నాకు తెలియని ఉదయభాను

ఈ పాట నిన్నే విన్నాను (చూశాను). ఉదయభాను తన అమ్మగారితో కలిసి ఈ పాట రాశారట. పాట రాయడం అటుంచి ఆమె పాడతారని కూడా నాకు తెలియదు. ‘నేను గతంలో చాలాసార్లు పాడాను’ అంటున్న ఆమెను చూసి ‘నిజమా’ అనుకుని హాశ్చర్యపోయేసి అందులోంచి తేరుకునే లోపు ఆమె పాడడం కూడా మొదలుపెట్టారు. పాట ఒక్కోపాదం వినేకొద్దీ నా ఆశ్చర్యం అవధులు దాటింది. మధ్యలో తెలంగాణ యాసలో ఉన్న కొన్ని పదాలు తప్ప  చాలావరకు పాట అర్ధం అయింది.…

బీజింగ్ విమానాశ్రయంలో పేలుడు, వీల్ చైర్ వ్యక్తి అరెస్టు

బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లో విమానాశ్రయంలోకి వచ్చిన వ్యక్తి ఒకరు బాంబు పేలుడుకు పాల్పడ్డాడు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి తప్ప మరెవ్వరూ గాయపడలేదని తెలుస్తున్నది. పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తి చాలా కాలంగా న్యాయం కోసం పోరాడి విఫలమై ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాలో ధనిక వర్గాలకు అనుకూలంగా సామాన్యులపై పోలీసు నిర్బంధం తారాస్ధాయికి చేరిందని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.…

ముస్లింల జనాభా: అభిప్రాయాలూ – దురభిప్రాయాలు

భారత దేశంలో హిందువులు, ముస్లింల జనాభా వృద్ధి విషయంలో వివిధ వేదికల పైన అనేక వాదనలు, ప్రతి వాదనలు జరుగుతుంటాయి. వీటిలో హిందూ అతివాద శక్తులు సాగించే దుష్ప్రచారం కలిసిపోయి ఉంటుంది. ఈ దుష్ప్రచారంతో ప్రభావితులై అనేకమంది సామాన్య ప్రజలు కూడా అవే వాదనలు నమ్మి తమకు తెలియకుండానే నోటి మాట ద్వారా ప్రచారం చేస్తుంటారు. ఒక్క క్షణం నిలబడి ఈ వాదనలు నిజామా కాదా అని ప్రశ్నించుకుని వాటికి ఖచ్చితమైన సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తే తాము…

బీహార్ ఘోరం: మధ్యాహ్న భోజనం తిని 22 విద్యార్ధులు మృతి

మంగళవారం బీహార్ లో ఘోరం జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 22 మంది ప్రాధమిక తరగతుల విద్యార్ధులు చనిపోయారు. 50 మందికి పైగా ఆసుపత్రిలో తీవ్ర అశ్వస్ధతలో ఉన్నారు. ఆహారంలో పురుగుల మందు కలవడం వలన విద్యార్ధులు చనిపోయారని ప్రాధమిక పరిశీలన మేరకు అర్ధం అవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయని ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా అశ్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వంట చేసినవారు…

నల్లజాతి యువకుడి హత్య తీర్పు, అట్టుడుకుతున్న అమెరికా

అమెరికాలో జాతి విద్వేషం మళ్ళీ ప్రముఖంగా చర్చకు వచ్చింది. గత సంవత్సరం తెల్లజాతి పోలీసు చేతిలో హత్యకు గురయిన ట్రేవాన్ మార్టిన్ కేసులో నిందితుడు నిర్దోషి అని శనివారం కోర్టు తీర్పు చెప్పడంతో అమెరికా వ్యాపితంగా నిరసనలు చెలరేగాయి. అనేక చోట్ల నిరసనకారులు విధ్వంసాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. జాతి బేధం లేకుండా అన్ని జాతుల వారు నిరసనల్లో పాల్గొంటున్నారు. ట్రేవాన్ మార్టిన్ నల్లజాతికి చెందినవాడు కనకనే పోలీసు సహాయకుడు జిమ్మర్ మేన్ అతని నుండి ఎటువంటి ప్రమాదం…

ఇళవరసన్ ది ఆత్మహత్యే!

ఇళవరసన్ ఆత్మహత్య చేసుకున్నారని దాదాపు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్ధలంలో ఆత్మహత్య లేక లాంటిదేదీ దొరకలేదని మొదట రైల్వే పోలీసులు చెప్పినప్పటికీ వాస్తవానికి ఆయన లేఖ రాసినట్లు ఆ తర్వాత తెలిసింది. ఇళవరసన్ తన ఆత్మహత్యకు కారణాలు తెలియజేస్తూ నాలుగు పేజీల లేఖ రాశారని, దానిని తన జీన్ ఫ్యాంట్ జేబులో ఉంచారని తెలుస్తోంది. కానీ రైల్వే పోలీసులు వచ్చే లోపలే ఆ లేఖను సమీప బంధువులు తీసుకోవడంతో లేఖ రాయలేదని పోలీసులు పత్రికలకు తెలిపారు.…

సాలీడు బుడతలు (స్పైడర్ కిడ్స్) -వీడియో

ఇదెలా సాధ్యం? ‘స్పైడర్ మేన్’ సినిమా కాబట్టి అందులో హీరో గోడల మీద వేగంగా ఎగబాకడం సాధ్యం అయింది. కానీ ఇది నిజం. ఈ బాలుడు ఎవరో తెలియదు. ఫేస్ బుక్ లో కనపడిన ఈ వీడియో కింద వివరణ పదాల ప్రకారం టర్కీ బాలుడని మాత్రం అర్ధం అయింది.   – విచిత్రం ఏమిటంటే దాదాపు అదే టర్కీ టైటిల్ తో (Düz Duvara Tırmanan Örümcek Bebekler) మరో రెండు వీడియోలు దొరికాయి. ఇందులో…

