ఓ పాల బుగ్గల జీతగాడా…. ఫోటోలు

2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభాలో పావు వంతు మంది 5-14 మధ్య వయసు పిల్లలే. వీరిలో దాదాపు 15 మిలియన్ (1.5 కోట్లు) బాల కార్మికులుగా పని చేస్తున్నారని అధికారిక అంచనా. వాస్తవ సంఖ్య ఇంతకు మించి ఉండే అవకాశం ఉంది. 1971లో వీరి సంఖ్య 1.07 కోట్లు. బాల కార్మికులు లేని చోటంటూ ఇండియాలో దాదాపు కనిపించదు. వ్యవసాయ కూలీల దగ్గర్నుండి, భారీ నిర్మాణ పనుల వరకూ పడుతూ లేస్తూ చిన్నతనంలో…

జగన్ కేసు: హోమ్ మంత్రి సబితను ఊరడించిన తోటి మంత్రులు!?

రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నట్టుండి కలకలం రేగింది. మంత్రులు ఆనం, బొత్సలు హడావుడిగా సమావేశాలు జరుపుతుంటే టి.వి చానెళ్లు, పత్రికల విలేఖరులు వారేమి చెప్పబోతున్నారా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐదవ చార్జి షీటు దాఖలు చేసిన సి.బి.ఐ అందులో నాలుగో నిందితురాలిగా (A4) పేర్కొనడం దీనికి కారణం. మార్చి 31 లోపు విచారణ పూర్తి చేస్తామని చెప్పిన సి.బి.ఐ అలా చెయ్యకపోగా మరో చార్జి…

ఐరిష్ అబార్షన్ చట్టం: డాక్టర్లా లేక మత బోధకులా?

‘మాది కేధలిక్కుల దేశం’ అని మూర్ఖంగా వాదించి భారతీయ డెంటిస్టు సవితా హలప్పనవార్ ప్రాణాలు బలిగొన్న ఐర్లండు డాక్టర్లు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం తలపెట్టిన బలహీన ‘అబార్షన్ చట్టాన్ని’ కూడా వ్యతిరేకిస్తున్నారు. తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు తీవ్రమైన కేసుల్లో అబార్షన్ కు అనుమతించేందుకు చట్టంలో కల్పించిన అవకాశాన్ని ఐరిష్ మెడికల్ ఆర్గనైజేషన్’ (ఐ.ఎం.ఒ) సమావేశం తిరస్కరించింది. ఇంకా ఘోరం ఏమిటంటే అత్యాచారం, స్వకుటుంబ సంపర్కం తదితర ప్రత్యేక పరిస్ధితుల ద్వారా సంభవించిన గర్భాన్ని తొలగించడానికి కూడా…

అలజడి, ఆందోళనల నేపధ్యం ఏమిటి? -ఈనాడు ఆర్టికల్ 8వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాసాల పరంపరలో ఎనిమిదవ భాగం ఈ రోజు ఈనాడులో వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలకు, మిలిటెన్సీకి నేపధ్యాన్ని ఈ భాగం క్లుప్తంగా చర్చించింది. ఈ చర్చాంశాల ఆధారంగా అక్కడి పరిణామాలను పరిశీలిస్తే ఒక అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో చదవాలనుకుంటే కింద బొమ్మపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఓపెన్…

మా తాగడుకు మహేష్ బాబే కారణం, ఇద్దరు యువకుల ఫిర్యాదు

ఇది బొత్తిగా ఊహించని పరిణామం. తాగుడుతో తమ ఒళ్ళు గుల్ల అవడానికి కారణం సినిమా హీరో మహేష్ బాబే అని ఆరోపిస్తూ ఇద్దరు యువకులు రాష్ట్ర మానవ హక్కుల సంస్ధకు ఫిర్యాదు చేశారు. ఒక పేరు పొందిన లిక్కర్ బ్రాండు (రాయల్ స్టాగ్) కు మహేష్ బాబు ప్రచారం చేశాడని, తాము ఆయనకు పిచ్చి ఫ్యాన్ లము కావడంతో తాము కూడా తాగడం ప్రారంభించామని సతీష్ కుమార్, అమ్రు నాయక్ లు ఫిర్యాదు చేశారు. తాగుడు వలన…

