స్వతంత్రం రెచ్చగొడితే తీవ్ర చర్యలు తప్పవు! -తైవాన్ తో చైనా

చైనా మరోసారి తైవాన్ ను తీవ్రంగా హెచ్చరించింది. ‘స్వతంత్రం’ పేరుతో జనాన్ని రెచ్చగొడుతూ ఉంటే తీవ్ర చర్యలు తప్పవు, అని చైనా ప్రభుత్వం తైవాన్ ను హెచ్చరించింది. “స్వతంత్రం ప్రకటించుకునే వైపుగా ఏ మాత్రం అడుగు వేసినా చర్యలు తప్పవు” అని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ ప్రతినిధి మా చియావో గువాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించాడు. తైవాన్ తో శాంతియుతంగా ఐక్యం కావడానికి కృషి చేసేందుకు చైనా దేశం సిద్ధంగా ఉందనీ అయితే స్వతంత్రత ప్రకటించుకునే…

హిందూ దేశంగా మార్చుతామని ప్రతిజ్ఞ, పోలీసులకు ఫిర్యాదు

హిందూత్వ గణాలు దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ లోని గోవింద్ పురి మెట్రో స్టేషన్ సమీపంలో ‘హిందూ యువ వాహిని’ అనే సంస్ధ ఆద్వర్యంలో జరిగిన సదస్సు మరో విడత పరమత విద్వేష ప్రసంగాలకు, ప్రతిజ్ఞలకు వేదికగా నిలిచింది. ఈసారి భారత దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేందుకు చంపడానికి, చావడానికి కూడా సిద్ధమంటూ సభికుల చేత నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ముస్లింలు, క్రైస్తవులపై జీనోసైడ్ (సామూహిక హత్యాకాండ) జరపాలని, మాజీ ప్రధాని మన్మోహన్…

రష్యన్ హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం!

రష్యా తన ఆయుధ సంపత్తిని అమెరికాకు కూడా అందనంత ఎత్తుకు చేర్చుకుంటోంది. నాటో కూటమిని తూర్పు దిశలో రష్యా పొరుగు సరిహద్దు వరకూ విస్తరించడానికి అమెరికా కంకణం కట్టుకుంటున్న కొద్దీ రష్యా తన ఆయుధ సంపత్తిని మరింత ఆధునిక స్ధాయికి అభివృద్ధి చేస్తోంది. తాజాగా అత్యంత వేగంగా, శత్రు దేశాల రాడార్లకు దొరకని విధంగా అత్యంత రహస్యంగా ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగల మిసైల్ ని ‘జిర్కాన్’ పేరుతో రష్యా అభివృద్ధి చేసింది. సుదీర్ఘ దూరాల వరకు ఏరో…

ఇది హిందూత్వ కాదు ‘చోర్ బజార్’! -శివ సేన

హిందూత్వను ఎవరు నిజాయితీగా ఆచరిస్తున్నారు అన్న అంశంలో బి‌జే‌పి, శివసేన పార్టీల మధ్య ఎప్పుడూ పోటీ నెలకొని ఉంటుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో కలిసి శివసేన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోటీ మరింత తీవ్రం అయింది. బి‌జే‌పి తో స్నేహం విడనాడి లిబరల్ బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో జట్టు కట్టడమే హిందూత్వ సిద్ధాంతానికి ద్రోహం చెయ్యడంగా బి‌జే‌పి ఆరోపిస్తుంది. అసలు బి‌జే‌పి ఏనాడో హిందూత్వను వదిలి పెట్టి అవినీతికి,…

దళిత వంటను ఆ పిల్లలు ముట్టుకోలేదు, ఆమె ఉద్యోగం పోయింది!

