ఇలా అయితే ఇంకో దేశానికి వెళ్లిపోతా –కమల్ హాసన్

తన సినిమా ‘విశ్వరూపం’ సినిమా విడుదల కాకుండా ఆగిపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం పూర్తిగా ‘రాజకీయం’ అనీ, ఇందులో మతపరమైన కారణాలు లేనే లేవని ఆయన నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాడు. ఫిబ్రవరి 4 తేదీన వెలువడనున్న హై కోర్టు తీర్పు కోసం తాను ఎదురు చూస్తానని, ఈ లోపు సుప్రీం కోర్టుకి వెళ్ళే ఉద్దేశ్యాలు తనకు లేవని స్పష్టం చేశాడు. దేశాన్ని విడిచి వెళ్ళిన…

తాడేపల్లి బృందం అరెస్టుపై ‘ది హిందూ’ వార్త -కత్తిరింపు

తాడేపల్లి బృందం అరెస్టు విషయాన్ని బుధవారం ‘ది హిందూ’ పత్రిక వార్తగా ప్రచురించింది. హైద్రాబాద్ ఎడిషన్ లో మొదటి పేజిలో ఈ వార్తను ప్రచురించడం విశేషం. వార్త స్క్రీన్ షాట్ ను కింద చూడవచ్చు. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులో చూడగలరు.) –    

వారి భావజాలంపై పోరాటం కోసమే పోలీసు కేసు –మహిళా నేత సంధ్య

తాడేపల్లి, కృష్ణ మోహన్ తదితరులు వ్యక్తం చేసిన మహిళా వ్యతిరేక భావజాలంపై తాము పోరాటం ఎక్కుపెట్టామని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడానికే తాము నిర్ణయం తీసుకున్నామని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య తెలిపారు. క్షమాపణలతో వదిలెయ్యడమా లేక కేసు పెట్టాలా అన్న విషయాన్ని తాము చర్చించామని, అంతిమంగా కేసు పెట్టడానికే తాము నిర్ణయించుకున్నామని సంధ్య తెలిపారు. కొద్దిసేపటి క్రితం సంధ్య గారిని ఈ బ్లాగర్ సంప్రదించగా ఆమె…

మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి…

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రధాన అంశాలు

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఎవరినీ వదల లేదు. ప్రభుత్వము, పోలీసులతో పాటు న్యాయ వ్యవస్థను, సామాజిక ధోరణులను అది ఎండగట్టింది. నివేదికలోని అంశాలను ఎన్.డి.టి.వి ఒకింత వివరంగా అందించింది. అవి ఇలా ఉన్నాయి. సామూహిక అత్యాచారం దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష; అవసరం అనుకుంటే జీవిత కాలం (శేష జీవితం అంతా జైలులోనే) విధించవచ్చు. సామూహిక అత్యాచారం అనంతరం హత్య జరిగితే జీవిత కాలం శిక్ష విధించాలి. ఈవ్‌టీజింగ్, వెంట పడడం, అవాంఛనీయ పద్ధతిలో…

పాలనా వైఫల్యమే మహిళలపై నేరాలకు మూల హేతువు –జస్టిస్ వర్మ కమిటీ

80,000కు పైగా సలహాలు, సూచనలు అందుకున్న జస్టిస్ వర్మ కమిటీ 29 రోజుల్లోనే వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను నివారించడానికి వీలుగా చట్టాల మెరుగుదలకు తగిన సిఫారసులు చేయడానికి 30 రోజుల గడువు కోరిన జస్టిస్ వర్మ కమిటీ ఒక రోజు ముందుగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు లాంటి సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నల్ల చట్టాలు అడ్డు పెట్టుకుని…

మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా అంతిమ బాధితులు ప్రజలే

మతోన్మాదం గురించి ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ చర్చ జరుగుతోంది. మైనారిటీ మతోన్మాదం వార్తలకు ఎక్కడం ఈసారి ప్రత్యేకత. ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) పార్టీకి చెందిన యువ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ చోట్ల ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగాలు ఈ చర్చకు ప్రేరణగా నిలిచాయి. ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి హిందూ తీవ్రవాద సంస్థలు, పార్టీల నుండి సెక్యులరిస్టు పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ నుండి వివిధ సెక్యులర్ ముస్లిం సంస్థల వరకూ…

ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటే తప్ప పోలీసులు, ప్రభుత్వం కదల్లేదు

“డిసెంబర్ 26 తేదీ సాయంత్రం, న్యూ ఢిల్లీ సామూహిక అత్యాచారం బాధితురాలు భారత ప్రభుత్వ జెట్ విమానంలో మెరుగైన వైద్యం కోసం సింగపూర్ వెళుతున్న సమయంలోనే మరో సామూహిక అత్యాచార బాధితురాలయిన ఒక టీనేజి అమ్మాయి తన ప్రాణం తాను తీసుకుంటోంది” (రాయిటర్స్, 16.01.2013) పంజాబ్ లో అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న 17 సంవత్సరాల బాలిక గురించి రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పిన సంగతి ఇది. దేశం మొత్తం ఢిల్లీ అమానుష కృత్యంపై ఆగ్రహంతో స్పందిస్తూ…

దామిని స్మృతిలో…

దామిని, అమానత్, నిర్భయ పేరేదైతేనేం? ఆమె………………….. హింసోన్మత్త పశు వాంఛలు కాటువేసిన గాయం పెను నిద్దురలోని దేశ అంతరాత్మని తట్టి లేపిన స్పర్శ లాఠీలను గేలి చేసిన నినాదాలకు స్వరపేటిక నీటి ఫిరంగులకు ఎదురొడ్డిన కన్నీటి జలపాతం భారత మహిళ అదృశ్య కారాగార వాసానికి దేదీప్య కాంతుల వెలుగు నిచ్చిన సాహసి! పాలకుల ఉదాసీనత, పాలితుల కర్తవ్యాలు తర్కించి, నిగ్గు దేల్చిన బాధల పాటల పల్లవి! రెండు గంటల్లో వెయ్యి జీవితాల హింసాత్మక దాడిని ఎదుర్కొని, ప్రతిఘటించి,…

నా జీవితంకోసం పోరాడి గెలిచాను -30 సం. క్రితం సొహైలా

(ఇప్పటికి ముప్ఫైయేళ్ళ క్రితం, తనపై నలుగురు సంస్కృతీ కాపలాదారులు రెండు గంటలపాటు అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన మూడు సంవత్సరాల తరవాత ‘సొహైలా అబ్దులాలి’ రాసిన వ్యాసం ఇది. దీనిని మహిళా పత్రిక ‘మానుషి’ ప్రచురించింది. అప్పటికీ ఇప్పటికీ భారత సమాజంలో పితృస్వామిక విలువలు మారని వైనాన్ని ఈ వ్యాసం స్పష్టం చేస్తోంది. భారత పాలకులు అదే బూజుపట్టిన, స్త్రీలను చెరబట్టిన బురదలోనే దొర్లుతున్నారని ఈ వ్యాసంలోని అంశాలనూ, ఢిల్లీ అత్యాచారం తర్వాత వారు వరదలా పారిస్తున్న…

ఢిల్లీ అత్యాచారంపై టపాలు, ఒక పరిశీలన

రచన: నాగరాజు ఢిల్లీ సంఘటన తర్వాత వరుసగా ప్రచురితమవుతున్న పోష్టులు అనేక కోణాలలో చర్చకు దోహదపడుతున్నాయి. ఒక (అత్యాచారాన్ని)స్త్రీపై జరిగిన భౌతిక దాడిని ఎలా చూడాలి, దానిపై సమాజం, సమాజం నెత్తిన పీడలా కూర్చున్న పెద్దలు ఎలా స్పందిస్తున్నారు, అసలు ఈ సంఘటన ఇంతగా జనానికి పట్టడానికి కారణమేమిటి, ఈ సంఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి వంటి విషయాలు అనేక మంచిచెడ్డలతో కలగలిపి చర్చ జరిగింది. ఇక రమ గారు రాసిన పోష్టులో అయితే అనేక కీలకమైన…

