ముచ్చటైన జంట! ఆమె 6′ 8", అతడు 5′ 4" -ఫోటోలు

ఆమె పేరు ఎలిసాని డ క్రజ్ సిల్వా, వయసు 17. అతని పేరు ఫ్రాన్సినాల్డో డ సిల్వా కర్వాలో, వయసు 22. సామాజికంగా అమ్మాయి, అబ్బాయిల ఎత్తు పట్ల నెలకొని ఉన్న అభ్యంతరాలను త్రోసిరాజని వీరిద్దరూ జంట కట్టారు. అందుకే వారు ముచ్చటైన జంట! ఇంకా పెళ్లి కాలేదు గానీ ఆ ఆలోచనలో ఉన్నారు. ఈ బ్రెజిల్ అమ్మాయికి పిట్యూటరీ గ్రంధిలో ట్యూమర్ ఏర్పడడంతో అనూహ్యంగా ఎదిగిపోయి 6 అడుగుల 8 అంగుళాల ఎత్తుకు చేరుకుంది. డాక్టర్లు…

‘వన్ డే’ లనుండి సచిన్ రిటైర్మెంట్, ఒక పరిశీలన -కార్టూన్

(కార్టూన్: ది హిందూ నుండి) – 50 ఓవర్ల పరిమిత క్రికెట్ ఆట నుండి శాశ్వతంగా విరమించుకుంటున్నట్లు భారతీయుల ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ ఆటలో ఆయన 50 సెంచరీలు పూర్తి చేసుకోవాలన్న అభిమానుల కోరిక నెరవేరకుండానే వన్ డే ఆట నుండి తప్పుకుంటున్నట్లు సచిన్ ప్రకటించడం అభిమానులకు ఒకింత నిరాశ కలిగించినా శ్రేయోభిలాషులైన క్రికెట్ పెద్దలు అభినందనలు తెలియజేశారు. భారతదేశ క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించాక సచిన్…

దండోరా వెయ్యనందుకు కట్టేసి కొట్టిన అగ్ర కులస్ధులు

కులవ్యవస్ధ అణచివేత తన వాస్తవ రూపంలోనే కొనసాగుతున్నదని కర్ణాటకలో జరిగిన ఘటన రుజువు చేస్తున్నది. సంప్రదాయక కులాచారం ప్రకారం దండోరా వెయ్యడానికి నిరాకరించాడని 38 సంవత్సరాల రంగస్వామిని అగ్రకులస్ధులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. కొట్టాక కూడా దండోరా వేయడానికి ఒప్పుకోకపోతే అతని ఇద్దరు కూతుళ్లను కూడా కొడతామనీ, వారికి ప్రమాదం కలగజేస్తామనీ బెదిరించారు. రోజువారీ కూలి చేసుకుంటూ బతికే రంగస్వామి అగ్రకులజుల కులాధిపత్య దాడికి బలై చెన్నరాయపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. తన భర్తను అగ్రకుల పెత్తందారులు చెట్టుకు…

బాధితురాలి తెగువ, ధైర్యం అపూర్వం -డాక్టర్లు

“ఆమె గొప్ప ధైర్యవంతురాలు. తనపై దాడి జరిగిన మొదటి క్షణం నుండి ఈ రోజువరకూ పోరాడుతూనే ఉంది” ఈ మాటలన్నది సఫ్దర్ జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.డి.అధాని. బాధితురాలిని కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్టర్ల ప్రకారం లైంగిక అత్యాచారం జరిగిన కేసుల్లో ఇంత తీవ్రమైన, లోతైన, బాధాకరమైన గాయాలను మరే కేసులోనూ వారు చూడలేదు. పెద్ద పేగు మొత్తాన్ని సర్జరీ ద్వారా తొలగించినట్లు కొన్ని పత్రికలు చెబుతుండగా గాంగ్రీన్ సోకిన భాగాన్ని మాత్రమే తొలగించినట్లు…

ఢిల్లీ వీధుల్లో మగమృగాలు, మరణశయ్యపై గ్యాంగ్ రేప్ బాధితురాలు

దేశ చరిత్రను ఆడపిల్లల కన్నీళ్లతో రాయవలసిన దుర్దినాలు వర్ధిల్లుతున్నాయి. ఒక్కో మానభంగం ఒక్కో కొత్త అధ్యాయానికి అర్హత పొందుతూ పశుత్వ ప్రదర్శనలో కొత్త రికార్దులు సృష్టిస్తున్నాయి. దేశరాజధానే అందుకు నిరంతరవేదికగా మారిపోయింది. 23 సంవత్సరాల పారమెడికల్ విద్యార్ధిని ఢిల్లీలో కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన దారుణం సభ్యసమాజం శాశ్వత వంధత్వం కోరుకునేదిగా ఉంది. మగ మృగాల పశుత్వాన్ని ప్రతిఘటించినందుకు పొత్తికడుపులో పిడి గుద్దులు ఎదుర్కొని పేగులు చితికిపోయి చావుబతుకుల మధ్య ఒక ఆడపిల్ల కొట్టుమిట్టాడుతోంది. ఆమెను…

