హుస్సేన్ ఒబామాది ఏ మతం?

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మతం ఏమిటన్నది అనేకమంది అమెరికన్లకు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. ఆయన ముస్లిం అని నమ్మేవారు అనేకమంది ఉన్నారు. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీని అభిమానించే అమెరికన్ ఓటర్లలో మెజారిటీ ఒబామా ముస్లిం మతానికి చెందిన కుటుంబం నుండే వచ్చారని గట్టిగా నమ్ముతున్నారు. ఆయనది ఏ మతమో తెలియదు అని చెప్పేవారిని కూడా కలుపుకుంటే ఆయన క్రైస్తవులు అని నమ్మనివారి సంఖ్య ఇంకా అనేక రెట్లు ఉంటుంది. బారక్ ఒబామా పూర్తి పేరు…

సెలవులో రాహుల్ -ది హిందు ఎడిటోరియల్

[Rahul on Leave శీర్షికన నిన్న ది హిందులో ప్రచురితం అయిన ఎదిరోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్] రాహుల్ గాంధీ ఆత్మ శోధనకు ఎంచుకున్న ప్రస్తుత కాలం కంటే మించిన గడ్డు కాలం మరొకటి ఉండబోదు. పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలకు సరిగ్గా ముందు ఆయన ఆ పనికి పూనుకున్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్న అవమానకర ఓటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వం…

రాహుల్ సెలవు చీటీ -కార్టూన్

గత కొద్ది రోజులుగా పత్రికల్లో నానుతున్న వార్త ‘రాహుల్ ప్రకటించిన సెలవు (leave of absense).’ ఈ వార్త హెడ్ లైన్ మొదట చదివిన వారికి ఆయనిక శాశ్వతంగా రాజకీయాలకు సెలవు ప్రకటించారేమో అనిపించింది. వార్తలోకి వెళ్ళాక అదేమీ లేదని కొద్ది రోజుల పాటు ఆయన రాజకీయాల నుండి సెలవు పుచ్చుకుంటున్నారని అర్ధం అయింది. అంతలోనే ఆయన ప్రకటన హాస్యస్ఫోరకంగానూ తోచింది. ఎందుకంటే, ఓ పాత కధ ఉండేది. ఒక పంతులు గారు పడవలో నది దాటుతూ…

నితీష్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

బీహార్ ముఖ్యమంత్రిగా జనతా దళ్ (యునైటెడ్) నేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిలోని ఒక దశ ముగిసింది. అయితే, ఆయన పునరాగమనంతో అక్టోబర్ లోపు జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరో రాజకీయ పునరేకీకరణ దశ ఆరంభం అవుతుంది. ఇప్పటివరకు మనం చూసిన, జితన్ రామ్ మంఝి రాజీనామాకు దారి తీసిన… పరిణామాల కంటే మరింత తీవ్రమైన స్ధాయిలో రాజకీయ కవ్వం చిలకబడే అవకాశం కనిపిస్తోంది. 2010 ఎన్నికల్లో ప్రజల…

నితీష్: ఆట అనుకున్నది పాటు అయింది -కార్టూన్

ఎట్టకేలకు నితీష్ కుమార్ కి కోరుకున్న కుర్చీ దక్కింది. పెద్ద త్యాగమూర్తి లాగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన తరపున ఒక దిష్టి బొమ్మను నిలబెట్టి ఆనక ఆ దిష్టి బొమ్మను దింపి అటు పదవీ త్యాగ ప్రతిష్టను సంపాదించవచ్చని, ఇటు పదవీ వియోగ దుఃఖాన్ని తప్పించవచ్చని భావించిన నితీష్ కుమార్ కి అనుకున్నది ఎలాగో దక్కించుకునే సరికి తాతలు దిగి వచ్చారు. ముఖ్యమంత్రి కుర్చీ ఆటను పిల్లాడి ఆటగా మార్చి వేసి చివరికి మళ్ళీ…

