వ్యాపం: సమాచారాన్ని తొక్కిపెట్టిన సి.ఎం చౌహాన్

సుప్రీం కోర్టు రంగంలోకి దిగడంతో హడావుడిగా సి.బి.ఐ విచారణను కోరి ‘ఆ క్రెడిట్ నాదే’ అని చెప్పుకుంటున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బండారం క్రమంగా బయిటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా మధ్య ప్రదేశ్ శాసన సభకు నాయకత్వం వహించే చౌహాన్ తన శాఖలో జరిగిన కుంభకోణం గురించిన సమాచారాన్ని తొక్కిపెట్టి సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. అసలు కుంభకోణాన్ని వెలికి తీసిందే తానని డంబాలు పలుకుతున్న చౌహాన్ సభను తప్పుదారి…

వ్యాపం స్కాం: నిష్క్రియ, అబద్ధాలు, హత్యలు! -2

మొదటి భాగం తరువాత…… . సాక్షులు, నిందితుల హత్యలు కుంభకోణంలో అత్యంత దారుణమైన విషయం నిందితులు, సాక్షుల మరణాలు. సాక్షులను మాయం చేస్తే కేసు అనుకున్న విధంగా తిప్పుకోవచ్చన్నది పాత సూత్రమే. కానీ వ్యాపం కుంభకోణంలోని సాక్షులు, నిందితులు ఇరువురూ డజన్ల సంఖ్యలో అనుమానాస్పద రీతిలో మరణించడం -కనీసం సమీప గతంలో- ఎన్నడూ ఎరుగనిది. సంఘటిత నేరస్ధ ముఠాలు పధకం ప్రకారం పని చేస్తే తప్ప ఇలాంటి మరణాలు సాధ్యం కావు. అత్యున్నత స్ధాయిలో ఉన్న సాక్షులు,…

వ్యాపం: మోడి అవినీతి పాలనలో ఓ మైలు రాయి -1

తమది నీతిమంతమైన పాలన అంటూ ప్రధాని నరేంద్ర మోడి చెప్పుకునే గొప్పలను నిలువునా చీరేస్తూ బి.జె.పి ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. యు.పి.ఏ పాలనలో అవినీతి కుంభకోణాలు వెలుగు చూసేందుకు మూడు నాలుగు సంవత్సరాల సమయం తీసుకుంది. యు.పి.ఏ రికార్డును ఎన్.డి.ఏ-2 తిరగరాసింది. యు.పి.ఏ/కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని కుంభకోణాలే పెట్టుబడిగా అధికార లాభం సంపాదించిన ఎన్.డి.ఏ-2/బి.జె.పి సంవత్సరం తిరక్కుండానే తనకు, కాంగ్రెస్ కు ఎంతమాత్రం తేడా లేదని వేగంగా రుజువు చేసుకుంటోంది. కాంగ్రెస్ అవినీతిపై…

వ్యాపం దర్యాప్తు ముగుస్తోందిట! -కార్టూన్

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్: దర్యాప్తు ఇక ముగింపుకు వస్తోంది! ****************** ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్’ అన్నది మధ్య ప్రదేశ్ లో వివిధ కోర్సులకు, ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. ఆంగ్లంలో దీని పేరు: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు. పొడి అక్షరాల్లో ఎం.పి.పి.ఇ.బి గా దీన్ని పిలుస్తారు. ప్రి-ఇంజనీరింగ్, ప్రి-మెడికల్, ఎం.సి.ఏ, టీచింగ్, పోలీస్ తదితర కోర్సులు, ఉద్యోగాల అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహించడం ఈ సంస్ధ పని. ఈ సంస్ధలోని ఉన్నతాధికారులు…

వ్యాపం స్కాం విచారణ -ది హిందు ఎడిటోరియల్

[జులై 4 తేదీన ది హిందు పత్రిక ‘The Vyapam scam trail’ శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] మధ్య ప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం 2007 సంవత్సరం నాటిది. 2013లో కొన్ని వివరాలు వెలుగు చూసిన తర్వాతనే కుంభకోణంపై నేర పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (వ్యవసాయిక్ పరీక్షా మండల్ లేదా వ్యాపం) కు చెందిన అధికారులు వివిధ కోర్సులకు జరిగే అర్హత పరీక్షలను, ఉద్యోగాల నియామకాలను 6 సంవత్సరాలుగా…

