కాల్పుల విరమణను కాపాడండి! -ది హిందు ఎడిట్

(ఇండియా-పాకిస్ధాన్ ల మధ్య సరిహద్దుల ఆవలి నుండి కాల్పులు జరగడం మళ్ళీ నిత్యకృత్యంగా మారిపోయింది. పాక్ కాల్పుల్లో సోమవారం 5గురు భారతీయ పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఇండియా కాల్పుల్లో తమ పౌరులూ మరణించారని, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారత సైనికులు కాల్పులు జరుపుతున్నాయని పాకిస్ధాన్ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ది హిందు పత్రిక ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఆధీన రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చెదురు…

మాంద్యం వైపుకి జర్మనీ నడక, రష్యా ఆంక్షల ఫలితం!

తప్పుడు ఆరోపణలు చేస్తూ రష్యాపై అమెరికా, ఐరోపాలు విధించిన ఆంక్షలు తిరిగి వాటి మెడకే చుట్టుకుంటున్నాయి. 2014 సంవత్సరంలో రెండవ త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్) లో ఇప్పటికే జి.డి.పి సంకోచాన్ని నమోదు చేసిన జర్మనీలో ఆగస్టు నెలలో పారిశ్రామిక ఉత్పత్తి మళ్ళీ సంకోచించింది. అనగా పారిశ్రామిక ఉత్పత్తి క్రితం నెలతో పోల్చితే వృద్ధి చెందడానికి బదులు కుచించుకుపోయింది. జర్మనీ ఆగస్టు వ్యాపార ఫలితాలు వెలువడిన వెంటనే అమెరికా, ఐరోపా దేశాల స్టాక్ మార్కెట్ లు నష్టాల్లోకి…

మోడి: చీపురే ఓట్ల మంత్రదండంగా… -కార్టూన్

ఎన్నికల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ బి.జె.పికి అచ్చివస్తుందని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. చీపురు చేతబట్టి ఢిల్లీ వీధులను శుభ్రం చేస్తున్న ప్రధాని మోడి ఫోటోలు ఇప్పుడు భారత దేశంలో ఒక ప్రాచుర్య దృశ్యం. ఈ దృశ్య ప్రాచుర్యాన్ని సొమ్ము చేసుకునేందుకు మోడి నడుం బిగించారని కార్టూన్ సూచిస్తోంది. లేదంటే ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచాయో లేదో అప్పుడే కూటమి పాలనా రోజులకు కాలం చెల్లిందని మోడి ప్రకటించగలరా?…

ప్రశ్న: విదేశాల్లో సబ్సిడీలు మనంత లేవా?

శశిధర్:  శేఖర్ గారు, మీ బ్లాగ్ లో రెగ్యులర్ గా ఆర్టికల్స్ చదువుతుంటాను. అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణలు చాల బాగా వివరిస్తారు. అలాగె ఆర్థిక సంబంద విశ్లెషణలు కుడా బాగుంటాయి. సబ్సిడీలు వాటి ఆవశ్యకత గూర్చి చదివాను. ఈ మధ్య కాలంలో ట్రెడ్ ఫెసిలిటేషన్ అగ్రీమెంట్ గుర్చి చదివాను. నా ప్రశ్న: భారత్ లో సబ్సిడిలు అంత ఎక్కువగ ఉన్నాయా? అభివ్రుద్ది చెందిన దేశాల్లో ఇస్తున్న సబ్సిడీల విలువ ఎంత? ఏయే  రంగాలకు సబ్సిడిలు ఎంత మొత్తంలో…

ప్రశ్న: బిట్ కాయిన్ అంటే?

రమేష్: శేఖర్ గారు, మీ బ్లాగ్ నేను క్రమం తప్పకుండా చదువుతుంటాను. మీ విశ్లేషణలు చాల బావుంటాయి. సర్, నాకు ఒక సంధేహము. ఏమిటంటే నేను గత 2, 3 సంవత్సరాలుగ అంతర్జాతీయంగా బిట్ కాయిన్ అనే కరెన్సి గురించి విన్నాను. కాని దాని గురించి గాని, అది ఏ దేశ కరెన్సి అని గాని తెలియదు . దయచేసి ఆ కరెన్సి గురించి, అది ఎలా మనకు ఉపయోగపడుతుంది, దానిని ఎక్కడ, ఎలా మార్చుకొవాలి? మెదలగు…

