రైల్వే ఛార్జీలు: మంచి రోజులా, ముంచే రోజులా?

‘మంచి రోజులు ముందున్నాయి’ అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ప్రధాని మోడి, అధికారంలోకి వచ్చాక, ‘ముందుంది ముసళ్ళ పండగ’ అని చాటుతున్నారు. సరుకు రవాణా ఛార్జీలతో పాటు ప్రయాణీకుల ఛార్జీలు కూడా వడ్డించిన మోడి ప్రభుత్వం ‘కఠిన నిర్ణయాలకు’ అర్ధం ఏమిటో చెప్పేశారు. రెండేళ్ల క్రితం రైలు సరుకు రవాణా ఛార్జీలు పెంచినపుడు అప్పటి ప్రధానికి లేఖ రాసి నిరసించిన మోడి ఇప్పుడు ఎవరి లేఖకు లొంగుతారు? ప్రయాణీకులపై 14.2 శాతం ఛార్జీల మోత మోగించిన మోడి…

కాంగ్రెస్ గవర్నర్ల గెంటివేత -కార్టూన్

“రాజీనామా? అబ్బే కాదు. గెంటేశారు!!” *** కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వం తాలూకు వాసనలను వదిలించుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ లను మార్చడానికి మోడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కొందరు గవర్నర్ లు అందుకు సహకరించడానికి సిద్ధంగా లేరు. దానితో బి.జె.పి మండిపడుతోంది. ముఖ్యంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహా రాష్ట్ర రాష్ట్రాల గవర్నర్లు తమకు రాజీనామా చేసే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేయడంతో…

ఎన్.జి.ఓలు vis-a-vis మోడి -కార్టూన్

“… ఆ, అవే, మనకి అనుకూలంగా తిరగడం లేదు చూశావా, అక్కడికి పద…” *** ఎన్.జి.ఓ లు మరొకసారి చర్చనీయాంశం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గూఢచార సంస్ధ ‘ఇంటలిజెన్స్ బ్యూరో’ (ఐ.బి), అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ సంస్ధగా చెప్పుకునే గ్రీన్ పీస్ కీ, ఇంకా ఇతర సంస్ధలకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రికి నివేదిక ఇవ్వడంతో తాజాగా ఎన్.జి.ఓలపై చర్చ నడుస్తోంది. గ్రీన్ పీస్ తదితర ఎన్.జి.ఓల కార్యకలాపాలు భారత దేశ అభివృద్ధికి ఆటంకంగా మారాయన్నది సదరు నివేదిక…

‘ప్రజాస్వామ్యం’ ఎండమావికై చైనా యువత రోడ్డెక్కిన ఆ రోజులు -ఫోటోలు

సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఈ రోజుల్లోనే చైనా యువత ‘పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యం’ అనే ఎండమావి కోసం వీధులకెక్కి నినదించారు. 1911 ప్రాంతంలో ఆనాటి జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమ రధసారధి డాక్టర్ సన్ యెట్ సేన్ జ్ఞాపకాలను అపహాస్యం చేస్తూ చైనీయ యువత మిడి మిడి జ్ఞానంతో పశ్చిమ దేశాల్లో నిజమైన ప్రజాస్వామ్యం ఉందని నమ్మారు. అలాంటి ప్రజాస్వామ్యమే చైనాలో ప్రవేశపెట్టాలని కోరుతూ వేలాది మంది యువత, విద్యార్ధులు బీజింగ్ చేరుకుని చరిత్రాత్మక తీయానాన్మెన్ స్క్వేర్ లో…

మొండి వినికిడి సమస్యా? ఐతే బసవనగుడికి రండి!

బసవన గుడి అంటే దేవుడి గుడి కాదు. బెంగుళూరులో అదొక ఏరియా. ఈ ఏరియాలో అద్భుతమైన చెవి (ENT) డాక్టర్ ఉన్నారు. ఈ టపాని ఇప్పుడు ఆయన ఆసుపత్రిలోని ఓ రూమ్ నుండే రాస్తున్నాను. పెద్దగా ప్రచార పటాటోపం జోలికి పోని డాక్టర్ మహదేవయ్య ఈ ఆసుపత్రిలో ప్రధాన డాక్టర్. చాలా పెద్దాయన. నాకు చిన్నప్పటి నుండి చెవి సమస్య ఉంది. గత పాతికేళ్ళ నుండి వినికిడి సమస్య కూడా ఉంది. ఈ పాతికేళ్లలో ఒకే స్ధాయిలో…