ఐ.ఏ.ఎస్ అధికారి నిజాయితీకి బహుమతి: 44వ బదిలీ

సోనియా గాంధీ జామాత రాబర్ట్ వాద్రా పాల్పడిన అక్రమ భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించి వార్తలకెక్కిన హర్యానా కేడర్ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యాడు. వాద్రా భూ కుంభకోణం తుట్టె కదిలించినందుకు గత అక్టోబరు నెలలో బదిలీ అయిన ఖేమ్కా, విత్తనాభివృద్ధి సంస్ధ నుండి మళ్ళీ బదిలీ వేటు ఎదుర్కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీకి కారణం చెప్పలేదు. విత్తనాభివృద్ధి సంస్ధ ఉద్యోగుల పోస్టింగులు, క్రమశిక్షణ చర్యలతో హర్యానా పాలకవర్గాలు కన్నెర్ర చేయడమే…

ఇలాంటి దారుణాలు పశ్చిమ దేశాల్లోనే జరుగుతాయి…

మాజీ భార్య పైన నేరం నెట్టడానికి తాజా భార్యతో కలిసి ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురు పిల్లలని చంపుకున్న జంట కధ ఇది. 8 వారాల పాటు కొనసాగిన కోర్టు విచారణలో 56 యేళ్ళ నిందితుడు మిక్ ఫిల్ పాట్ అత్యంత అసహజమైన జీవితం గడిపిన వ్యక్తిగా పత్రికల్లో స్ధానం సంపాదించాడు. ఐదుగురు భార్యలతో మొత్తం 17 మంది పిల్లలకు జన్మ ఇవ్వడం, పదేళ్లపాటు ఇద్దరు భార్యలతో ఒకే ఇంటిలో గడపడం, మిత్రులతో కలిసి భార్యతో లైంగిక…

అవినీతిని నిలదీసేది దళిత మహిళ ఐతే…

ఆమె ఒక మహిళా సంఘం కార్యకర్త. అవినీతిని నిలదీయడం ఆమె చేసిన నేరం. ఆ మాత్రానికే అత్యంత ఘోరంగా ఆమె పైన అత్యాచారం చేసి, వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో హింసించి చంపేశారు. ఫిర్యాదు చేయబోయిన తండ్రి, కుమారుల పైనే నేరం బనాయించడానికి సిద్ధపడడం పోలీసుల వికృత లీలకు తాజా రూపం. భూస్వామ్య కుల దురహంకారం ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహించే బీహార్ సీమ ఈ ఘోరానికి వేదిక. దేశం మొత్తం అభివృద్ధి పధంలో సాగడానికి తమ…

వావ్… ఫొటోలు, పోటీ కోసం!

స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ నిర్వహించే పోటీ కోసం ఎంపికైన టాప్ 50 ఫొటోల్లో ఇవి కొన్ని. 112 దేశాల నుండి 37,600 ఫొటోలు పోటీ కోసం వచ్చాయట. అందులో 50 ఫొటోలను షార్ట్ లిస్ట్ చేసింది మ్యాగజైన్. ఇంకా చివరి ఫలితాలు వెల్లడి కాలేదట. ఐదు విభాగాల్లో విజేతలు నిర్ణయించి బహుమానం ఇవ్వనున్నారు. పోటీ ఈ రోజు, అంటే మార్చి 29 తో ముగుస్తోంది. ‘రీడర్స్ ఛాయిస్‘ విజేత కోసం ఈ ఫొటోలను స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ తన వెబ్…

ఐ.పి.ఎల్: పిచ్ చూసి చెబుతాం… ఎవరు ఆడతారో -కార్టూన్

పిచ్ ను బట్టి ఏయే దేశాల వాళ్లు ఆడవలసి ఉంటుందో కెప్టెన్ నిర్ణయించ వలసిన రోజులు వచ్చేసాయి. ఏ దేశం వాళ్లు ఆడగూడదో చెప్పాక, ఏయే దేశాల వాళ్లు ఆడతారో కూడా చెప్పాలి కదా! ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర ఆ విషయమే చెబుతున్నారు, ఈ కార్టూన్ ద్వారా. లేకపోతే, ఐ.పి.ఎల్ మ్యాచుల్లో ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు ఆడగూడదని రాజకీయ నాయకులు నిర్ణయించడం ఎమిటి, విడ్డూరం కాకపోతే. అది కూడా ఒక రాష్ట్రంలో ఆడే మ్యాచ్…

