హిందూ పరిరక్షకుల చేతిలో మానవీయ సంస్కృతి విధ్వంసం -ఫొటోలు

“దాడి చేసినవారిలో ఒకడు ఆకలిగొన్న కుక్కలా నా స్నేహితురాలి శరీరం అంతా తాకాడు. ఆటవస్తువులా ఆడుకున్నాడు. నేను వివరించలేను… వాడి అసలు ఉద్దేశ్యం ఏమిటో మీరే అర్ధం చేసుకోవాలి.” మంగుళూరులో హిందూ సంస్కృతి పరిరక్షకులమంటూ పెచ్చరిల్లిన మూకల దాడిలో బాధితురాలు సిగ్గుతో చస్తూ చెప్పిన నాలుగు మాటలివి. “అది రేవ్ పార్టీ కాదు. మేమలాంటివారం కాదు. మా ఫ్రెండ్ తన పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంది. ఆడపిల్లల్ని ఇలాగేనా చూసేది? మంగుళూరులో నేనిక ఏ పార్టీకీ వెళ్లను… మా…

‘బర్త్ డే పార్టీ’ లపై హిందూ సంస్కృతి పరిరక్షకుల అసభ్య దాడి, అరెస్టులు

హిందూ సంస్కృతిని పరిరక్షిస్తామంటూ బయలుదేరిన గుంపు కర్ణాటక లోని మంగుళూరులో మరోసారి వీరంగం ఆడింది. పుట్టిన రోజు పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకుల బృందం పై ‘హిందూ జాగరణ వేదిక’ కు చెందిన మూకలు దాడి చేసి విచక్షణారహితంగా చావబాదారు. పుట్టిన రోజు పార్టీ అని చెబుతున్నప్పటికీ వినకుండా మృగాల్లా ప్రవర్తించారు. అమ్మాయిలను తాకకూడని చోట తాకుతూ, జుట్టు పట్టి లాగుతూ, కొడుతూ నీచంగా ప్రవర్తించారు. హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా…

స్త్రీలపై అత్యాచారాలు, కురచ దుస్తులు, ఒక పరిశీలన

  (స్త్రీల వస్త్రధారణ వారిపై అత్యాచారాలకు ఒక కారణం అంటూ డి.జి.పి దినేష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా బొందలపాటిగారు తన కోణంలో విశ్లేషిస్తూ ఒక టపా డిసెంబర్ 29 తేదీన రాశారు. సదరు టపా కు స్పందనగా మిత్రులు రాజశేఖర్ రాజు గారు చేసిన వ్యాఖ్యానం అద్భుతం. ఆయన చేసిన విశ్లేషణకు మరింత వెలుగు కల్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఆయన వ్యాఖ్యలలోని ప్రధాన భాగాన్ని టపాగా మారుస్తున్నాను.  రాజశేఖర్ రాజు, బొందలపాటి గార్ల అనుమతి ఉన్నదని…

ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లల డ్రస్సులే కారణం -తృణమూల్ ఎమ్మెల్యే

ఆడవాళ్లపై అత్యాచారాలకు, అత్యాచార ప్రయత్నాలకు వారి కురచ దుస్తులే కారణమని పోలీసు బాసులు, ప్రభుత్వాధికారులు నుండి గ్రామ పెద్దల వరకు ఏకబిగిన వాపోతున్న సంగతి తెలిసిందే. ‘ఈవ్ టీజింగ్’ నేరానికి కూడా ఆడపిల్లల డ్రస్సులే ప్రేరణనిస్తున్నాయని తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్ధారించాడు. అంతలోనే ఈవ్ టీజింగ్ కొత్తదేమీ కాదని కూడా సమర్ధించుకొచ్చాడు. మరోసారి నాలుక మడతేసి కురచ దుస్తులనూ అభినందించాడు. సొంత పార్టీ మంత్రులతో పాటు ప్రముఖులంతా తూర్పారబట్టినా సంరక్షకుడిగానే తానా మాటలన్నానని తనను తాను…

అవినీతి నిర్లక్ష్యాల మూల్యం, స్కూల్ బస్సు రంధ్రంలోంచి జారి బాలిక మృతి

చెన్నైలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులోపల ఉన్న రంధ్రంలోంచి జారిపడి రెండో తరగతి చదువుతున్న బాలిక చనిపోయింది. బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోవడంతో ఆరేళ్ళ శృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవాణా అధికారుల వద్ద నెల క్రితమే స్కూలు బస్సు ఫిట్ నెస్ సర్టిఫికేట్ పొందినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించగా, ప్రజలు ఆగ్రహంతో బస్సుని తగలబెట్టారు. బస్సు డ్రైవర్ తో పాటు…