భారత రాజ్యాంగం కుల వివక్షను రద్దు చేసింది. అలాగే అంటరానితనాన్ని కూడా రద్దు చేసింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 యేళ్ళు గడిచినా కూడా భారత సమాజం రాజ్యాంగంలో పొందు పరిచిన సామాజిక విలువలను గౌరవించేందుకు సిద్ధంగా లేదు. ఉత్తర ఖండ్ లోని ఒక స్కూల్ పిల్లలు దళిత మహిళ వంట చేసిందన్న కారణంతో ఆ స్కూల్ లో వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానేశారు. స్కూల్ భోజనం తినడానికి బదులు తమ ఇళ్ల నుండి…

మోడీ కుట్ర విప్పి చెప్పిన సాహసికి లేఖ

గుజరాత్ మారణకాండలో నరేంద్ర మోడీ హస్తం సాక్ష్యాధారాలు బైటపెట్టాడన్న కోపంతో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ భట్ ను ఒక పాత కేసులో ఇరికించి ముప్పై సంవత్సరాల శిక్ష వేసిన సందర్భంలో హర్ష్ మందర్ రాసిన లేఖ. (వీక్షణం జూలై 2019 సంచిక నుంచి) – హర్ష్ మందర్, IAS (తెలుగు: ఎన్ వేణుగోపాల్) ప్రియమైన సంజీవ్, ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి…

కోవిడ్ భవిష్యత్తు చెప్పే అర్హత బిల్ గేట్స్ కి ఎక్కడిది?

అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి తెలియని వారు ఉండరు. గూగుల్, ఫేస్ బుక్ లాంటి కంపెనీలు వచ్చేవరకూ ప్రపంచ సాఫ్ట్ వేర్ సామ్రాజ్యానికి ఆయన మకుటం లేని మహారాజు. అనేక మూడో ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు కూడా ఆయనతో స్టేజి పంచుకోవటానికి ఉబలాట పడేవారు. కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రధాన ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తనకు తెలిసింది తక్కువే అని ఆయన పలుమార్లు చెప్పుకున్నాడు. ఆరంభంలో…

ప్రియాంక పిల్లల ఇన్స్టా హ్యాకింగ్ చేసిన ప్రభుత్వం?

ప్రియాంక గాంధీ వాద్ర ఈ రోజు (డిసెంబర్ 21, 2021) ఒక నమ్మశక్యం కానీ విషయాన్ని వెల్లడి చేశారు. ఆమె పిల్లల ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందట! ఇది నిజంగా నిజమేనా?! ఇది నిజమే అయితే బహుశా అంతకంటే దరిద్రమైన ఆరోపణ మోడి ప్రభుత్వం ఇక ఎదుర్కోబోదేమో! ప్రియాంక గాంధీకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు రైహన్ వాద్రా, వయసు 20 సం.లు. అమ్మాయి పేరు మిరాయ వాద్రా, వయసు…

రిపేర్ ఖర్చు పెట్టలేక టెస్లా ఎలక్ట్రిక్ కారు పేల్చేసిన ఓనర్!

ఇది ఫిన్లాండ్ దేశంలో జరిగింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్టింది పేరు. ఎలాన్ మస్క్ ఈ కంపెనీ వ్యవస్ధాపకుడు. టెస్లా కంపెనీకి సి‌ఈ‌ఓ ఆయనే.  ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం కంపెనీల యజమాని మార్క్ జుకర్ బర్గ్ వాట్సప్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేశాక, వాట్సప్ ని మొబైల్ ఫోన్ల నుండి తీసేసి దాని బదులు సిగ్నల్ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోమని యూజర్లకు ట్విట్టర్ ద్వారా సలహా ఇవ్వడం లాంటి చర్యలు, ప్రకటనల ద్వారా…

బ్రెజిల్ నుండి ఐ‌ఎం‌ఎఫ్ గెంటివేత!

ఐ‌ఎం‌ఎఫ్ ని బ్రెజిల్ గెంటివేసింది. మీ సేవలు చాలు, దేశాన్ని విడిచి వెళ్ళండి అని మొఖం మీదే చెప్పింది. బ్రెజిల్ ఆర్ధిక మంత్రి స్వయంగా ‘ఇక చాలు, మూటా ముల్లె సర్దుకోండి’ అని చెప్పేశాడు. దానితో బ్రెజిల్ లో తమ కార్యాలయాన్ని మూసివేస్తామని బ్రెజిల్ ప్రకటించింది. ఐ‌ఎం‌ఎఫ్ సంస్ధ ప్రపంచ కాబూలీవాలా. ఆర్ధిక కష్టాల్లో ఉన్న దేశాలకు అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పుకుంటుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు సంక్షోభ నివారణ ఔషధాలు అందజేసి కోమా ఉన్న ఆర్ధిక వ్యవస్ధలను…

ఒమిక్రాన్ వైరస్ మిస్టరీ!