సూర్యనెల్లి అత్యాచారం: రాజ్యసభ ఉపాధ్యక్షుడికి తాజా నోటీసులు

సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసు రాజ్య సభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ ను వదలకుండా వెంటాడుతోంది. బాధితురాలి పట్టు విడవని ప్రయత్నాలు కేరళ కాంగ్రెస్ నాయకుడికి రాజకీయంగా చివరి రోజులు ఖాయం చేసినట్లు కనిపిస్తోంది. తన పైన అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన పి.జె.కురియన్ పైన పునర్విచారణ చేయాలని మార్చి నెల ఆరంభంలో బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ ను పెరుమాదె జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 2 తేదీన కొట్టివేసింది. అయినప్పటికీ పట్టు విడవకుండా…

జయ హుకుం, ఐ.పి.ఎల్ జో హుకుం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంధించిన లేఖాస్త్రం, ఐ.పి.ఎల్ పాలిట బ్రహ్మాస్త్రమే అయింది. తమిళనాడులో ‘అమృత యూనివర్సిటీ‘ లాంటి ప్రధాన విద్యా సంస్థలు సైతం యూనివర్సిటీని మూసేసి విద్యార్ధులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపేందుకు దారి తీసిన ఆందోళనలు ఇపుడు శ్రీలంక ఐ.పి.ఎల్ ఆటగాళ్ళకు ‘ఆట‘విడుపును సమకూర్చాయి. జయలలిత ‘హుకుం‘ జారీ చేయగా, ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ ‘జో హుకుం‘ కొట్టి సలాము చేసింది. చెన్నైలో జరిగే ఐ.పి.ఎల్ మ్యాచ్ లకు…

వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -ఈనాడు ఆర్టికల్ 6వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే ఆర్టికల్ వరుసగా ఈనాడు చదువు పేజీలో ప్రచురితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఆరవ భాగం ఈరోజు (సోమవారం, మార్చి 25 తేదీ) ప్రచురించబడింది. ఐదు భాగాల వరకూ అంతర్జాతీయ పరిస్ధితులను ఎలా చూడలన్న విషయాన్ని చూశాము. అంతర్జాతీయ రంగంలో ఉండే వివిద శిబిరాలు, ఆర్ధిక, రాజకీయ కూటములు, భౌగోళిక విభజనలు, వాటి ప్రాధాన్యతలు తదితర అంశాలను ఈ ఐదు భాగాల్లో చర్చించాము. ఆరవ భాగం…

నీటి ఆటలు కొందరికి; నీటి పాట్లు మరెందరికో -ఫొటోలు

భవిష్యత్తులో నీటి కోసం ప్రపంచ యుద్ధాలు తప్పవని అనేకమంది ఇప్పటికే జోస్యం చెప్పేశారు. భూగ్రహం వేడెక్కుతున్న ఫలితంగా ‘నీటి కొరత ఒక చోట, పల్లెలను, నగరాలను తేడా లేకుండా ముంచెత్తే తుఫాను వరదలు మరొక చోట’ నిత్య వాస్తవంగా మారిపోయింది. లాభ దాహాలతో పరితపించి పోతున్న కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను స్వాధీనం చేసుకుంటూ ప్రజలు దాహంతో పరితపించేలా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. లేకపోతే కాసింత రంగు కలిపి మిలియన్లు దండుకుంటున్న కూల్ డ్రింకు కంపెనీల కోసం…

మధ్యాహ్న భోజనం పిల్లలకి కాదు, భోక్తలకి

– చిన్న పిల్లల ‘మధ్యాహ్న భోజన పధకం‘ కూడా అవినీతి పరుల బొజ్జలు, భోషాణాలు నింపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ దారుణం జరుగుతోంది. అనేక సంవత్సరాలుగా ఢిల్లీలోని బడి పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం అత్యంత అనారోగ్యకరంగా ఉంటోందని ప్రయోగ శాలల పరీక్షలు తేల్చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సేకరించిన మధ్యాహ్న భోజన శాంపిళ్లలో 83 శాతం ప్రయోగశాలల పరీక్షల్లో విఫలం అయ్యాయని ఆర్.టి.ఐ (Right to Information) చట్టం…