భారత వ్యవసాయం మిగులు ఎవరి సొంతం! -12

(11వ భాగం తరువాత………) భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 12 – వ్యవసాయ రాబడిలో మిగులు స్వాధీనం చేసుకునే సెక్షన్ రైతు కుటుంబాల్లో వినియోగ ఖర్చులకు పోను మిగులు సాధించే సెక్షన్ సంగతి చూద్దాం. పెద్ద సైజు కమతాల రైతుల నుండి అతి పెద్ద సైజు కమతాల భూస్వాముల వరకు వ్యవసాయంలో మిగులు సాధిస్తున్నారు. అనగా 10 హెక్టార్లు (25 ఎకరాలు) అంతకు మించి కమతాల రైతులు నికరంగా మిగులు సాధిస్తున్నారు. అయితే 10…

వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం: కమతాలవారీ అసమానతలు -11

(10వ భాగం తరువాత………) భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 11 – ఉత్పత్తి మరియు ఉత్పాదక శక్తులలో ప్రాంతాలవారీ మరియు కమతాల వారీ అసమానతలు ప్రాంతీయ అసమానతలు ఇతర అంశాలతో సమానంగా పరిగణించాలి. 1960ల మధ్య నుండి పంజాబ్, హర్యానా ఉత్తర ప్రదేశ్ లు స్ధిరంగా అధిక వృద్ధి రేటును నమోదు చేశాయి. మరోవైపు తూర్పు ప్రాంతాలైన ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ లు నిరాశానకంగా ఉత్పత్తి సాధించాయి. ఇటీవల కాలంలో…

ఐనోళ్ళకు పూలు, కానోళ్లకు రాళ్ళు! -కార్టూన్

అవినీతికి తర తమ బేధాలు ఉంటాయి! అలాగని బి‌జే‌పి అధ్యక్షులు అమిత్ షా చెప్పదలిచారు. లేకపోతే ఓ వంక యెడ్యూరప్పను మళ్ళీ కర్ణాటక బి‌జే‌పి అధ్యక్షుడిని చేస్తూ మరో వంక తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వంగా తిట్టిపోయడం ఎలా సాధ్యపడుతుంది? యెడ్యూరప్ప వ్యవహారం తెలియనిదేమీ కాదు. అవినీతి ఆరోపణలతో ఆయనను తప్పించినందుకు పార్టీని చీల్చి వేరే పార్టీ పెట్టుకున్నారాయన. బి‌జే‌పి ఓట్ల చీలికతో, అనంతరం కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం, అధికారం…

రష్యా జెట్ ని కూల్చే వాళ్ళమే -జాన్ కెర్రీ

అమెరికా పాలకుల రష్యా వ్యతిరేక మేనియా (పిచ్చి) కొనసాగుతోంది. రష్యా ఫైటర్ జెట్ ఒకటి తమ యుద్ధ నౌకకు ప్రమాదకర రీతిలో సమీపంగా చక్కర్లు కొట్టి వెళ్లిందని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఆరోపించాడు. “అమెరికా యుద్ధ నౌక వద్ద రొద పెడుతున్న రష్యా జెట్ విమానాన్ని (కాస్త ఉంటే) కూల్చేసే వాళ్ళమే” అని ఆయన బహిరంగంగానే ఎటువంటి శశభిషలు లేకుండా బెదిరింపు జారీ చేశాడు. పోలండ్, అమెరికాల మిలట్రీ బలగాలు పోలండ్ తీరంలో విన్యాసాలు…

రష్యా ఎత్తులను పసిగట్టలేకపోతున్నాం -అమెరికా

ప్రపంచం లోని వివిధ యుద్ధ క్షేత్రాలలో అమెరికా మద్దతు ఉన్న పక్షాలు వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపధ్యంలో అమెరికా మిలట్రీ అధికారులు నిస్పృహకు లోనవుతున్నారని వారి ప్రకటనలు సూచిస్తున్నాయి. రష్యాయే ఇప్పుడు తమకు ప్రధాన శత్రువు అని ప్రకటించెంతవరకూ వారు వెళ్తున్నారు. “సెప్టెంబర్ 11, 2001 తర్వాత అమెరికా గూఢచార విభాగం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద వైఫల్యం మాస్కో ఎత్తులను ముందుగా పసిగట్టలేకపోవడం. ఈ వైఫల్యం ఫలితంగా క్రిమియాపై రష్యా దాడిని ముందుగా పసిగట్టలేకపోయాము. సిరియాలో రష్యా…

