వామ్మో ఫేస్ బుక్!

“ఇక ఫేస్ బుక్ జోలికి పోకూడదు” అనిపించటాలుగా పరిస్ధితి వచ్చేసినట్లుంది చూడబోతే. లేకపోతే ఐ.టి చట్టం సెక్షన్ 66-ఎ పేరు చెప్పి ఈ వరుస అరెస్టులు ఏమిటి? బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై కార్టూన్ షేర్ చేశాడని ఒక ప్రొఫెసర్ ని అరెస్టు చేసి జైల్‌లోకి తోయించింది లగాయతు చిదంబరం కొడుకు కార్తీక్ దగ్గర్నుంచి యు.పి ప్రభుత్వం మీదుగా చండీఘర్ అమ్మాయి వరకూ ఫేస్ బుక్ వ్యాఖ్యలను క్రిమినలైజ్ చేయడం జాస్తి అయింది. తాడేపల్లి, కృష్ణమోహన్…

దళిత బాలికను చదివిస్తామని పిలిచి, అత్యాచారం చేసి…

అభం శుభం తెలియని 13 సంవత్సరాల దళిత బాలికను పని చేయించుకుంటూ చదివిస్తామని పిలిపించుకుని అత్యాచారం చేసిన దుర్మార్గం ముంబైలో వెలుగులోకి వచ్చింది. 72 సంవత్సరాల ఇంటి యజమాని, తన ఇంటిలో పని చేసే 18 యేళ్ళ కుర్రాడితో కలిసి 13 సంవత్సరాల పాప పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం విషయం ఫిర్యాదు చేసినప్పటికీ సదరు యజమాని కోడలు అమ్మాయినే చితకబాది బెదిరించడంతో ఆ అమ్మాయి మళ్ళీ అత్యాచారానికి గురయింది. ఎలాగో వీలు చూసుకుని తన తల్లికి…

జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులు నీరు కార్చుతూ ప్రభుత్వ ఆర్డినెన్స్

అనుకున్నదే అయింది. ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం తర్వాత మాటల్లో, హామీల్లో అగ్ని కణాలు రువ్విన ప్రభుత్వ పెద్దలు చేతల్లో తుస్సుమనిపించారు. మహిళల భద్రతకే తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని డంబాలు పలికిన ప్రధాని మన్మోహన్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీలు జస్టిస్ వర్మ కమిటీలోని ప్రధాన సిఫారసులను గాలికి వదిలేశారు. ప్రధాన సిఫారసులను నిరాకరించిన అప్రతిష్టను కప్పిపుచ్చుకోవడానికో యేమో తెలియదు గానీ వర్మ కమిటీ నిరాకరించిన మరణ శిక్షను అరుదైన కేసుల్లో విధించడానికి…

ఆశిష్ నంది దళిత వ్యతిరేక వ్యాఖ్యలు, ఒక పరిశీలన

ఎస్.సి, ఎస్.టి, ఒ.బి.సి కులాలనుండి అత్యధికంగా అవినీతిపరులు వస్తున్నారని ఆశిష్ నంది చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి. దేశ వ్యాపితంగా ఆయనకి వ్యతిరేకంగా ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడంతో సదరు ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని కోరుతూ ఆశిష్ నంది సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. భావోద్వేగాలు మిన్ను ముట్టిన వాతావరణంలో తనపై దాడి జరగవచ్చని ఆయన కోర్టుకి విన్నవించాడు. ఆశిష్ నంది విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయన అరెస్టుపై…

పోలీసుల చేతుల్లోకి వెళ్ళిన ఫేస్ బుక్ అసభ్య సంభాషణల కేసు

ఫేస్ బుక్ లో తెలుగు వ్యాఖ్యాతలు మహిళలకు వ్యతిరేకంగా, వారి గుణ గుణాలను కించపరుస్తూ సాగించిన సంభాషణ పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసభ్య వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణించిన మహిళలు విషయాన్ని శనివారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అనురాగ్ శర్మ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కనీసం 10 మంది మహిళలు కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కమిషనర్ గారెని కలిసిన అనంతరం వనిత టి.వి లో సాయంత్రం…

పత్రికలకెక్కిన ఫేస్ బుక్ బూతులు, మహిళల తిరుగుబాటుతో క్షమాపణలు

గత రెండు మూడు రోజులుగా ఫేస్ బుక్ లో కొందరు మగరాయుళ్ళు మహిళలకు వ్యతిరేకంగా అసభ్య రాతలు రాస్తున్నారు. తెలుగు బ్లాగర్ తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం మహిళలను తీవ్రంగా అవమానిస్తూ ప్రారంభించిన ఒక టాపిక్ కింద కొందరు పురుష పుంగవులు చేరి వీరంగం వేశారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ మహిళల గుణ గణాలను కించపరిచారు. చిన్న వయసులోనే అమ్మాయిలు శారీరక కోర్కెల కోసం వెంపర్లాడుతున్నారని, అలాంటివారికి పెళ్లిళ్లు చెయ్యకుండా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్లు…

ఇలా అయితే ఇంకో దేశానికి వెళ్లిపోతా –కమల్ హాసన్

తన సినిమా ‘విశ్వరూపం’ సినిమా విడుదల కాకుండా ఆగిపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం పూర్తిగా ‘రాజకీయం’ అనీ, ఇందులో మతపరమైన కారణాలు లేనే లేవని ఆయన నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాడు. ఫిబ్రవరి 4 తేదీన వెలువడనున్న హై కోర్టు తీర్పు కోసం తాను ఎదురు చూస్తానని, ఈ లోపు సుప్రీం కోర్టుకి వెళ్ళే ఉద్దేశ్యాలు తనకు లేవని స్పష్టం చేశాడు. దేశాన్ని విడిచి వెళ్ళిన…