ఇండియన్ హై వే: చైనాలో భారత కళా ప్రదర్శన -ఫోటోలు

“ఇండియన్ హై వే” పేరుతో 2008 నుండి ప్రపంచ వ్యాపితంగా వివిధ నగరాల్లో కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లండన్ (2008), ల్యోన్ (ఫ్రాన్స్, 2011), రోమ్ (2011) లలో ప్రదర్శనలు పూర్తయిన అనంతరం చైనాలోని బీజింగ్ లో ప్రస్తుతం నిర్వహించబడుతోంది. చైనాకు చెందిన ‘కాఫా’ (Central Academy of Fine Arts) వెబ్ సైట్ (ఫొటోలు అక్కడివే) ప్రకారం ‘ఆర్ధిక విజృంభణ (economic boom) ఫలితంగా సంభవిస్తున్న సామాజిక, భౌతిక, రాజకీయ ఉద్యమ వ్యాఖ్యానం మరియు విశ్లేషణ’…

చైనాలో వెల వెల బోయిన భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం

ప్రజాస్వామిక హక్కులు లేవనీ, మానవ హక్కులు మంట గలుస్తున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చకీ ఇనప దడులు కట్టారనీ చైనాను ఆడిపోసుకోవడం కద్దు. భారత దేశంలోని హిందూమత శక్తులు చైనా మానవహక్కుల చరిత్రపై దాడులకు సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి చోటనే భారతీయులు ఏర్పరిచిన కళా ప్రదర్శనలో గుజరాత్ మత మారణకాండ పై ఉంచిన చిన్న వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం స్వయంగా కోరి సఫలమయింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే సెక్యులరిజం నేతిబీర లోని నెయ్యి చందమేననీ, రాజకీయ…

అమెరికాలో మరో మానసిక వికలాంగుడి మరణ శిక్షకు రంగం సిద్ధం

గత బుధవారం ఒక మానసిక వికలాంగుడికి మరణ శిక్ష అమలు చేసిన అమెరికా ప్రభుత్వం సోమవారం మరో మానసిక రోగికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేయనుంది. ఫ్రాన్సు ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి లతో పాటు ప్రపంచ వ్యాపితంగా అనేకమంది ప్రముఖులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ వెనక్కి తగ్గడానికి అమెరికా ససేమిరా అంటోంది. మూడు విడతల మిశ్రమ డోసులో ఇంజెక్షన్స్ ఇచ్చి నెమ్మదిగా ప్రాణం తీసే మామూలు పద్ధతి కాకుండా మొదటిసారిగా ఒకే ఒక్క కొత్త విషం…

ఆత్మీయ ‘ఉత్తరం’ ఇప్పుడెక్కడ?

పోస్టు కార్డు, ఇన్లాండ్ లెటర్, ఎన్వలప్… ఒకప్పుడు భారత దేశ వ్యాపితంగా మనుషులను, మనసులను కలిపింది ఈ మూడే. నిత్యం లక్షలాది చేతి రాత ఉత్తరాలు రైళ్లల్లో, బస్సుల్లో తూనీగల్లా దూసుకు వెళ్ళేవి. వీధి వీధినా, సందు సందునా సైకిళ్లపై పడుతూ లేస్తూ పోయే పోస్ట్ మేన్ గారి ‘పోస్ట్’ అన్న కేకతో గడప గడపలో చురుకు పుట్టేది. ప్రయాణించేది రైళ్లలో, బస్సుల్లోనే అయినా ఉత్తరం రాశామన్న సంతృప్తి నుండి, ఉత్తరం రావాలన్న ఎదురు చూపుల వరకూ…

ఒంటి కాలి ఆత్మ స్థైర్యం ఈ పెద్దాయనది

కష్టాల కడలి ఈదడానికి ఆత్మ స్ధైర్యానికి మించింది లేదని పాతికేళ్ళ తిరుపాలు ఒంటికాలి జీవితం ప్రత్యక్ష సాక్ష్యం. ఈనాడు పత్రిక వెలికి తీసిన ఈ మట్టి మనిషి నిరోశోపహతులకు స్ఫూర్తి ప్రదాత అనడంలో సందేహం లేదు. రాజస్ధాన్ కృత్రిమ అవయవ తయారీ గురించి బహుశా ఇతనికి తెలియదో లేక ఖర్చు భరించలేకపోయాడో తెలియదు గానీ వడ్రంగి చేసిచ్చిన చేతి కర్ర ఇతనికి మరోకాలుగా మారిపోయింది. పాతికేళ్ళ శ్రమ జీవితంలో ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు కూడా పూర్తి చేసి…

వేయి తలల హైందవ విషనాగుడి మరో వికృత శిరస్సు, ‘అస్పృశ్య గర్భం’