భారత వ్యవసాయం ప్రస్తుత స్ధితిగతులు -10

– భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ – పార్ట్ 10 (9వ భాగం తరువాత…..) చాప్టర్ V భారత వ్యవసాయం ప్రస్తుత స్ధితిగతులు జనవరి – డిసెంబర్ 2003 నాటి జాతీయ నమూనా సర్వే (నేషనల్ శాంపుల్ సర్వే – ఎన్‌ఎస్‌ఎస్) 59వ రౌండు నివేదిక ఇలా పేర్కొంది, “ఈ నివేదిక సాగు యాజమాన్యం (ఆపరేషనల్ హోల్డింగ్స్ – ఓ‌హెచ్) లోని భూముల మొత్తం విస్తీర్ణం మరియు సగటు విస్తీర్ణం లను పాఠకుల ముందు…

హరిత విప్లవం కాదది ఎరువుల పధకం! -పార్ట్ 9

భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ : పార్ట్ 9 8వ భాగం తర్వాత…. “‘దారిద్ర్య నిర్మూలనా చర్య’గా బిపిన్ చంద్ర పేర్కొన్న హరిత విప్లవాన్ని USAID (United States Assistance for International Development) కి చెందిన చీఫ్ ఎకనమిస్టు జాన్ డి మిల్లర్ “ప్రధానంగా ఒక ఎరువుల పధకం” గా అభివర్ణించాడు. “ఈ విప్లవాన్ని ప్రోత్సహించడంలో ఎరువుల కంపెనీలు, వాటి ధార్మిక సంస్ధలు (ఫౌండేషన్లు) మొదటి నుండి చురుకుగా వ్యవహరించాయి” అని మూని…

1947 అనంతర ఇండియాలో వ్యవసాయ సంబంధాలు

[గమనిక: A Note on Transition in Indian Agriculture శీర్షికన బెంగాల్ కు చెందిన అమితాబ్ చక్రవర్తి ఒక చిన్న పుస్తకాన్ని రచించారు. భారత దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి విధానంలో వస్తున్న మార్పుల గురించి మార్క్సిస్టు-లెనినిస్టు దృక్పధంతో చర్చించడానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది. పుస్తకాన్ని తెలుగులో అనువదించే కృషిలో భాగంగా ఇప్పటి వరకు 8 భాగాలు బ్లాగ్ లో ప్రచురించాను. 7వ భాగం మార్చి 27, 2014 తేదీన ప్రచురించాను. అనంతరం వివిధ కారణాల…

కరువు.. మీకు పట్టదా కేంద్రం గారూ! -కత్తిరింపు

ఎల్ నినో కారణమో మరింకేం గాడిద కారణమో జనానికి అనవసరం. వారికి తెలిసింది వర్షాలు పడకపోవడమే. వర్షారాధార వ్యవసాయం సాగకపోవడమే. భారత దేశంలో వ్యవసాయం సాగకపోతే 75 శాతం జనం ప్రభావితులవుతారు. వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగా ఖరీఫ్ వానలు (నైరుతి ఋతుపవనాలు) శీతకన్ను వేయడంతో అనేక రాష్ట్రాలు దుర్భిక్షంతో సతమతం అవుతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలు రెండూ ఉన్నాయి. గొప్పకు పోయి, హిందూత్వ స్ఫూర్తితో మన రాష్ట్రాల పాలకులు నదీ జలాలని పుష్కర మాతకు సమర్పించుకున్నారు.…

మహారాష్ట్ర: నీళ్ళు – క్రికెటు – డబ్బు!

“ఈ రకంగా మీరు (బి‌సి‌సి‌ఐ) నీళ్లని ఎలా వృధా చేయగలరు? జనం ముఖ్యమా లేక మీ ఐ‌పి‌ఎల్ మ్యాచ్ లు ముఖ్యమా? ఇంత అజాగ్రత్తగా ఎలా ఉండగలరు? నీళ్లని ఈ రకంగా ఎవరు వృధా చేస్తారు? ఇది నేరపూరిత వృధా. మహా రాష్ట్రలో పరిస్ధితి ఎలా ఉన్నదో మీకు తెలుసు. నీళ్ళు సమృద్ధిగా దొరికే మరే ఇతర రాష్ట్రానికైనా మీరు ఐ‌పి‌ఎల్ మ్యాచ్ లను తరలించడం ఆదర్శవంతం అవుతుంది.” జస్టిస్ వి ఎం కనడే, జస్టిస్ ఎం…

