దెబ్బకు దెబ్బ: అమెరికా రాయబారుల హోదా కుదించిన ఇండియా

భారత ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) అధికారి దేవయాని అరెస్టుకు ఇండియా లేటుగా అయినా ఘాటుగా స్పందిస్తోంది. న్యూయార్క్ లోని ఇండియా కాన్సల్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న దేవయానిని అరెస్టు చేయడమే గాక దురహంకార పూరిత పద్ధతుల్లో ఆమెను బట్టలు విప్పించి వెతికారని, పెట్టీ దొంగలు, వ్యభిచారుణులు, హంతకులతో కలిపి పోలీసుల సెల్ లో నిర్బంధించారని వార్తలు వెలువడిన నేపధ్యంలో ఇండియాలోని అమెరికా రాయబారుల పట్ల తాము వ్యవహరిస్తున్న తీరును…

చంద్రుడిని తాకిన మూడో దేశం చైనా

‘చాంగ్-ఎ 3’ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో చైనా అరుదైన రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని దింపిన మూడో దేశంగా చైనా అంతరిక్ష ప్రయోగాల రికార్డు పుటలకు ఎక్కింది. అమెరికా, (పాత) సోవియట్ రష్యా దేశాలు గతంలో ఈ ఫీట్ సాధించాయి. 1970ల తర్వాత చంద్రుడిపై ఒక మానవ నిర్మిత ఉపగ్రహం సాఫ్ట్-ల్యాండింగ్ లో సఫలీకృతం కావడం ఇదే మొదటిసారి. చంద్రుడిపైన ఇంద్రధనుస్సుల అఖాతం (Bay of Rainbows) గా పిలిచే చోట చాంగ్-ఎ 3 ఉపగ్రహం…

పనిమనిషిని మోసం చేసి అరెస్టయిన భారత రాయబారి

న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యుటి కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న అధికారి ‘వీసా మోసం’ కేసులో అరెస్టయ్యారు. వీసా మోసం, తప్పుడు సమాచారం కేసుల్లో సదరు రాయబారి అరెస్టయినప్పటికి అసలు విషయం పని మనిషికి వేతన చెల్లింపులో మోసం చేయడం. పని మనిషికి అమెరికా వీసా సంపాదించడానికి అమెరికా చట్టాల ప్రకారం నెలకు వేతనం 4,500 డాలర్లు చెల్లిస్తానని చెప్పిన రాయబార అధికారి వాస్తవంలో రు. 30,000/- (500 డాలర్ల కంటే తక్కువ)…

మండేలా అంతిమ క్రియల్లో ఒబామా ఫోటో సంబరం

ఒక వ్యక్తి చనిపోయినపుడు ఎవరైనా ఎలా ప్రవర్తిస్తారు? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ వారికి జరిగిన నష్టం వలన తాము ఎంత భాధగా ఉన్నది తెలిసేట్లుగా ప్రవర్తిస్తారు. వేరే ఎన్ని పనులున్నా వాటి జోలికి పోకుండా సంయమనం పాటిస్తారు. నెల్సన్ మండేలా లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోరాట యోధుడు చనిపోయినప్పుడయితే ఎంత క్రమశిక్షణ పాటించాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అమెరికా, డెన్మార్క్, బ్రిటన్ దేశాల అధినేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి వార్తలకెక్కారు.…

స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం -సుప్రీం కోర్టు

స్వలింగ సంపర్కాన్ని నేర సమానం చేసే చట్టాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తిరస్కరించింది. అసహజమైన స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది. ఐ.పి.సి లోని సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తుంది. దీనికి పాల్పడినవారిని నేరస్ధులుగా పేర్కొంటూ గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను ఇది ప్రతిపాదిస్తుంది. పౌరుల ప్రాధమిక హక్కులను తిరస్కరిస్తోందని చెబుతూ ఈ సెక్షన్ ను రద్దు చేస్తున్నట్లుగా 2009లో ఢిల్లీ హై…

సింగపూర్ హింస, 24 మంది భారతీయుల అరెస్టు

ప్రపంచంలో అత్యంత భద్రమైన దేశాల్లో ఒకటిగా పరిగణించే సింగపూర్ ఆదివారం దాడులు, దహనాలతో వార్తల్లో నిలిచింది. అల్లర్లకు కారకులంటూ సింగపూర్ ప్రభుత్వం 27 మందిని అరెస్టు చేయగా వారిలో 24 మంది భారతీయులే. నగర రాజ్యం (city state) గా పిలిచే సింగపూర్ ప్రధానంగా వలస కార్మికుల శ్రమ పైనే ఆధారపడే దేశం. భారత దేశం నుండి వలస వెళ్ళిన కార్మికుడు ఒకరిని బస్సు ఢీ కొట్టి చంపడంతో అల్లర్లు చెలరేగినట్లు పత్రికలు చెబుతున్నాయి. అయితే అల్లర్లకు…