‘కుల వివక్ష’, వేయ పడగల హైందవ విషనాగు వికృత పుత్రిక అన్న నిజానికి సాక్ష్యాల అక్షయ పాత్రలు బోలెడు. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో మరొకరికి చోటు ఉంటుందో లేదో గానీ కులాల కాల కూట విషమే రక్తనాడుల్లో ప్రవహించే హైందవ విష నాగు కాట్లకు బలైన సాక్ష్యాలకు అంతూ పొంతూ లేదు. అండం తమదే, అండ విచ్ఛిత్తి చేసే వీర్యకణమూ తమదే… అయినా అండ వీర్య కణాల సంయోగ ఫలితమైన పునరుత్పత్తి కణాన్ని మోసే అద్దె…

గౌహతి నగర వీధుల్లో మగోన్మాద వికటాట్టహాసం

పురుషోన్మాదం గౌహతి నగర వీధుల్లో వికటాట్టహాసం చేసింది. నిస్సహాయ మహిళను ఒక వ్యక్తిగా చూడలేని నాగరికత తన దరికి చేరనేలేదు పొమ్మంది. స్నేహితులు భయంతో వదిలేసి పోగా బార్ ముందు ఒంటరిగా నిలబడిన నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వెకిలి చేష్టలతో సిగ్గు విడిచి ప్రవర్తించింది. పదహారేళ్ళ యువతి జుట్టు పట్టి లాగుతూ, ఒంటిపై బట్టలను ఊడబీకుతూ, వేయకూడని చోట చేతులేస్తూ వికృత చిత్తాన్ని బట్టబయలు చేసుకుంది. విలువల అభివృద్ధిని నటన మాత్రంగానైనా ప్రతిబింబించవలసిన ఒక రాష్ట్ర రాజధాని…

ఇళయరాజా కుంచెలో ఒదిగిన ఓణీ, పరికిణీల శ్రమ సౌందర్యం -పెయింటింగ్స్

ఓణీ, పరికిణీ భారతీయ అందం. ముఖ్యంగా భారతీయ పల్లెల అందం. పశ్చిమ దేశాల దుస్తుల్లోని సులువుకి ప్రపంచం యావత్తూ తల ఒగ్గినప్పటికీ భారత స్త్రీల సంప్రదాయ దుస్తులైన ఓణీ, పరికిణీ, చీరల అందం తిరుగులేనిది. ఫ్యాంటు, షర్టుల్లో దుస్తుల అందాన్ని పదిలపరుచుకుంటూ విస్తృత మార్పులు తీసుకు రాగల అవకాశం పరిమితం. ఆ పరిమితిని అధిగమించడానికి కాబోలు… దుస్తుల్లో చూపలేని అందం శరీర ప్రదర్శనలోకి దిగిపోయింది. రక రకాల పేర్లతో అంతకంతకూ కురచగా మారడమే తప్ప ((ఫ్యాంటు, షార్టు,…

ప్రేమ వద్దు! బైటికే రావద్దు!! మహిళలకు యు.పి పంచాయితీ ఫత్వా

ప్రేమ పెళ్ళిళ్ళు నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లా అసారా గ్రామ పంచాయితీ ఫత్వా జారీ చేసింది. 40 యేళ్ళ లోపు మహిళలు ఒంటరిగా మార్కెట్ కి కూడా వెళ్లరాదంటూ నిషేధం విధించింది. ఆడ పిల్లలు రోడ్లపైన మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడాన్నీ నిషేధించింది. ఆనక తమది ఫత్వా కాదని 36 కులాల వాళ్ళం కూర్చుని చర్చించి తీసుకున్న నిర్ణయమని పంచాయితీ పెద్దలు తమ రూలింగ్ ని సమర్ధించుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ భాగ్ పట్…

బాప్ రే, అచ్చం ఫోటోల్లా ఉన్నా ఇవి పెయింటింగ్ లే నట! -ఫోటోలు

ఇవి ఫోటోలని చెబితే ఎవరైనా ఇట్టే నమ్మేస్తారు. కానీ ఇవి పెయింటింగ్ లేనట. అమెరికాలోని బ్రూక్లీన్ కి చెందిన 35 యేళ్ళ అలిస్సా మాంక్స్ గీసిన పెయింటింగ్ లు ఇవి. సమకాలీన ప్రపంచంలో అత్యంత ప్రతిభ కలిగిన ఫోటో రియలిస్టిక్ పెయింటర్ గా అలిస్సాకి పేరు ప్రఖ్యాతులున్నాయని తెలుస్తోంది. ఆయిల్ పెయింట్లతో వాస్తవిక చిత్రణ చెయ్యడంలో ఈమెకు గొప్ప ప్రతిభ ఉన్న సంగతి ఈ పెయింటింగ్ లు చూస్తేనే అర్ధం అవుతోంది. వేడి ఆవిరితో స్నానం (స్టీమ్…