అమెరికా: మంచు తుఫాను అంటే 100 అంగుళాలా! -ఫోటోలు

అమెరికా ఈశాన్య రాష్ట్రాలను వణికించిన హిమపాతం -బ్లిజ్జర్డ్- గురించి రెండు వారాల క్రితం తెలుసుకున్నాం. నిజానికి ఒక్క బ్లిజ్జర్డ్ మాత్రమే కాదు. గత కొద్ది వారాలుగా ఆ ప్రాంతాన్ని వరుస మంచు తుఫాన్లు చుట్టుముట్టి మోదుతున్నాయి. ఈ తుఫాన్ల తీవ్రత ఎంత అధికంగా ఉన్నదంటే గత నెల రోజులలో అక్కడ 100 అంగుళాల మంచు కురిసింది. మరీ ముఖ్యంగా న్యూ ఇంగ్లండ్ గా పిలిచే 6 ఈశాన్య రాష్ట్రాలు (కనెక్టికట్, మైన్, మసాచూసెట్స్, న్యూ హ్యాంప్ షైర్,…

లౌకికవాదం ఒక విధాన ఎంపిక కాదు -ది హిందు ఎడిట్

[“Secularism is not a policy option” శీర్షికన ఈ రోజు -ఫిబ్రవరి 19- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. ఇది చాలా విలువైన ఆర్టికల్. ముఖ్యంగా (ఆంగ్లం ఒరిజినల్ లో) రెండవ పేరాలో (అనువాదంలో చివరి పేరాలో) ప్రస్తావించిన అంశాలు కలకాలం గుర్తు పెట్టుకోవలసినవి. పాఠకులు వీలయితే బట్టీయం వేసి సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రీ ప్రొడ్యూస్ చేసినా తప్పు లేదు. -విశేఖర్] ********** మతం ప్రాతిపదికన హింసా, విద్వేషాలను…

ప్రధాని అయ్యాక ‘రాజధర్మం’ గుర్తుకొచ్చింది! -కార్టూన్

“ఏ సాకుతో అయినా సరే, ఏ మతానికైనా వ్యతిరేకంగా హింస జరగడం మనం ఆమోదించరాదు. అలాంటి హింసను నేను గట్టిగా ఖండిస్తాను. ఈ విషయంలో నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.” “(మతపరమైన) విశ్వాసం కలిగి ఉండడంలో పూర్తి స్ధాయి స్వేచ్ఛ ఉండేలా నా ప్రభుత్వం చూస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా, అవాంఛనీయ ప్రభావం లేకుండా అతడు/ఆమె తనకు ఇష్టమైన మతంలో కొనసాగేందుకు లేదా అనుసరించేందుకు, ఎవరూ నిరాకరించలేని హక్కు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారని గుర్తిస్తుంది. బహిరంగంగా…

ఎఎపి ఎలా గెలిచింది? -కార్టూన్

  ఎఎపి గెలుపుకు కారణం ఏమిటన్న ఒకే ఒక్క అంశంపై పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు, విశ్లేషణలు, నివేదికలు, అధ్యయనాలు వెలువడుతున్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది. ప్రజల ప్రయోజనమే రాజకీయాల లక్ష్యం అన్న ప్రాధమిక సూత్రం తెలిసిన వారికి ఎఎపి గెలుపు ఎలా సాధ్యం అయిందో తెలియడానికి పెద్దగా సిద్ధాంతాలతో పని లేదు. బూటకపు వాగ్దానాలు కురిపించడానికి ఏ మాత్రం సిగ్గుపడని, స్వార్ధ ప్రయోజనాలే పరమావధిగా పని చేసే పార్టీలు నిండా వ్యాపించిన…

అమెరికాలో హిందూ ఆలయంపై విద్వేష దాడి

హిందూ జాతీయవాద నేత భారత ప్రధానిగా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ లోనే అనేక చర్చిలపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన ఓ హిందు ఆలయంపై విద్వేషపూరిత దాడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ నుండి వెళ్తూ వెళ్తూ మైనారిటీ మతావలంబకుల హక్కులను కాపాడాలని హిత బోధ చేసి వెళ్లారు. ఆయన సందేశానికి కొనసాగింపుగానా అన్నట్లుగా ఇప్పుడు ఆయన అధ్యక్షరికంలో ఇక్కడి చర్చిలపై దాడికి ప్రతి చర్య అమెరికా నేలపై చోటు చేసుకుంది.…