ఇన్ ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్… -ఈనాడు

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ యొక్క ఆర్ధిక మౌలికాంశాల్లో (ఎకనమిక్ ఫండమెంటల్స్) ద్రవ్యోల్బణం ఒకటి. ద్రవ్యోల్బణం గురించి ఆర్ధికవేత్తలు అనేక సిద్ధాంతాలు చెబుతారు. ఆ సిద్ధాంతాలన్నీ మనిషి సృష్టించిన కృత్రిమ మారక సాధనం అయిన డబ్బు చుట్టూనే తిరుగుతాయి. ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా డబ్బును నియంత్రించే ధనికవర్గాల జోలికి ఆర్ధికవేత్తలు వెళ్లరు. ఫలితంగా ఆ సిద్ధాంతాలన్నీ వాస్తవ పరిస్ధితులకు దరిదాపుల్లోకి వెళ్లడంలో విఫలం అవుతాయి. దాంతో మళ్ళీ మళ్ళీ సరికొత్త సిద్ధాంతాలతో ఆర్ధికవేత్తలు ముందుకు రావడానికి పరిస్ధితులు…

ఒంటకే: హఠాత్తుగా బద్దలై ట్రెక్కర్లను చంపేసింది -ఫోటోలు

ట్విస్టర్లకు అమెరికా పెట్టింది పేరు. పెను తుఫాన్లకు, జల ప్రళయాలకు ఫిలిప్పైన్స్ పెట్టింది పేరు. కాగా జపాన్ అగ్ని పర్వత విస్ఫోటనాలకు పెట్టింది పేరు. గత సెప్టెంబర్ 27 తేదీన మౌంట్ ఒంటకే అనే పేరుగల అగ్ని పర్వతం చెప్పా పెట్టకుండా ఒక్కుమ్మడిగా బద్దలు కావడంతో ప్రమాదం ఊహించని పర్వతారోహకులు పలువురు దుర్మరణం పాలయ్యారు. వారు తలపెట్టిన సాహస యాత్రను మృత్యు యాత్రగా మౌంట్ ఒంటకే మార్చివేసింది. మౌంట్ ఒంటకే, రాజధాని టోక్యోకు పశ్చిమ దిశలో 125…

ఆంధ్ర రాజధాని: భూ స్వాధీనానికి రైతులు వ్యతిరేకం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొంతు రోజు రోజుకి కఠినంగా మారుతోంది. రైతులకు బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చి భూములు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు “భూములు ఇచ్చారా సరే సరి, లేదా…” అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల అభివృద్ధిలో రైతులకు వాటా ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ వైపు మొగ్గు ప్రకటిస్తున్నారు. పూలింగ్ కు ఒప్పుకోకపోతే స్వాధీనం చేసేసుకుంటాం అని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి…

చీపురు వెనక సందేశం -ది హిందూ ఎడిట్

(ఆం ఆద్మీ చేతిలోని చీపురు కాస్తా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడి చేతిలోకి వచ్చేసింది. స్వయంగా చీపురు చేతబట్టి ఒక సెంట్రల్ ఢిల్లీలో ఒక పోలీసు స్టేషన్ ఆవరణను శుభ్రం చేయడం ద్వారా ప్రధాని దేశం దృష్టిని గొప్పగా ఆకర్షించారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక రోజు ఆర్భాటంతో ముగియడం భారత దేశానికి అనుభవమే. చంద్రబాబు నాయుడు గారి ‘ప్రజల వద్దకు పాలన’ అధికారులను జనం వద్దకు తేవడం తప్ప సాధించిందేమీ లేదు. వై.ఎస్.ఆర్ ప్రవేశపెట్టిన అనేక…

ఇండియా, అమెరికాలు సహజ మిత్రులు! -కార్టూన్

అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి తన అదృష్టానికి తాను ఎంతో మురిసిపోయినట్లు ఆయన ప్రకటనల ద్వారా తెలిసింది. ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడిని కలిసే అవకాశం తనకు వచ్చిందని మోడి చెప్పుకున్నారు. తనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికాయే ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే, తనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలికిందని ఈ మాటల ద్వారా మోడి ఎత్తి చూపారని చెబుతున్నవారూ లేకపోలేదు. అమెరికా…

జేసుదాసు గారూ, మీరు కూడానా?!