జసింత సల్దానా ఆత్మహత్య, మరి కొన్ని వివరాలు

జసింత సల్దానా ఆత్మహత్యపై మరికొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియా రేడియో ‘2డే ఎఫ్.ఎం’ జాకీలు రెండోసారి ఆసుపత్రికి ఫోన్ చేసినప్పుడు కూడా జసింతయే దానిని అందుకున్న విషయం, ఆత్మహత్యకు ముందు రాసిన మూడు లేఖల్లోని ఒకదానిలో తన ఆత్మహత్యకు రేడియో జాకీలనే బాధ్యులను చేసిన విషయం, రేడియో ప్రసారం తర్వాత జసింత రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం, రోజూ తనకు ఫోన్ చేసే భార్య ఈసారి ఫోన్ చెయ్యకపోవడంతో తను క్షేమంగా ఉన్నదో లేదో…

బ్రిటన్ లో కేరళ నర్సు జసింత ఆత్మహత్య, విశ్లేషణ

డిసెంబరు 7 వ తేదీన భారతీయ నర్సు జసింత సల్దానా బ్రిటన్ లో ఆత్మహత్యకు పాల్పడింది. బ్రిటిష్ రాణిగారి కొడుకు గారి కోడలుగారు గర్భం ధరించి వేవిళ్లతో బాధపడుతున్న నేపధ్యంలో ఆమెకు సపర్యలు చేస్తున్న క్రమంలో జసింత సల్దానా అన్యాయంగా బలవన్మరణానికి గురయింది. సిగ్గూ, ఎగ్గూ లేని అనైతిక మీడియా ప్రమాణాలను అభివృద్ధి చేసుకున్న పశ్చిమ మీడియా విసిరిన గాలానికి చిక్కిన జసింత అర్ధాంతరంగా తనువు చాలించింది. తన చావుద్వారా బ్రిటిష్ రాచకుటుంబం చుట్టూ కమ్మిన మాయపొరను…

చదివించే బాధ్యత వదిలి ప్రవేటు స్కూళ్లను మేపుతున్న ప్రభుత్వం

(ఆర్టికల్ రచయిత: చందుతులసి) పూర్వం బతకలేక బడి పంతులు అని ఓసామెత ఉండేది. అంటే తమ చదువుకు ఏ ఉద్యోగం దొరక్కపోతే… ( ఆ రోజుల్లో ఉద్యోగం అంటే ఏ బ్రిటీష్ దొర దగ్గర గుమాస్తానో, లేదంటే ఏదో సహాయకుని పదవి. ) వీధిలో బడి మొదలు పెట్టేవారు. ఈ రోజుల్లో లాగా ఫీజులు కూడా ఉండేవి కావు. తల్లిదండ్రుల స్తోమతను బట్టి ఒక పైసానో, రెండు పైసలో ఇచ్చేవారు. ఆ రోజుల్లో అదే ఎక్కువ. మళ్లీ…

కుల వేధింపులతో దళిత పూజారి ఆత్మహత్య

కుల వివక్షతో ఆలయ పాలక సిబ్బంది పాల్పడుతున్న వేధింపులకు తట్టుకోలేక తమిళనాడులో 23 సంవత్సరాల దళిత పూజారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూజారి పదవినుండి తప్పుకోవాలనీ, అసలు గుడిలోకే రాకూడదనీ పాలక సిబ్బంది వేధించడంతో దళిత పూజారి ఎస్.నాగముత్తు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు పెట్టకుండా పట్టించుకోక పోవడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ సాయంతో కోర్టుకి కూడా వెళ్ళాడు.  వేధింపులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చినా వేధింపుల్లో మార్పులేకపోవడంతో…

యాక్సిడెంట్ బాధిత ఈశాన్య మహిళపై చేయి చేసుకున్న వీర పోలీసు

టూ వీలర్ తో కారుని గుద్దిన వ్యక్తిని వదిలి కారు నడుపుతున్న మణిపురి మహిళ (పేరు: Swar Thounaojam) పై చేయిచేసుకున్న వీర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదంతం ఇది. ప్రమాదం చేసిన వ్యక్తిని వదిలిపెట్టి మొదటి తప్పు చేసిన కానిస్టేబుల్ మహిళపై చేయిచేసుకుని మరో నేరానికి పాల్పడ్డాడు. ప్రమాదస్ధలి వద్ద గుమికూడిన జనం కూడా మహిళనే తిట్టి, కొట్టినంతపనిచేసి, అసభ్యంగా తాకరానిచోట్ల తాకి భారత సమాజ నాగరికత యొక్క సగటు సభ్యత పాతాళస్ధాయిలోనే కునుకు తీస్తోందని చాటుకున్నారు.…

