మార్స్ ఆర్బిటర్ నుండి మొదటి ఫోటో
మన అంతరిక్ష శాస్త్రజ్ఞులు తలపెట్టిన అంగారక ప్రయాణంలో మొట్టమొదటి చిగురు బీజాన్ని చీల్చుకుని తొంగి చూసింది. ప్రస్తుతం భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ఉపగ్రహం భూగ్రహాన్ని ఫోటో తీసి పంపింది. భారత దేశం, దాని చుట్టుపక్కల ఉన్న భూ, సముద్ర భాగాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఉపగ్రహాలు భూమి ఫోటోలు తీసి పంపడం కొత్తేమీ కాదు. ఆ పనిని ఇస్రో ఇప్పటికే ప్రయోగించిన అనేక ఉపగ్రహాలు రోజూ చేసే పనే. అయితే…