కఠిన నిర్ణయాలు తప్పవు -మోడి

అనేశారు! ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి ఆ కాస్త మాటా అనేశారు. ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టాలంటే కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోడి స్పష్టం చేశారు. మోడీని, బి.జె.పినీ అదే పనిగా పొగుడుకుంటే ఏమీ ఒరగదనీ అసలు పనిలోకి దిగితే కొన్ని సెక్షన్ల ప్రజలకు కష్టం తప్పదని ఆయన ఉన్న మాట చెప్పేశారు. అధికార పీఠాన్ని అధిష్టించి నెల కూడా కాలేదు, అప్పుడే కఠిన చర్యలు అంటున్నారు మోడి. “ఆర్ధిక క్రమశిక్షణ తెచ్చుకోవాలంటే రాబోయే ఒకటి…

మోడీ పైనే బాబు ఎన్నికల హామీల భారం! -కార్టూన్

ఎన్నికల గెలుపు తాలూకు మత్తు నాయకులను ఇప్పుడిప్పుడే వదులుతున్నట్లుంది! కేంద్రంలో బి.జె.పి/మోడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం సాధించిన విజయాలు మోడి, చంద్రబాబు నాయుడుల చలవే అని పత్రికలు ఘోషిస్తున్నాయి. మోడీయే లేకపోతే బి.జె.పికి ఈ గెలుపు దక్కి ఉండేది కాదని మామూలుగా మోడిని విమర్శించే పత్రికలు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. మోడి గాలి తుఫానులా తాకి కాంగ్రెస్ ని ఊడలతో సహా పెరిగివేసిందని, చంద్రబాబు పడిన పాదయాత్ర కష్టం టి.డి.పి ని తిరిగి అధికారంలోకి…

అమెరికన్ ఉబర్ ఆప్ పై ఐరోపా టాక్సీ డ్రైవర్ల సమ్మె పోరు

అమెరికాకు చెందిన ‘ఉబర్’ కంపెనీ తయారు చేసిన మొబైల్ ఫోన్ అప్లికేషన్ పై యూరోపియన్ దేశాల టాక్సీ డ్రైవర్లు యుద్ధం ప్రకటించారు. ఈ అప్లికేషన్ తమ పొట్ట కొడుతోందని వారు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఎంతగా మొరపెట్టుకున్నా తమ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ఉబర్ మొబైల్ అప్లికేషన్ కు వ్యతిరేకంగా బుధవారం (జూన్ 11) సమ్మె పాటించారు. ఈ సమ్మెతో ఐరోపా దేశాల ప్రధాన నగరాల్లో వీధులు స్తంభించిపోయాయని రాయిటర్స్, బి.బి.సి, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు తెలియజేశాయి.…

ఇండియాయే అందరికీ నేర్పింది -రష్యా టుడేలో ఓ వ్యాఖ్య

రష్యా టుడే పత్రిక ఈ రోజు (జూన్ 11, 2014) ఒక వార్త ప్రచురించింది. దాని ప్రకారం భూమి, చంద్రుల వయస్సు గతంలో ఊహించినదాని కంటే 6 కోట్ల సంవత్సరాలు ఎక్కువని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్య కుటుంబం ఏర్పడిన 10 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి, చంద్రుడు గ్రహాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో సేకరించిన Xenon ఐసోటోప్ లను పరిశోధించాక ఇది తప్పనీ సూర్య కుటుంబం ఏర్పడిన 4 కోట్ల సంవత్సరాలకే…

కరాచిపై పాక్ తాలిబాన్ దాడులు, శాంతి ఎప్పటికి? -ఫోటోలు

‘ఆ, శాంతి గాక ఇక ఏమున్నదిలే!” అని సత్యహరిశ్చంద్రుడు కాటి సీన్ చివరి అంకంలో దీర్ఘంగా నిట్టూర్చి ప్రాణత్యాగానికి పూనుకుంటాడు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం పరిస్ధితి అదే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరాంతానికి ఆఫ్ఘనిస్ధాన్ ను ఖాళీ చేయడానికి అమెరికా ముహూర్తం పెట్టుకున్న నేపధ్యంలో తాలిబాన్ తో శాంతి చర్చలు ఫలించే సూచనలేవీ కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఆఫ్ఘన్ తాలిబాన్ తో ఆఫ్ఘన్ ప్రభుత్వం శాంతి చర్చలు విఫలం అవుతుండగానే పాక్ తాలిబాన్ తో పాక్…