టీచర్లు చితకబాదడంతో స్కూల్ పిల్లాడు మృతి

పదేళ్ళ స్కూల్ పిల్లాడిని ఇద్దరు టీచర్లు దారుణంగా కొట్టడంతో అబ్బాయి చనిపోయాడు. ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న అస్లాన్ అన్సారీ చేసిన తప్పుకూడా ఏమీ లేదు. స్కూల్ లో ఉన్న బకెట్ ని ఎవరో పగలగొట్టారని అస్లాన్ నవంబర్ 16న టీచర్లకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేశాక అక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు అస్లాన్ నే కొట్టడం మొదలుపెట్టారు. బకెట్ పగలకొట్టింది తాను కాదని పిల్లాడు వేడుకుంటున్నా వినకుండా అస్లాన్ ని చితగ్గొట్టారు. దానితో…

నార్వేలో కొడుకుని కొట్టి జైలుపాలయిన తెలుగు అమ్మా నాన్నలు

రెండు సామాజిక వ్యవస్ధల కుటుంబ విలువల మధ్య ఉన్న వైరుధ్యాలు ఒక యువ తెలుగు విద్యాధిక జంటను జైలుపాలు చేశాయి. ప్రఖ్యాత భారత సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ ఉద్యోగి చంద్ర శేఖర్, కంపెనీ కోసం నార్వే వెళ్ళి ఊహించని పరిణామాల వల్ల క్షోభను అనుభవిస్తున్నాడు. ఎదుగుదల క్రమంలో నేర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్న 7 యేళ్ళ కుమారుడిని అదుపులో పెట్టే క్రమంలో చంద్రశేఖర్ తండ్రిగా అదుపు తప్పాడని నార్వే కోర్టులు భావించి 18…

తమిళనాడులో ప్రమాదకర ధోరణి, దళితుల అణచివేతకు ఐక్యమవుతున్న కులశక్తులు

ధర్మపురి జిల్లాలో జరిగిన కులాంతర వివాహం, అనంతరం జరిగిన గృహ దహనాలు దళిత వ్యతిరేక కులదురహంకార శక్తుల ఐక్యతకు మార్గం వేసినట్లు కనిపిస్తోంది. అత్యంత వెనుకబడిన కులం (ఎం.బి.సి) గా తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన వన్నియార్ కులసంఘాన్ని పునాది చేసుకుని దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనను అణచివేసేందుకు కులరాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. వన్నియార్ కులతత్వం ఆధారంగా ఆవిర్భవించి బలపడిన పి.ఎం.కె అనే రాజకీయ పార్టీ ఇటువంటి తీవ్ర అభివృద్ధి నిరోధకమైన ఎజెండాను తమిళనాడులో ప్రవేశపెట్టి సమాజ ప్రగతిని…

విభిన్న చరిత్ర, సంస్కృతులను గుర్తుకుతెచ్చే దీపావళి -ఫోటోలు

చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి జరుపుకుంటున్నామని హిందూ పండితులు చెబుతారు. నరకాసుర వధకు గుర్తుగా ఆనందంగా జరుపుకునేది దీపావళి పండగ అని కొందరు చెబితే రావణుడిని జయించి రాముడు అయోధ్యకు చేరిన సందర్భంగా జరుపుకునే పండగ దీపావళి అని మరి కొందరు చెబుతున్నారు. సిరులు కురిపించమని కోరుతూ దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మిని కొలిచే సంప్రదాయం కూడా దేశంలో అనేకచోట్ల ఉన్నది. బంది చోర్ దివస్ పేరుతో సిక్కు మతస్ధులు దీపావళి రోజునే స్వర్ణ దేవాలయాన్ని…

ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ

ఫేస్ బుక్ వ్యాఖ్యలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసిన కేసులో తలలు తెగిపడుతున్నాయి. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు బహిరంగ హెచ్చరిక పర్యవసానంగా దేశ వ్యాపితంగా న్యాయ వర్గాలలో కూడా కాక పుట్టించిన ఫేస్ బుక్ అరెస్టు భారత ప్రజాస్వామ్య సౌధం బండారాన్ని బైటపెట్టే పరిస్ధితి తలెత్తడంతో బలి పశువుల తలలు దొర్లి పడుతున్నాయి. ధాణే జిల్లా ఎస్.పి (రూరల్) తో పాటు ఇద్దరు…