తాడేపల్లి బృందం అరెస్టుపై ‘ది హిందూ’ వార్త -కత్తిరింపు

తాడేపల్లి బృందం అరెస్టు విషయాన్ని బుధవారం ‘ది హిందూ’ పత్రిక వార్తగా ప్రచురించింది. హైద్రాబాద్ ఎడిషన్ లో మొదటి పేజిలో ఈ వార్తను ప్రచురించడం విశేషం. వార్త స్క్రీన్ షాట్ ను కింద చూడవచ్చు. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులో చూడగలరు.) –    

వారి భావజాలంపై పోరాటం కోసమే పోలీసు కేసు –మహిళా నేత సంధ్య

తాడేపల్లి, కృష్ణ మోహన్ తదితరులు వ్యక్తం చేసిన మహిళా వ్యతిరేక భావజాలంపై తాము పోరాటం ఎక్కుపెట్టామని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడానికే తాము నిర్ణయం తీసుకున్నామని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య తెలిపారు. క్షమాపణలతో వదిలెయ్యడమా లేక కేసు పెట్టాలా అన్న విషయాన్ని తాము చర్చించామని, అంతిమంగా కేసు పెట్టడానికే తాము నిర్ణయించుకున్నామని సంధ్య తెలిపారు. కొద్దిసేపటి క్రితం సంధ్య గారిని ఈ బ్లాగర్ సంప్రదించగా ఆమె…

మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి…

ఆ శిక్ష చాలదు –ఇండియా, చాలు -అమెరికా

ముంబై టెర్రరిస్టు దాడులకు నెలల ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన ‘డేవిడ్ కోలమన్ హేడ్లీ’కి అమెరికా కోర్టు 35 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష తమను కొద్దిగా అసంతృప్తికి గురి చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించగా, విచారణలో సహకరించాడు గనక ఆ శిక్ష చాలు అని అమెరికా చెబుతోంది. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పైన జరిగిన టెర్రరిస్టు దాడిని 9/11 పేరుతో పిలుస్తున్న నేపధ్యంలో ముంబై దాడులను 26/11 పేరుతో…

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రధాన అంశాలు

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఎవరినీ వదల లేదు. ప్రభుత్వము, పోలీసులతో పాటు న్యాయ వ్యవస్థను, సామాజిక ధోరణులను అది ఎండగట్టింది. నివేదికలోని అంశాలను ఎన్.డి.టి.వి ఒకింత వివరంగా అందించింది. అవి ఇలా ఉన్నాయి. సామూహిక అత్యాచారం దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష; అవసరం అనుకుంటే జీవిత కాలం (శేష జీవితం అంతా జైలులోనే) విధించవచ్చు. సామూహిక అత్యాచారం అనంతరం హత్య జరిగితే జీవిత కాలం శిక్ష విధించాలి. ఈవ్‌టీజింగ్, వెంట పడడం, అవాంఛనీయ పద్ధతిలో…

పాలనా వైఫల్యమే మహిళలపై నేరాలకు మూల హేతువు –జస్టిస్ వర్మ కమిటీ

80,000కు పైగా సలహాలు, సూచనలు అందుకున్న జస్టిస్ వర్మ కమిటీ 29 రోజుల్లోనే వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను నివారించడానికి వీలుగా చట్టాల మెరుగుదలకు తగిన సిఫారసులు చేయడానికి 30 రోజుల గడువు కోరిన జస్టిస్ వర్మ కమిటీ ఒక రోజు ముందుగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు లాంటి సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నల్ల చట్టాలు అడ్డు పెట్టుకుని…

కీచులాటలు ఇండియా, పాక్ లవి, కాశ్మీర్ రొట్టె ఐరాసకు

రెండు పిల్లుల రొట్టె తగాదాని కోతి తీర్చినట్లయింది ఇండియా, పాకిస్థాన్ దేశాల పరిస్ధితి. కాశ్మీర్ లో ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం కొనసాగాలా లేదా వద్దా అని ఇండియా, పాకిస్థాన్ లు కీచులాడుకుంటుంటే ఆ సంగతి తేల్చవలసింది మీ ఇద్దరిలో ఎవ్వరూ కాదు మేమే అని ఐరాస తేల్చి చెప్పింది. అమెరికా, యూరప్ దేశాలకు ప్రపంచ స్థాయిలో రాజకీయ ముసుగుగా పనిచేసే ఐరాస చేతి లోకి ఒక అధికారం వెళ్ళడం అంటే అది అమెరికా, యూరప్ చేతుల్లోకి వెళ్ళినట్లే.…

చచ్చిపోయిన రిపోర్టర్ –‘ది హిందూ’ సంచలనాత్మక కధనం

(ఇది సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం. బడా కార్పొరెట్ కంపెనీలు మీడియాను కొనెయ్యడం వలన వార్తల సేకరణలో విలేఖరి పాత్ర నామమాత్రం అవుతోందని, సంపాదకుడే యజమానికి నేరుగా ఫ్రంట్ గా వ్యవహరించవలసిన దుర్దినాలు దాపురించాయని ప్రతిభావంతంగా ఇందులో ఆయన వివరించాడు. టి.వి వార్తల సమయాన్ని రియాలిటీ షోలు కబళిస్తున్న వైనం కార్పొరేటీకరణ పుణ్యమేనని అనుభవంతో చెబుతున్న సందీప్ భూషణ్ వివరణ మనకు తెలియని కోణాలనుండి టి.వి కవరేజిని చూసే అవకాశం ఇస్తుంది. ఆంగ్ల వ్యాసానికి…