‘రాజకీయం’ అను యోగాసనం -కార్టూన్

చూడ్డానికి సామాన్యంగా కనిపిస్తున్న ఈ కార్టూన్ లో లోతైన అర్ధం దాగి ఉంది. ప్రధాన మంత్రి పదవి లాంటి ముళ్ళ కుర్చీని యోగాసనాల సహాయంతో నరేంద్ర మోడి అవలీలగా నిర్వహిస్తున్నారని ఈ కార్టూన్ చెబుతున్నట్లు మొదటి చూపులో అనిపిస్తుంది. కానీ ‘డెవిల్ ఇన్ ద డీటైల్స్’ అన్నట్లుగా కార్టూన్ అంతరార్ధం అంతా ఆ నాలుగు పదాల కార్టూన్ వ్యాఖ్యానంలో దాగి ఉంది. ఆ నాలుగు పదాల వ్యాఖ్య: THE YOGA OF POLITICS: ఏమిటి ఈ వ్యాఖ్య…

హవాలా స్కాంలో నేను రాజీనామా చేశా -అద్వానీ

బి.జె.పి పితామహుడు మనసులో మాట కక్కేశారు. లలిత్ మోడి అవినీతి కుంభకోణం నుండి బైటపడే మార్గం ఏమిటో తన పార్టీ నాయకులకు చూపారు. వివిధ అవినీతి మరియు అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తదితర బి.జె.పి మంత్రులు తక్షణమే తొక్కవలసిన బాట ఏమిటో ఆయన స్పష్టంగా చూపారు. వీరందరికీ మార్గం చూపడం అంటే…

రాజే: అసెంబ్లీ క్లీన్ చిట్ అక్కరకు వచ్చేనా! -కార్టూన్

  ఐ.పి.ఎల్ మాజీ బాస్, బి.సి.సి.ఐ మాజీ ఉపాధ్యక్షుడు, పారిపోయిన నేరస్ధుడు అయిన లలిత్ మోడి వ్యవహారం రాజస్ధాన్ ముఖ్యమంత్రిని వదిలేట్లు లేదు. రాజస్ధాన్ అసెంబ్లీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినా లలిత్ మోడీ వ్యవహారం సదరు క్లీన్ చిట్ ను వెక్కిరిస్తూనే ఉంది. లలిత్ మోడీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు, ఐ.పి.సి కేసు దాఖలు కావడంతో ఆయన లండన్ పారిపోయాడు. వలస వచ్చిన పక్షిగా అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుని అందుకు దశాబ్దాల నాటి…

ట్విట్టరై వెళ్ళి కాకిలా తిరిగొచ్చింది -కార్టూన్

జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించాలని మోడి ప్రభుత్వం కోరడం వెనుక యోగాను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ఉద్దేశ్యం మాత్రమే ఉన్నదని ఆర్.ఎస్.ఎస్ మాజీ ప్రతినిధి (spoksperson), బి.జె.పి జనరల్ సెక్రటరీ ప్రచురించిన ట్వీట్ తో స్పష్టం అయింది. జూన్ 21 తేదీన రాజ్ పధ్ లో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోడి ముఖ్య అతిధిగా హాజరై యోగాసనాలు వేశారు. “ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హమీద్ అన్సారీ పాల్గొనకపోవడం వెనుక…

బి.జె.పి సొంత క్విడ్-ప్రో-కో యే లలిత్ గేట్! -2

మానవతా సాయం? అయితే ‘మానవతా సాయం’ వాదనలోని డొల్లతనం త్వరలోనే బైటపడింది. లలిత్ మోడీ ‘ఇన్ స్టా గ్రామ్’ అనే ఫోటో షేరింగ్ సోషల్ వెబ్ సైట్ లో అప్పటి తేదీలలో ప్రచురించిన ఫోటోలు లలిత్ మోడీ విందు, విలాసాలలో తేలియాడుతున్న సంగతినే వెల్లడించాయి తప్ప ఆయన భార్య కేన్సర్ చికిత్స పొందుతున్న సంగతిని చూచాయగా నైనా తెలియజేయలేదు. బ్రిటిష్ పాస్ పోర్ట్ జారీ అయ్యేలా సాయం చేసిన బ్రిటన్, ఇండియా రాజకీయ పెద్దలకు తాను ఎంత…