అరవింద్: అసంతృప్త నేతల పంచింగ్ బ్యాగ్

“మిత్రులారా, ఈ ప్రభుత్వం తప్పులు చేసేవరకూనో లేదా కొత్త పంచింగ్ బ్యాగ్ దొరికేవరకూనో -ఈ రెండిట్లో ఏది ముందోస్తే అంతవరకూ కాస్త ఓపిక పట్టండి…” *** *** *** ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి వివిధ ప్రాంతాల్లోని ఎఎపి నాయకులు వరుస కట్టి రాజీనామాలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేసేస్తే మరికొందరు పార్టీ సభ్యత్వాన్ని అట్టే పెట్టుకుని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. బహుశా వీళ్ళంతా పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ…

ఆపదలో స్త్రీని ఎందరు ఆదుకుంటారు? -ప్రయోగం (వీడియో)

“YesNoMaybe” అన్న పేరుతో ఓ ఫిల్మ్ మేకింగ్ సంస్ధ ఉంది(ట). ఆ సంస్ధ వాళ్ళు ఈ మధ్య ఒక ప్రయోగం చేశారు. ఢిల్లీ బస్సు అత్యాచారానికి వ్యతిరేకంగా లక్షలమంది దేశవ్యాపితంగా స్పందించారు. కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్లకార్డులు రాసుకుని ఊరేగింపులు నిర్వహించారు. ఢిల్లీలోనైతే ఏకంగా పోలీసులతో యుద్ధమే చేశారు. అయితే నిజంగా ఒక స్త్రీ ఆపదలో ఉండి ఆర్తనాదం చేస్తే ఆమెను ఆదుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి “YesNoMaybe”…

రైతులకు మోడి వాత, యూరియా ధర పెంచే యోచన

బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను పరోక్షంగా ప్రవేశపెట్టనున్న మోడి ప్రభుత్వం అదే ఊపుతో రైతులకు నేరుగానే వాత పెట్టేందుకు యోచిస్తోంది. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు తగిన విధంగా రుణం తీర్చుకోవడానికి మోడి ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మేలు చేయడం కోసం గ్యాస్ ధరలను రెట్టింపు చేసినందున పెరగనున్న సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి యూరియా ఎరువు ధరను కనీసం 10 శాతం పెంచేందుకు యోచిస్తోంది. ఈ…

మోడి: భారతీయ మోషే! -కార్టూన్

భారత ప్రధాని నరేంద్ర మోడిని భారతీయ మోషే (మోజెస్) గా కార్టూనిస్టు చిత్రీకరించారు. ఎన్నికలకు ముందు మోడీకి ప్రచార సారధ్యం అప్పగించడం ద్వారా ప్రధాని పదవికి ఆయనే అభ్యర్ధి అని బి.జె.పి ప్రకటించినప్పుడు అలిగి తూలనాడిన పార్టీ సీనియర్లను మోడి తెచ్చిన టెన్ కమాండ్ మెంట్స్ ఫలకాలను మోసుకు తిరగడానికి ఎదురు చూస్తున్నవారిగా కేశవ్ చిత్రీకరించారు. మోడి కష్టాన్ని అనుభవించడానికి బి.జె.పి సీనియర్లు ఎదురు చూస్తున్నారని చురక అంటించారు. *** క్రైస్తవ పురాణంలో మోజెస్ కధ తెలుసా?…

ప్రమాణానికి ముందే ఆఫ్ఘన్ తో చర్చలు చేసిన మోడి

మాట్లాడితే ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లపై విద్వేషం వెళ్లగక్కే మోడి అభిమానులు, ప్రధానిగా మోడి తీసుకుంటున్న చర్యలను ఏ విధంగా అర్ధం చేసుకుంటారన్నదీ పరిశీలించాల్సిన విషయం. భారత దేశానికి శత్రు దేశాలయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లతో సత్సంబంధాలను మీరు ఎలా కోరుకుంటారో అర్ధం కావట్లేదు అని ఒక హిందూత్వ అభిమాని ఈ బ్లాగ్ రచయితను ప్రశ్నించిన సంగతి ఇటీవలి విషయమే. అయితే మోడి ప్రధాన మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయకమునుపే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్ధాన్ రెండు దేశాలతోనూ చర్చలు…