కులదాడి: రక్షణకోసం తుపాకి అడిగితే అందుక్కూడా కొట్టారు

దళిత యువకులు చీప్ గా దొరికే నల్ల కళ్ళద్దాలు తగిలించి, జీన్స్ ఫ్యాంటు, టీషర్టులు తొడుక్కుని వన్నియార్ కుల యువతులను వలలో వేసుకుంటున్నారని తమిళనాడు వన్నియార్ పార్టీ పి.ఎం.కె తరచుగా చేసే ఆరోపణ. ఈ ఆరోపణ ఆధారంగానే పి.ఎం.కె పార్టీ కులాంతర వివాహాలను నిషేధించాలనే వరకూ వెళ్లింది. పి.ఎం.కె ఆరోపణలకు భిన్నంగా వన్నియార్ యువకుడొకరు దళిత యువతిని పెళ్లాడినా ఆ పార్టీ విషం చిమ్మడం మానలేదు. వారి నుండి రక్షణ కోసం దళిత యువతి తుపాకి లైసెన్స్…

ఇది రేప్ నెంబర్ 2 -అరుంధతి రాయ్

(తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతంపై ఔట్ లుక్ పత్రికకు అరుంధతి రాయ్ రాసిన ఆర్టికల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఇండియా ఇంక్ (India Ink) భాగస్వాముల్లో తరుణ్ తేజ్ పాల్ ఒకరు. నా నవల ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ ను మొదట ప్రచురించిన పబ్లిషింగ్ కంపెనీ ఇదే. ఇటీవలి ఘటనలపైన స్పందించమని నన్ను అనేకమంది జర్నలిస్టులు కోరారు. మీడియా సర్కస్ పెద్ద పెట్టున ఊళపెడుతున్న నేపధ్యంలో  ఏదన్నా చెప్పడానికి…

రెండొంతులు మహిళా విలేఖరులకు వేధింపులు, బెదిరింపులు

ప్రపంచ వ్యాపితంగా మహిళా విలేఖరులు అనేక గడ్డు పరిస్ధుతుల మధ్య వృత్తి ధర్మం నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులుగా పని చేస్తున్న మహిళల్లో మూడింట రెండు వంతుల మంది వేధింపులు, బెదిరింపులు, లైంగిక అత్యాచారాలను ఎదుర్కొంటున్నారు. మహిళా విలేఖరుల పైన మొదటిసారి జరిగిన సర్వేలో ఈ సంగతి వెల్లడి అయింది. వార్తల మీడియాలో పని చేస్తున్న స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ హింసల గురించి ఈ సర్వే జరిగింది. ఈ వేధింపులు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్…

రవి గాంచని చోట ఛాయాగ్రాహకుడు గాంచున్

‘రవి గాంచని చోట కవి గాంచున్’ అని పెద్దల మాట! కానీ అది పాత రోజుల్లో. ఫోటోగ్రాఫర్ శక్తి ఏమిటో బహుశా ఆనాటి పెద్దలకు ఇంకా అర్ధం అయి ఉండదు. ఈ మాట చెప్పేనాటికి ఫోటోగ్రఫి ఈ స్ధాయిలో అభివృద్ధి చెందలేదని సరిపెట్టుకుందాం. మానవుడికి అందుబాటులో లేని సుదూర తీరాలకు సైతం కెమెరా కన్ను ఈ రోజు ప్రయాణిస్తోంది. మనిషి కన్ను మహా అయితే భూ కక్ష్య వరకే చూడగలదు. కానీ కెమెరా కన్ను ఇప్పుడు అంగారకుడిని…