గుజరాత్ హత్యాకాండ: నేను తప్పు చేయలేదు -మోడి

గుజరాత్ మారణకాండను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి పరోక్షంగా సమర్ధించుకున్నారు. తాను ఏది సరైంది అనుకున్నానో అదే చేశానని నరేంద్ర మోడి రాయిటర్స్ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధులు ఆయన మాటలకు దురుద్దేశాలను అంటగడుతున్నారని ఆరోపిస్తున్నప్పటికీ ఆ మాట నరేంద్ర మోడియే ఎందుకు చెప్పరో అర్ధం కాని విషయం. మోడి తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడం, దానికి అసలు అర్ధాలేవీటో ఆ తర్వాత పార్టీ ప్రతినిధులు వివరణలకు పూనుకోవడం దేశాన్ని పాలించదలుచుకున్న వ్యక్తులకు,…

ఇళవరసన్ ది హత్యా, ఆత్మహత్యా? -తొలగని అనుమానాలు

ధర్మపురిలో రైలు పట్టాలపై శవమై కనిపించిన ఇళవరసన్ ది హత్యే అన్న అనుమానాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ది హిందు పత్రిక ప్రకారం ధర్మపురి ప్రాంతంలో రైలు పట్టాల పక్కన శవం కనిపించినట్లుగా ఏ రైలు అధికారీ రికార్డు చేయలేదని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే నిబంధనల ప్రకారం ఒక రైలు ఏ వ్యక్తినైనా ప్రమాదవశాత్తూ ఢీ కొట్టినా లేక ఆత్మహత్య కోసం రైలు ముందుకు దూకినా సదరు రైలు డ్రైవర్ గానీ, గార్డు గానీ లేదా ఇతర…

మతాంతర వివాహంపై మియాన్మార్ బౌద్ధుల ఆంక్షలు

తమిళనాడులో పి.ఎం.కె పార్టీ తరహాలోనే మియాన్మార్ లో బౌద్ధ మత పెద్దలు మహిళా స్వేఛ్ఛపై ఆంక్షలకు తెగబడుతున్నారు. బౌద్ధ యువతులను ఇతర మతాల యువకులు వివాహం చేసుకోకుండా ఆంక్షలు విధించే చట్టం ముసాయిదాను దేశ వ్యాపిత బౌద్ధ సాధువుల సమ్మేళనం ఒకటి ప్రభుత్వానికి సమర్పించబోతోంది. తీవ్రవాద భౌద్ధమత గురువుల ఆధ్వర్యంలో బౌద్ధ సన్యాసులు సమావేశమై ఈ మేరకు గురువారం నిర్ణయం తీసుకున్నారు. బౌద్ధ యువతులు ఇతర మతాల యువకులను పెళ్లి చేసుకోకుండా ఆంక్షలు విధించడానికి ఈ ముసాయిదా…

2 కోట్లు విదిల్చి రాంబో గొప్పలేల మోడి సారు?

134 మంది పట్టే విమానంలో రెండు రోజుల్లో 15,000 మంది గుజరాతీ యాత్రీకులను నరేంద్ర మోడి రక్షించారట! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారు స్వయంగా ఈ విషయం చెప్పుకుంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఎన్నికల ప్రచారానికి 5,000 మందికి పైగా హిందూ భక్తులు దుర్మరణం చెందినట్లు భయపడుతున్న కేదార్ నాధ్ వరద భీభత్సం కంటే మించిన సదవకాశం నరేంద్ర మోడి గారికి దొరక్కపోవడం అత్యంత అమానుషం కాగా, సాధ్యా సాధ్యాలు పరిశీలించకుండానే మోడీ భక్తాగ్రేసరులు…

ఋతు పవన రాగాలు, భరత జీవన విరాగాలు

భారత దేశ ప్రజల బతుకు చిత్రంలో ఋతుపవనాల రంగులకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో చెప్పలేము. కేరళలో అడుగుపెట్టి అటు అండమాన్, ఇటు ఉత్తరాఖండ్ ల వరకూ భరత ఖండం అంతా విస్తరించే నైరుతి ఋతుపవనాలైనా, హిమాలయాల చల్లదనాన్ని కారు మబ్బుల ద్వారా దక్షిణాదికి మోసుకొచ్చే ఈశాన్య ఋతుపవనాలైనా భారత దేశంలోని సకల ఉత్పత్తి రంగాలకు జీవ గర్రలు. నీటి పారుదల సౌకర్యం కలిగిన పొలాలకు కూడా ఈ రెండు పవనాలు తెచ్చే వానలే నదులు, రిజర్వాయర్లను నింపి…

వైట్ హౌస్ కంచె మరమ్మతు -జోక్ కాదు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు. ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు. బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400…

ట్వింకిల్… ట్వింకిల్… విని (చూసి) తీరాలి!

ట్వింకిల్… ట్వింకిల్… లిటిల్ స్టార్… ఈ పాటని తమ పిల్లల నోట విని సంతోషించని వారు ఎవరూ ఉండరు. పాట పల్లవి వినడమే తప్ప పూర్తిగా విన్నది ఎప్పుడూ లేదు. ఈ బుజ్జి పాప నోట, తన బుగ్గలు, కళ్లల్లో నుండి అనంత కోటి ట్వింకిల్స్ ప్రవహిస్తుండగా విని, చూసి మెచ్చని వారు ఉండరు. మీకు ఖచ్చితంగా బోర్ కొట్టదు. నాదీ హామి. – – –