ప్రశ్న: కూలింది సోషలిస్టు రష్యాయేనా? -2

మొదటి భాగం తరువాయి…………   ఆ విధంగా సోవియట్ రష్యా ప్రజల సహాయంతో స్టాలిన్, మొట్టమొదటి సోషలిస్టు రాజ్యానికి ఎదురైన అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ సోషలిస్టు రాజ్యం వయసు అప్పటికి ఇంకా బాల్య దశలోనే ఉంది తప్ప పరిపక్వ దశకు చేరుకోలేదు. సోషలిస్టు నిర్మాణం నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూ చేయవలసిన ప్రయాణం. ఒక కుటుంబాన్ని సక్రమంగా నిర్మించుకోవాలంటేనే కిందిమీదులు అవుతుంటాం. అలాంటిది అనేక జాతులతోనూ, ప్రజా సమూహాలతోనూ, ప్రాంతాలతోనూ కూడి ఉండే బహుళజాతుల వ్యవస్ధను…

ప్రశ్న: సోవియట్ రష్యా ఎందుకు కూలింది?

ఎస్.రామ కృష్ణా రావు: Two three decades ago there was cold war between America & Russia. Both were competing for no1 position. But down the line Russia faded away and USA is actively participating in almost all parts of the world’s politics. Russia became neutral & insignificant. I would like to know what went wrong with…

కాంగ్రెస్ తిరిగి ఎప్పటికీ లేచేను? -కార్టూన్

నాయకుడు: “లే, లే! మనం పోరాడాలి!” కురువృద్ధ పార్టీ: “నన్ను కూలదోసింది ఎవరూ!? (నువ్వు కాదూ?)” *** మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి సంపూర్ణం అయిందని రాజకీయ విశ్లేషకులు, పత్రికలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సమీప భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టం అని తీర్మానిస్తున్నారు. కానీ పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటే ఎక్కువ ప్రభావం కలిగించే పరిస్ధితుల మధ్య ఆ పార్టీని కొట్టిపారేయడం తొందరపాటుతనమే కాగలదు. అయితే అందుకు ఒక…

లవ్ జిహాద్: మీరట్ అమ్మాయి కాదన్నా పంతం వీడని హిందూత్వ

  భారత దేశంలో ఇస్లామిస్టు సంస్ధలు ‘లవ్ జిహాద్’ కు కుట్ర చేస్తున్నాయని చెప్పడానికి మీరట్ అమ్మాయి కేసు పాఠ్య గ్రంధం లాంటి ఉదాహరణగా ఆర్.ఎస్.ఎస్ తదితర హిందూత్వ సంస్ధలు కోడై కూశాయి. తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేసుకుని, అత్యాచారం చేశారని ఆ అమ్మాయి మొదట్లో ఆరోపించింది. ఆ తర్వాత అసలు సంగతి వెల్లడిస్తూ రాజకీయ పార్టీలు, సంస్ధల ఒత్తిడితో, తన తండ్రి బలవంతం చేయడంతో తాను ఆ విధంగా చెప్పానని, తన తల్లిదండ్రుల…

పగవాడిక్కూడా వద్దు ఈ ఎబోలా బ్రతుకు! -ఫోటోలు

  అస్పృశ్యత ఇప్పుడు భారత దేశంలో అసలే లేదని కాదుగానీ, ‘మొలకు ముంత, వీపుకి తాటాకు’ కట్టుకుంటే తప్ప పంచముడిని బైటికి రానీయని గుప్తుల ‘స్వర్ణ యుగం’లో దళితుడి జీవితం ఎలా ఉండేది? ఈ అనుమానం ఎవరికైనా వస్తే పశ్చిమాఫ్రికా దేశాలలో ఎబోలా వ్యాధి పీడితుల బతుకులు గమనిస్తే ఒకింత అవగాహన రావచ్చు. ఎబోలా సోకినట్లు అనుమానం వచ్చిందా, ఇక ఆ వ్యక్తి చెంతకు ఎవరూ రారు. వారిని ఎవరూ తాకరు. వారి శరీరాన్ని మాత్రమే కాదు,…