సచిన్ పొగడ్తలు కట్టిపెట్టండి -పాక్ తాలిబాన్

సచిన్ టెండూల్కర్ రిటైర్మెంటే పెద్ద వార్త అనుకుంటే, రిటైర్మెంట్ అనంతర కాలంలో కూడా సరికొత్త వార్తలకు ఆయన రిటైర్మెంట్ కేంద్రం అవుతోంది. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఆయన్ను పొగడ్తల్లో ముంచడానికి, తద్వారా కాసింత క్రెడిబిలిటీ పొందడానికీ భారత రాజకీయ నేతలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. కానీ పాకిస్ధాన్ రాజకీయ రంగంలో ఇందుకు విరుద్ధమైన పరిణామం చోటు చేసుకుంది. పాకిస్ధాన్ తాలిబాన్ గా పేరొందిన తెహరీక్-ఎ-తాలిబాన్ సంస్ధ ‘సచిన్ పై పొగడ్తలు కురిపించడం ఇక కట్టిపెట్టాలని పాక్…

ఆ సుప్రీం జడ్జి పేరు ఎ.కె.గంగూలీ

‘నువ్వు కూడానా బ్రూటస్?’ షేక్ స్పియర్ నాటకంలో రోమన్ డిక్టేటర్ జులియస్ సీజర్ ను కత్తితో పోడిచినవారిలో బ్రూటస్ కూడా ఉండడం చూసి సీజర్ వేసే ప్రశ్న ఇది. ‘జులియస్ సీజర్’ నాటకంలో మూడో సీన్ లో (మార్క్ ఏంటోని ప్రసంగం ‘ఫ్రెండ్స్, రోమాన్స్, కంట్రీమెన్!’ కాకుండా) అత్యంత పేరు పొందిన డైలాగ్ ఇది. తనకు అత్యంత ప్రియమైన స్నేహితుడని భావించిన సెనేటర్ మార్కస్ బ్రూటస్ కూడా తనను హత్య చేస్తున్నవారిలో ఉండడం చూసి సీజర్ ఇలా…

తెహెల్కాకు సోమా చౌదరి రాజీనామా!

మరో అనూహ్య పరిణామం! తెహెల్కా రధానికి ఇప్పుడు సారధి కూడా లేరు. యుద్ధం చేయాల్సిన వ్యక్తే విల్లమ్ములను బొంద పెట్టడంతో ఇప్పటికే బోసిపోయిన రధం సోమా చౌదరి రాజీనామాతో సారధి కూడా కరువై ఒంటరిగా మిగిలింది. అద్వితీయ కధనాలతో చెలరేగిపోయిన తెహెల్కా రధం ఇప్పుడు యుద్ధ వీరుడూ, సారధీ ఇద్దరూ లేక వెలతెలా పోతోంది. అన్నివైపుల నుండి విమర్శలు చుట్టుముట్టడంతో తన ఉనికి పత్రికకు నష్టమో, లాభమో తానే తేల్చుకోలేకుండా ఉన్నానని చెబుతూ సోమా చౌదరి తన…

అన్ని దారులూ తేజ్ పాల్ వ్యతిరేక దిశలోనే…

కొన్ని పరిణామాలను గమనిస్తే, ‘టైమ్’ గురించి పెద్దల పేరుతో జనం చెప్పుకునే మాటలు నిజమేనేమో అని భ్రమింపజేస్తాయి. జరిగిన ఘటన పూర్వాపరాల సమాచారం లేకపోయినా, లేదా అందుబాటులో ఉన్న సమాచారం పైన సంయక్ దృక్పధం లోపించినా ఈ ‘టైమ్’ ట్రాప్ లో పడిపోవడం ఖాయం. ప్రస్తుతం తరుణ్ తేజ్ పాల్ విషయంలో జరుగుతున్న పరిణామాల విషయంలో ‘టైమ్ ఫ్యాక్టర్’ ని దోషిగా తెస్తున్నవారిని చూస్తే ఇదే అనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా ‘పట్టిందల్లా బంగారమే, కన్ను కుట్టిందల్ల…

హలో తెహెల్కా! ఏమిటీ పని?

తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్ వ్యవహారంలో దృశ్యాలు శరవేగంగా మారుతున్నాయి. తెహెల్కా పత్రిక గోవాలో జరిపిన ‘THiNK ఫెస్టివల్’ సందర్భంగా తమ పత్రికలో పని చేసే ఒక యువ మహిళా జర్నలిస్టుపై లైంగిక అత్యాచారం జరపిన ఆరోపణలు రావడంతో పత్రికా ప్రపంచంతో పాటు అనేకమంది నిర్ఘాంతపోయారు. అణచివేతకు గురవుతున్న వర్గాల తరపున పని చేయడంలో ప్రశంసాత్మక కృషి చేసిన తెహెల్కా ఎడిటర్ తాను కూడా మురికిలో భాగం అని ప్రకటించుకున్న సందర్భం అభ్యుదయ కాముకలను తీవ్రంగా…