అద్భుతమైన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రాక్పశ్చిమ దేశాల శ్రోతలను అలరించిన సినీ నేపధ్య గాయకుడు కె.జె.జేసుదాసు తప్పుడు కారణాలతో పతాక శీర్షికలను ఆక్రమించారు. సో కాల్డ్ హిందూ సంస్కృతీ పరిరక్షకులు, మతోన్మాద పెత్తందార్లు, ఖాప్ పంచాయితీలు, రాజకీయ నాయకులు, పోలీసు బాసులు, బాబాలు… ఇలా అందరి వంతు అయింది, తన వంతే మిగిలింది అన్నట్లుగా జేసు దాసు గారు స్త్రీల వస్త్ర ధారణపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలకు ఆయన గాంధీ జయంతి వేడుకలను…

విశ్వనరుడి లిప్తకాల జీవనం -ఫోటోలు

‘నేను విశ్వ నరుడ్ని’ అని చాటుకున్నారు మహా కవి గుర్రం జాషువా. భారతీయ కుల వ్యవస్ధకు నిరసనగా అది ఆయన చేసిన మానవీయ ప్రకటన. ఈ విశ్వంలో నరులంతా పుట్టుకతో సమానులేననీ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ మనిషి ఏర్పరుచుకున్నదే అనీ ఆయన విశ్వసిస్తూ, కులం లేని విశ్వంలో తన చోటును వెతుక్కున్నారు. ‘డెయిలీ లైఫ్’ శీర్షికన ఫోటోగ్రాఫర్లు విశ్వ వ్యాపిత జీవన దృశ్యాలను సేకరించి ప్రచురించే ఫోటోలు గుర్రం జాషువా ప్రకటనను గుర్తుకు తెస్తాయి. ప్రపంచంలో…

తమిళనాడా, జయలలితా? -కార్టూన్

తమిళనాడు ప్రజల పురచ్చి తలైవి జైలు పాలు కావడంతో ఆమె నియమించిన మంత్రివర్గం రాజీనామా చేసింది. జయలలితకు నమ్మినబంటుగా పేరు పడి సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఒకసారి అధిష్టించి జయలలిత విడుదల కాగానే తిరిగి ఆమె పీఠాన్ని ఆమెకు అప్పగించిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొత్త మంత్రివర్గమూ కొలువుతీరింది. పేరుకు కొత్త మంత్రివర్గమే గానీ పాత మంత్రివర్గాన్నే పన్నీర్ సెల్వం కొనసాగించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులు,…

మా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరదు -చైనా

భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా పర్యటన ముగిసిన నేపధ్యంలో పర్యటన అనంతర పరిస్ధితిని చైనా ప్రభుత్వ అధికార పత్రిక పీపుల్స్ డెయిలీ సమీక్షించింది. అమెరికా తన నేతృత్వంలో తలపెట్టిన చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరే అవకాశం లేదని మోడి అమెరికా పర్యటన ద్వారా గ్రహించవచ్చని పత్రిక పేర్కొంది. తమ అవగాహనకు కారణాలను పత్రిక వివరించింది. భారత విదేశీ విధానం పునాదులు అలీన ఉద్యమంలో ఉన్నందున ప్రపంచ ధృవ పోటీల్లో ఇండియా ఒక పక్షం వహించబోదని…

తెరేష్ బాబు విభజన గీత -సంస్మరణ

కవి, తెలంగాణ రాష్ట్ర వాసి పైడి తెరేష్ బాబు గారు చనిపోయారని మిత్రుల ద్వారా తెలిసింది. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ ఉద్యమ భావజాల సంబంధం వ్యక్తిగత పరిచయాలకు అతీతమైనది. ఆ కారణం వలన ఆయనకు నాకు మధ్య భావాత్మక వారధిగా నిలిచిన ‘విభజన గీత’ను, సంస్మరణ కోసం పునర్ముద్రిస్తున్నాను. పీడిత జనం ప్రపంచంలో ఏమూల ఉన్నా వారికి కూడా తెలియని ఒక సార్వజనీన ఏకత్వం వారి మధ్య ఏర్పడిపోయి ఉంటుంది. అది ఒక్కోసారి…