శాస్త్రవేత్తలకు ఒమిక్రాన్ ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది. దానికి కారణం గత కోవిడ్ రకాలతో పోల్చితే దీని లక్షణాలు కాస్త భిన్నంగా ఉండడం. డెల్టా రకం వైరస్ తో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాలు తేలికపాటి గా ఉండడం ఇప్పటికీ ఊరటగా ఉంది. కానీ లక్షణాలు తేలికగా ఉన్నాయని చెప్పి దాన్ని తక్కువ అంచనా వేయడం తగదని WHO గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉన్నా ముందు ముందు అది ఎలాంటి లక్షణాలు సంతరించు కుంటుందో…

త్వరలో మోడి, జిన్^పింగ్, పుతిన్ ల సమావేశం?

బ్రిక్స్ కూటమిలో ప్రధాన రాజ్యాలైన చైనా, రష్యా, ఇండియా దేశాల అధినేతలు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. వ్లాదిమిర్ పుతిన్, ఛి జిన్^పింగ్ ల మధ్య ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇరువురు నేతలు త్రైపాక్షిక సమావేశం జరపాలన్న అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్ధ టాస్ (TASS) తెలియజేసింది. పుతిన్, ఛి ల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తాలూకు…

ఒమిక్రాన్ పైన వ్యాక్సిన్ ప్రభావం లేదు -యూ‌ఎస్ స్టడీ

తాజాగా విస్తరిస్తున్న కొత్త రకం కోవిడ్ వైరస్ ఒమిక్రాన్. దీని దెబ్బకు పశ్చిమ దేశాలు అల్లాడుతున్నాయి. భారత దేశంలో ఒమిక్రాన్ విస్తరణ ఇంకా పెద్దగా నమోదు కాలేదు గానీ అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రం ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడి పత్రికలు తెగ వార్తలు ప్రచురిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒమిక్రాన్ రకం వైరస్ గురించి అదే పనిగా హెచ్చరిస్తోంది. ఉదాసీనత వద్దని, తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రకటనలు గుప్పిస్తోంది. మరోపక్క అమెరికాలో, జర్మనీ,…

పీఎం కేర్స్ ఫండ్ లోగో లో ప్రధాని బొమ్మ తీసెయ్యండి -పిటిషన్

బాంబే హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. PM CARES ఫండ్ ఎంబ్లమ్ లో నుండి ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ, జాతీయ జెండా బొమ్మ వెంటనే తొలగించాలని ఈ పిటిషన్ సారాంశం. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎం ఎస్ కార్నిక్ లతో కూడిన బెంచి ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. విచారణ క్రిస్మస్ సెలవుల తర్వాత తేదికి వాయిదా వేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోరారు. “ఇది ముఖ్యమైన పిటిషన్ మిస్టర్…

వ్యాక్సిన్: ప్రజల కంపెనీల్ని మూలకు తోసి ప్రైవేటుని మేపుతున్నారు!

ప్రజల కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అని. వ్యాక్సిన్ల తయారీలో భారత దేశం పేరెన్నిక గన్నది. ప్రభుత్వ రంగంలో వ్యాక్సిన్ పరిశోధన మరియు తయారీ కంపెనీలను స్ధాపించి నిర్వహించడంలో భారత దేశానికి పెద్ద చరిత్రే ఉన్నది. ఎల్‌పి‌జి (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను చేపట్టిన ఫలితంగా ఈ ప్రజల/ప్రభుత్వ కంపెనీలను ఒక్కటొక్కటిగా మూసివేస్తూ వచ్చారు. దానితో వ్యాక్సిన్ తయారీలో స్వయం సమృద్ధ దేశంగా ఉన్న భారత దేశం ఇప్పుడు పరాధీన దేశంగా మారిపోయింది. విదేశీ ప్రైవేటు…