వైద్యంకోసం కాదు, జనానికి భయపడే సింగపూర్ తరలించారు -రాయిటర్స్

ఉవ్వెత్తున ఎగసిన ప్రజల ఆగ్రహానికి భయపడే భారత ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ అత్యాచారం బాధితురాలిని సింగపూర్ తరలించారని బ్రిటన్ వార్తా సంస్ధ రాయిటర్స్ నిర్ధారించింది. ప్రభుత్వ అత్యున్నత ఆసుపత్రులయిన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తో పాటు ఇతర వైద్య నిపుణులనూ,  పోలీసు అధికారులనూ ఇంటర్వూ చేసిన రాయిటర్స్ సంస్ధ ఈ నిర్ధారణకి వచ్చింది. బాధితురాలిని సింగపూర్ తరలించడానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన కొంతమంది ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్య నిపుణులకు ‘తీవ్ర పరిణామాలు తప్పవంటూ’ హెచ్చరికలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.…

గాయపడింది నేను, నా గౌరవం కాదు -సొహైలా అబ్దులాలి

(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో జనవరి 7, 2013 తేదీన ప్రచురించబడిన ఆర్టికల్ కి ఇది యధాతధ అనువాదం. సొహైలా అబ్దులాలి రచన ఇది. 17 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై, పోలీసుల సహకార నిరాకరణవల్ల దోషులకు శిక్ష పడకపోయినా, తల్లిదండ్రుల మద్దతుతో పరిపూర్ణ రచయితగా, కార్యకర్తగా, వక్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సొహైలా అబ్దులాలి మొత్తం సమాజానికి స్ఫూర్తిమంతురాలు. అత్యాచారం జరిగిన మూడేళ్ల తర్వాత అత్యాచారం గురించి వివరిస్తూ తానే ‘మానుషి’ పత్రికకు వ్యాసం రాసి శీలం…

అత్యాచారాలపై ఎలా స్పందించాలి? ఓ బాధితురాలి మాటల్లో… -వీడియో

ఈ వీడియోలో మాట్లాడుతున్న వక్త పేరు సునీతా కృష్ణన్. స్వచ్ఛంధ సంస్ధగా ఎందరో పాపలను, బాబులను, అమ్మాయిలను, మహిళలను కాపాడిన ఈమె స్వయంగా చిన్నతనంలో జరిగిన సామూహిక అత్యాచారానికి బాధితురాలు. పేగులు బైటికి వచ్చే విధంగా అనేకమంది చేత అత్యాచారం చేయబడిన నాలుగేళ్ల పాప గురించీ ఇంకా అనేకమంది గురించీ ఈమె చెబుతుంటే మనుషుల మానవత్వంపై గట్టి అనుమానం రాకతప్పదు. ఫ్లెష్ ట్రేడ్ బాధితులకు ధైర్యం ఇవ్వడానికి టన్నుల కొద్దీ సానుభూతి ఇచ్చినా అది అక్కరకు రాదనీ…

బుద్ధి జీవులు ఆగ్రహోదగ్రులైన వేళ -ఫోటోలు

అనేకానేక ప్రభుత్వ, ప్రవేటు ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఐ.టి కంపెనీలు తదితర ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న మేధోవర్గ ప్రజలు రోడ్డు మీదికి రావడం అరుదు. వారు తమను తాము భద్రజీవులుగా భావించుకోవడం దానికి ఒక కారణం కావచ్చు. డిసెంబరు 16 తేదీన జరిగిన దారుణకృత్యం తర్వాత తమకు కూడా భద్రత లేదని వీరికి తెలిసివచ్చింది. ఆర్ధిక భద్రత అనేది జీవితంలో ఒక భాగమేననీ, సామాజిక భద్రత కావాలంటే రోడ్డు మీదికి రాక తప్పదని వారి అవగాహనలోకి వచ్చింది.…