లలిత్ గేట్: మోడి అవినీతి పాలనకు సాక్ష్యం -1

నరేంద్ర మోడి నీతిమంతమైన పాలనలో మొదటి ‘గేట్’ తెరుచుకుంది. ‘నా యేడాది పాలనలో ఒక్క కుంభకోణం అయినా జరిగిందా? నాయకుల పిల్లలు, అల్లుళ్ళకు అయాచిత లబ్ది ఒనగూరిందా? గత యేడాదిలో ప్రజలకు మంచి రోజులు వస్తే దేశాన్ని దోచుకునేవారికి చెడ్డ రోజులు వచ్చాయి” అని తమ ప్రభుత్వ వార్షిక దినాన మోడి ప్రకటించిన కొద్ది రోజులకే ‘లలిత్ గేట్’ బట్టబయలయింది. నరేంద్ర మోడి ఎడతెగకుండా చేస్తున్న ‘నీతిమంతమైన పాలన’ చప్పుళ్లను అపహాస్యం చేస్తూ లలిత్ మోడి పాస్…

క్రికెట్: బడా బాబుల కేకు పంపకం -కార్టూన్

  ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ నుండి ఒక్క పూటలో ముగిసిపోయే టి20 మ్యాచ్ ల వరకు క్రికెట్ ఆట ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఆట గమ్యం ఏమిటన్నది చూస్తే జనుల మానసికోల్లాసం కాకుండా డబ్బు సంపాదనే అని స్పష్టం అవుతుంది. ఏ ఆట అయినా మనిషి యొక్క శారీరక, మానసిక, మేధో శక్తులను మెరుగుపరచడానికి, దైనందిన జీవనం నుండి కాసింత బైటపడి సేద తీరడానికీ, ఆరోగ్యం పెంపొందించడానికి పుట్టినదే. కానీ సమాజం డబ్బు జబ్బుతో బాధపడడం…

ఇంతకీ మోడి యోగా చేస్తారా? -పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు రావలసిన సందేహమే వచ్చింది. ఎవరి ప్రయత్నము, ప్రోత్సాహము లేకుండానే సానుకూల గుణాల వల్ల ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన యోగాను సైతం రాజకీయంగా సొమ్ము చేసుకునే పనిలో పడిపోయిన బి.జె.పి, నరేంద్ర మోడీలు బహుశా ఈ ప్రశ్నను ముందే ఊహించి ఉండవచ్చు. అయితే పుతిన్ నుండి ఈ ప్రశ్న వస్తుందని మాత్రం ఊహించి ఉండరు. అంతర్జాతీయ విలేఖరులతో మాట్లాడుతున్న సందర్భంలో ఐ.ఏ.ఎన్.ఎస్ (ఇండియా అబ్రాడ్ న్యూస్ సర్వీస్) వార్తా సంస్ధ విలేఖరి…

యోగా: ఇందుగల దందులేదని… -ఫోటోలు

“ఇందుగలదందులేదని సందేహంబు వలదు యోగా సర్వోపగతుందెందెందు వెదకి చూచిన అందెందే గలదు” అని చదువుకోవచ్చని ఖాయంగా అనిపిస్తుంది కింది ఫోటోలు చూస్తే! ‘అంతర్జాతీయ యోగా దినం’ అంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు గానీ, నిజానికి యోగా ఎన్నడో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉంది. 1982 లోనే అమెరికా పౌరులు యోగా, ధ్యానం లను అభ్యసించడమే కాకుండా కొందరు దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేశారని కూడా ఈ బ్లాగర్ కి తెలుసు. ఎలాగంటే ఆ సంవత్సరంలో ప్రఖ్యాత…

ఈసారి ధర్మరాజు రధం క్రుంగింది -కార్టూన్

ఎన్.డి.ఏ-1 ప్రభుత్వం లాగానే ఎన్.డి.ఏ-2 ప్రభుత్వం కూడా భారత దేశంలోని వివిధ కళా, సాంస్కృతిక, విద్యా వ్యవస్ధలను కాషాయీకరించే పనిలో పడిపోయింది. చరిత్ర రచనా పద్ధతి (historiography) లోకి జొరబడి భారత దేశ చరిత్రకు సొంత అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఐ.సి.హెచ్.ఆర్ డైరెక్టర్ నియామకాన్ని చేసిన కేంద్రం తాజాగా పూనె లోని ప్రతిష్టాత్మక ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ కి కూడా అర్హతలు లేని బి.జె.పి నేతను నియమించిన విమర్శలను ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలో పూనే లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్…