ఓ హత్యాకాండ నుండి గుణపాఠాలు -ది హిందు ఎడ్

[Lessons from a massacre -The Hindu, April 6, 2016- కు యధాతధ అనువాదం.] ********* అన్ని కేసుల్లోనూ ‘ఆలస్యంగా చేకూరిన న్యాయం’ను ‘నిరాకరించబడిన న్యాయం’తో సమానం చేసి చెప్పలేము. ఆలస్యంగా జరిగే దోష నిర్ధారణ సైతం “శిక్ష నుండి శాశ్వతంగా రక్షణ పొందడం” లాంటిది ఏమీ ఉండదన్న సందేశాన్ని పంపే సందర్భాలు కొన్ని ఉండవచ్చు. సాయుధ టెర్రరిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్ పేరుతో అత్యంత క్రూరమైన హత్యాకాండలో పాల్గొన్న 47 మంది పోలీసులకు జీవిత…

భారత్ మాతా కీ జై! ఇదొక సమస్యా?

“కంట్రోల్ టవర్ నుండి.. ‘భారత్ మాతా కీ జై’ అనకపోతే ఇండియా మీదుగా వెళ్లనివ్వరట!” ********* ‘భారత్ మాతా’ జ్వరం బి‌జే‌పి నేతలను ఇంకా వదల్లేదు. ఎందుకు వదులుతుంది, ఎలా వదులుతుంది? ఆ జ్వరాన్ని తెచ్చుకున్న కారణమే వేరాయే! మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆర్‌ఎస్‌ఎస్, యోగా వీరుడు బాబా రాందేవ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, బి‌జే‌పి అధ్యక్షుడు అమిత్ షా… అంతే లేని జాబితా! నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న పాడు…

లోతుల నుండి -ది హిందు ఎడ్

ఏప్రిల్ 4, 2016 నాటి ది హిందు సంపాదకీయం ‘Out of depth’ శీర్షికన ప్రచురితం అయిన సంపాదకీయంకు యధాతధ అనువాదం. –విశేఖర్ ********* చమురు మరియు సహజవాయు అన్వేషణ, ముఖ్యంగా లోతైన జలాల్లో (డీప్ వాటర్), ప్రమాదకర వ్యాపారం. అత్యున్నతమైన ఆద్యునిక సాంకేతిక పరిజ్ఞానం దానికి కావాలి; కనుక భారీ మొత్తంలో నిధులూ అవసరమే. తగిన సాంకేతిక పరిజ్ఞానం, సరిపడా నైపుణ్యం తోడు లేకుండా సంపద తవ్వి తీయాలని భావిస్తే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్…

శని గుడి: కోర్టు తీర్పు అమలు చేయని బి‌జే‌పి ప్రభుత్వం

దేవాలయంలో మహిళలకు ప్రవేశం నిరాకరించే అధికారం ఎవరికి లేదని ఆలయాల్లో లింగ వివక్ష పాటించకుండా చూడడం మహారాష్ట్ర ప్రభుత్వానికి విధిగా బాధ్యత ఉన్నదని రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తన చర్యల ద్వారా నిరాకరించింది. కోర్టు తీర్పు ఇచ్చిన ధైర్యంతో తృప్తీ దేశాయ్ నేతృత్వం లోని రెండు డజన్ల మంది కార్యకర్తలు ఈ రోజు (శనివారం, ఏప్రిల్ 2) ప్రయత్నించారు. వారిని ఊరి జనం అడ్డుకున్నప్పటికీ పోలీసులు, జిల్లా…

ఉత్తరాఖండ్: ఫ్లోర్ లేని చోట ఫ్లోర్ టెస్ట్! -కార్టూన్

“ఏ ఫ్లోర్ టెస్టూ?! వాళ్ళు అసలు ఫ్లోరే లేకుండా చేస్తిరాయే…!” ********* కాంగ్రెస్ ధరించిన అప్రజాస్వామిక కీర్తి కిరీటంలోని కలికితురాళ్లను బి‌జే‌పి ఒక్కొటొక్కటిగా దొంగిలిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే ప్రారంభమై ఇందిరా గాంధీ హయాంలో ఊపందుకున్న విచక్షణారహిత ‘ఆర్టికల్ 356 ప్రయోగం’ ప్రస్తుతం ప్రధాని మోడి నేతృత్వం లోని బి‌జే‌పి ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించిన బి‌జే‌పి (కేంద్ర) ప్రభుత్వం పరిస్ధితులు…