WW II: డ్రెస్డెన్ పై బ్రిటన్-అమెరికా పైశాచిక బాంబింగ్ కి 70 యేళ్ళు

  రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో అమెరికా, బ్రిటన్ లు సాగించిన మారణహోమం అంతా ఇంతా కాదు. వరల్డ్ వార్ II అనగానే యూదులపై నాజీల దుష్కృత్యాలు, హిట్లర్ ఫాసిజం గుర్తుకు వస్తాయి. అలా గుర్తుకు వచ్చేలా చరిత్ర రచన జరిగింది. కానీ జర్మనీ, ఇటలీ ల్లోని ఫాసిస్టు నియంతృత్వాలను సాకుగా చూపిస్తూ ఆ దేశాలు ఓడిపోతూ వెనక్కి పారిపోతున్న కాలంలో అమెరికా, బ్రిటన్ లు తెగబడి అనేక మారణహోమాలు సృష్టించాయి. హీరోషిమా, నాగసాకి నగరాలపై…

పాలిచ్చేందుకు అనుమతివ్వని కాంట్రాక్టర్, రోజుల బిడ్డ మృతి

  పసి బిడ్డ నిండు ప్రాణాల కంటే కాంట్రాక్టులో మిగిలే రూపాయి నోట్లకే ఎక్కువ విలువ కట్టిన ఓ పాషాణ హృదయుడి కఠినత్వం ఇది. మానవ విలువలు అడుగంటిన లోకం విధించిన డబ్బు బంధనాలలో తల్లి బందీ అయిందని తెలియక పాల కోసం గుక్క పట్టి ఏడ్చి ఏడ్చి విసుగెత్తి కానని లోకాలకు తరలి వెళ్ళిన పసి బిడ్డ విషాదాంతం ఇది. మెదక్ జిల్లాలో హత్నూర మండలలో హృదయాల్ని పిండి వేసే ఈ ఘోర ఉదంతం చోటు…

అరవింద్, మోడిల సమావేశం -కార్టూన్

  ఢిల్లీ అవడానికి రాష్ట్రమే అయినా పాలన రీత్యా అది పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు. పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడాలి. ముఖ్యంగా శాంతి భద్రతలు! మామూలుగా అయితే శాంతి భద్రతలు రాష్ట్రాల హక్కు. రాష్ట్రాల్లోని పోలీసులే శాంతి భద్రతలను చూస్తుంటారు. అలాంటి పోలీసు విభాగం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అదుపులో ఉంటుంది. ఈ కారణం వలన పోలీసులు ఢిల్లీ సి.ఎంకు సమాధానం చెప్పరు. దరిమిలా రాష్ట్రంలో ఎలాంటి నేరం జరిగినా…

కేజ్రీవాల్ ఇంకో పెద్ద మెట్టు ఎక్కాలి -కార్టూన్

  ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్/ఎఎపి ఒక పెద్ద మెట్టు ఎక్కి వచ్చారు. ఇప్పుడిక పూర్తి స్ధాయి పాలన అనే మరో పెద్ద మెట్టు ఎక్కాలి. ఆయన, ఆయన పార్టీ అన్నీ రకాలుగా విఫలం కావాలని సంపన్న వర్గాలు, వారి పార్టీలు తీవ్రంగా కోరుకుంటున్నందున ఢిల్లీ రాష్ట్ర పాలన ఎఎపికి నల్లేరుపై నడక ఏమీ కాదు. పార్టీ వయసు, అనుభవం… ఇత్యాది అంశాల రీత్యా ఎఎపి సైజు చాలా చిన్నదని కార్టూనిస్టు…

ఎఎపి ఓటర్లు దళితులు, పేదలు, యువకులు

  అత్యధిక సీట్లను గెలుచుకోవడం బట్టి ఎఎపికి ధనిక, పేద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలూ ఎఎపికి ఓటు వేసి ఉంటారని భావించవచ్చు. కానీ కాస్త లోతుకు వెళ్తే ఈ పరిశీలనలో లోపం కనిపిస్తుంది. ఎందుకంటే బి.జె.పికి వచ్చిన ఓట్ల శాతం తక్కువేమీ కాదు. 32.2 శాతం ఓట్లు సీట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడి ఉండకపోవచ్చు గాని ఒక పార్టీకి అన్ని ఓట్లు పడడాన్ని తక్కువ చేసి చెప్పలేము. అందుకే మరింత లోతుకి వెళ్ళి…