడం ఎలాగో ముందు నీకు నేర్పి చూపిస్తా పద!” — “అరవై యేళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. నాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చి చూడండి! దేశం గతినే మార్చి చూపిస్తాను.” ఇది నరేంద్ర మోడి అదే పనిగా భారత జనానికి చెబుతున్న మాట! నరేంద్ర మోడీకి నిజంగానే అవకాశం ఇస్తే అది మొదటి అవకాశం మాత్రం…

సిరియా: అస్సాద్ జైత్రయాత్ర, హోమ్స్ పునఃస్వాధీనం

సిరియాలో పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన ఆల్-ఖైదా టెర్రరిస్టు మూకలు చావు దెబ్బలు తింటున్నాయి. తిరుగుబాటు పేరుతో వివిధ ముస్లిం టెర్రరిస్టు గ్రూపులు మొట్టమొదటిసారిగా విధ్వంసం ప్రారంభించిన హోమ్స్ నగరం ఇప్పుడు దాదాపు అస్సాద్ ప్రభుత్వం చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హోమ్స్ లోని వివిధ ఉగ్రవాద శిబిరాలపై ప్రభుత్వ బలగాలు తీవ్ర స్ధాయిలో దాడులు చేయడంతో ఉగ్రవాదులు కాళ్ళ బేరానికి వచ్చి ప్రభుత్వంతో తాత్కాలిక సంధి కుదుర్చుకున్నారు. “ఇది మేము కోరుకున్నది కాదు. కానీ…

తుపాకి పేల్చిన తూనీగలున్నయట… -వీడియో

‘అర్ధరాత్రి స్వతంత్రం’ అని ఒక సినిమా ఉంది. ఆర్.నారాయణ మూర్తి తీసిన మొదటి సినిమా ఇది. విశాఖకు చెందిన పాటల రచయిత వంగపండు ప్రసాద్ రాసి, స్వయంగా పాడిన పాట ఒకటి ఈ సినిమాలో చిత్రీకరించారు. అద్భుతమైన పాట అది. సామాన్యులే చరిత్ర నిర్మాతలనీ ఆ పాట పరోక్షంగా చెబుతుంది. ఆ పాట వింటుంటే రోమాలు నిక్క బొడుచుకుని ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకుని వస్తుంది. కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి మీరూ వినండి.  ఏం పిల్లడో…

ఎల్ నినో, లా నినా అంటే?

ప్రశ్న (నాగ మల్లేశ్వరరావు): ఎల్ నినో, లా నినా అంటే ఏమిటో తెలుగులో వివరించగలరు. సమాధానం: ఇవి రెండూ ప్రపంచ వాతావరణ పరిస్ధితులకు సంబంధించినవన్న సంగతి చాలా మందికి తెలుసు గానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయో తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి తెలియదు. 17వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరంలోని మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్ధితిని మొదటిసారి కనుగొన్నారని రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుండీ శాస్త్రవేత్తలు వీటిపై…