మంచిరోజుల్లో మరో రోజు: కట్లు తెంచుకున్న డీజెల్

  ప్రధాని మోడి హామీ ఒసంగిన మంచి రోజుల్లో మరో శుభ దినం రానే వచ్చెను. డీజెల్ ధరల్ని మార్కెటింగ్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తూ డీ-రెగ్యులేషన్ కు మోడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను పడదిడుతూ కూడా, అదే కాంగ్రెస్ ఏలికలు నియమించిన రంగరాజన్ కమిటీ ఫార్ములాయే ఆదర్శంగా దేశీయ గ్యాస్ రేట్లను ఎం.ఎం.బి.టి.యు ఒక్కింటికి 4.2 డాలర్ల నుండి 5.61 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం…

ఎబోలా: వణికిపోతున్న ఆధునిక ప్రపంచం -ఫోటోలు

  మానవ వైద్య పరిజ్ఞానానికి ప్రాణాంతక వ్యాధులను కలిగించే వైరస్ లు ఇప్పటికీ కొరకరాని కొయ్యలుగానే ఉంటున్నాయని ఎబోలా వైరస్ విస్తృతి తెలియజేస్తోంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.  శత్రు దేశాలను లొంగ దీసుకోవడానికీ, సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్న దేశాలను దారికి తెచ్చుకోవడానికీ సామ్రాజ్యవాద దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రాణాంతక వైరస్ లను తమ ప్రయోగశాలల్లో భద్రపరచడమే కాకుండా, జెనెటిక్ ప్రక్రియల ద్వారా సరికొత్త ప్రాణాంతక వైరస్ లను సృష్టిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం నాణేనికి మరో…

కుర్చీలేని మహారాణి -కార్టూన్

  భారత దేశంలో మహా రాజులకు, మహా రాణులకు, యువరాజు, యువరాణిలకు కొదవలేదు. ఒకప్పడు రాజ్యాలు యేలి ప్రజలను పీడించుకు తిని సంపదలు కూడబెట్టిన రాజ్యాధీశులే నేడు ఆధునిక రాచరికం వెలగబెట్టడం కళ్ల ముందు కనపడుతున్న నగ్న సత్యం. ఆనాడు వారసత్వంగా రాచరిక ఆధిపత్యం సంక్రమించినట్లే నేడూ వారసత్వంగా రాజకీయ ఆధిపత్యం సంక్రమిస్తోంది. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను పడదిట్టిపోసే పార్టీలు కూడా తమ తమ వారసత్వాలను కాపాడుకుంటూ ప్రజల నెత్తిన గుడిబండల్ని మోపుతున్నారు. ఒకనాటి రాచరికాలు కొనసాగుతుండగానే…

ప్రధాన స్రవంతి పార్టీలకు సవాలు -ది హిందూ ఎడిట్

  (ఐరోపా దేశాల్లో మితవాద శక్తుల ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ శక్తులు వలస ప్రజలకు వ్యతిరేకంగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ కు కూడా వీరు వ్యతిరేకం. ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు తీవ్రం అయ్యేకొద్దీ వాటినుండి బైటపడేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనలు తిరుగుబాటు భావజాలం వైపుకి మరలకుండా ఉండేందుకు ప్రస్తుత పాలక వర్గాల పార్టీలు తామే ఒక తీవ్రవాద ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తెస్తారు. ప్రజలు తమలో తాము ఘర్షణ…

నల్లడబ్బు వివరాలన్నీ చెప్పలేరట!

నల్ల డబ్బు కధ మరో చుట్టు తిరిగొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నల్లడబ్బు వివరాలను దాచి ఉంచడానికి ఏయే కతలు చెప్పారో సరిగ్గా అవే కధల్ని మన అవినీతి వ్యతిరేక ఛాంపియన్ అయిన నరేంద్ర మోడీగారి ప్రభుత్వం వినిపిస్తోంది. దేశం దాటి పోయి అనేక రహస్య స్విస్ ఖాతాల బంకర్లలో శత్రు దుర్భేద్యమై నక్కిన నల్లడబ్బుని మెడపట్టి లాక్కొచ్చి జనానికి అప్పజెపుతామని వీరాలాపాలు పలికిన మోడి గారి ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పిన మాటల్నే చిలక పలుకుల్లా వల్లిస్తోంది. ఎన్.డి.ఏ…

ప్రశంసనీయమైన ప్రయత్నం -ది హిందు ఎడిట్

(స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ సాధనాలలో వినియోగించే నేవిగేషన్ సంకేతాల ప్రసారం కోసం ఇండియా సొంతగా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా అందిస్తున్న జి.పి.ఎస్ సేవల తరహాలో సొంత వ్యవస్ధను ఏర్పరుచుకునే క్రమంలో మూడవ ఉపగ్రహాన్ని ఇండియా గురువారం ప్రయోగించింది. ఇతర దేశాలపై ఆధారపడకుండా భారత ప్రజలకు స్వయంగా వివిధ ప్రయాణ నేవిగేషన్ సేవలను అందించే తాజా ఉపగ్రహ ప్రయోగంపై ది హిందూ అందించిన ఎడిటోరియల్.) అత్యంత సులభంగా రాకెట్లను ప్రయోగించడం భారత దేశానికి చెందిన పోలార్…

హుద్ హుద్: లెక్కించ అలవికాని నష్టం -ఫోటోలు

హుద్ హుద్ పెను తుఫాను వల్ల మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లిందో లెక్కించడం సాధ్యం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నష్టం 60 వేల కోట్లా లేక 70 వేల కోట్లా అన్నది తేల్చలేమని, అది ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యే వ్యవహారం కాదని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పరిశీలకులు, విశ్లేషకులు ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. “నష్టం 60,000 కోట్లా లేక 70,000 కోట్లా అన్నది చెప్పడం చాలా కష్టం. సీనియర్ అధికారులు జరిగిన…

వైజాగ్ లో చంద్రబాబుకు ఎల్-బోర్డు -కార్టూన్

వాహన తోలకం (డ్రైవింగ్) నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? తోలకం నేర్చుకుంటున్న వాహనానికి L-బోర్డు తగిలిస్తాం. రోడ్డు రవాణా విభాగం వాళ్ళు ఈ మేరకు నిబంధన విధిస్తారు. తోలకం నేర్చునేవారు తమ దరిదాపుల్లో ఉన్నప్పుడు ఇతర వాహనదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఎల్-బోర్డు సూచిస్తుంది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక ఆశలు కల్పించారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని కొన్నాళ్లు చెప్పారు. నయా రాయపూర్ నిర్మాణం బాగుందని కొన్నాళ్లు…

కన్నడం మాట్లాళ్లేదని ఈశాన్యీయులను చావబాదారు

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా భారత దేశంలో జాతి విద్వేషం (రేసిజం) లేదని గర్వంగా చెబుతుంటారు. (తద్వారా జాతి విద్వేషాన్ని తలదన్నే కులవివక్ష ఉనికిని నిరాకరిస్తారు.) ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షతో పాటు భాషా వివక్ష కూడా అమలు చేయవచ్చని బెంగుళూరులోని ముగ్గురు భాషా పరిరక్షకులు చాటారు. తద్వారా జాతి వివక్షలోని ఒక వింత రూపాన్ని ఆవిష్కరించారు. మంగళవారం రాత్రి బెంగుళూరులోని ఒక హోటల్ లో జరిగిందీ ఘటన. బెంగుళూరు (నార్త్-ఈస్ట్) డి.సి.పి వికాస్ కుమార్ ప్రకారం…

మొరేల్స్ మరియు ఆయన నైతిక ధృతి -ది హిందు ఎడిట్

(ఇవా మొరేల్స్ వరుసగా మూడో సారి బొలీవియా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 60 శాతం ఓట్లు దక్కాయి. బొలీవియాలోని స్ధానిక ఆదిమ జాతుల సంతతికి చెందిన వ్యక్తి మొట్టమొదటిసారి అధ్యక్షుడు కావడం మొరేల్స్ సాధించిన ఘనత కాగా, వరుసగా మూడోసారి కూడా అధికారంలో కొనసాగడం మరో ఘనత. దేశ సంపదలను దేశ ప్రజలకే వినియోగపెట్టాలన్న సూత్రాన్ని కాస్త అటు ఇటుగా అమలు చేస్తున్న దేశాల్లో బొలీవియా ఒకటి. మొరేల్స్ విజయంపై ది హిందూ…