సోచి వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ విన్యాసాలు అద్భుతం! -ఫోటోలు

22వ శీతాకాల ఒలింపిక్స్ రష్యా నగరం సోచి లో ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అధ్యక్షుడు బషర్ కి మద్దతు ఇవ్వడం మానుకుంటే టెర్రరిస్టు దాడులకు గురికాకుండా సజావుగా సాగేలా చూస్తామని సౌదీ రాచరిక ప్రభుత్వంలో గూఢచార విభాగ నేత ప్రిన్స్ బందర్ బేరం పెట్టిన వింటర్ ఒలింపిక్స్ ఇవే. విఫలం అయినా, ఆటంకాలు ఎదురైనా విరుచుకుపడి దాడి చేద్దామని పశ్చిమ పత్రికలు ఆత్రంగా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్ కూడా ఇవే. ఒలింపిక్స్ కు…

ఇంద్రధనుస్సు పారిపోయి నీటి మడుగున దాగిందా?

పుడమి వేడికి తల్లడిల్లిన ఇంధ్ర ధనుస్సు ఓజోన్ గొడుగు లేక నీటి మడుగున దాగిందా? నీటి మడుగున దాగిన ఇంద్రచాపం రంగుల వేళ్ళు చాచి ఊపిరి కోసం ఉపరితలాన్ని చేరుతోందా? నీటి గర్భం చీల్చుకున్న రంగుల ఉమ్మనీరు కొత్త ఊపిరి రాకను చాటుతోందా? హ్రదయ జలధిని వీడిన భావ తరంగం ఆనంద నాట్యంతో అంచులు దాటి పొర్లుతోందా? గుండె గుండం పేలిపోయి విలయ గండం ప్రకటిస్తోందా? జ్ఞానం కూరిన మెదడు మందుగుండు హాఛ్ మని తుమ్మిందా? దీర్ఘ…

ఎఎపి పాలన: షీలాపై ఎఫ్.ఐ.ఆర్

మొదటి వేటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పైనే పడింది. సి.ఎం అరవింద్ ఆదేశం అందుకున్న రోజే ఢిల్లీ ఎ.సి.బి రంగంలోకి దిగింది. వీధి దీపాల కుంభకోణంలో మాజీ సి.ఎం షీలా దీక్షిత్ పై ఎ.సి.బి, ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసింది. 2010లో కామన్వెల్త్ ఆటల పోటీలు ఢిల్లీలో జరిగిన సందర్భంగా చేపట్టిన వీధి దీపాల నిర్మాణం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని షుంగ్లు కమిటీ తేల్చింది. కమిటీ పరిశీలనలను షీలా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త…

పసిభావాలను ఒడిసి పట్టిన ఫోటోగ్రాఫర్ అమ్మ -ఫోటోలు

పసి పిల్లల చేష్టలని ఇష్టపడని వారు ఎవరుంటారు? పిల్లలు ఎదుగుతుండగా వారి ప్రతి కదలికనీ, ప్రతి చేష్టనీ శాశ్వతంగా రికార్డు చేసుకునే అదృష్టం కొందరికే దక్కుతుంది. ఆస్ధాన ఫోటోగ్రాఫర్ లాగా కుటుంబ ఫోటోగ్రాఫర్ అంటూ ఎవరిని పెట్టుకోలేం గనక పిల్లలకు సంబంధించిన కొన్ని కోరికలు తీరే మార్గం ఉండదు. కానీ అమ్మే ఫోటో గ్రాఫర్ అయితే? ఈ ఫోటోలు తీసింది రష్యన్ అమ్మ ఎలెనా షుమిలోవా. ఈమె ఫోటోలు తీయడం మొదలు పెట్టి సంవత్సరమే అయిందిట! కానీ…

సెల్ ఫోన్ లో ఫేస్ బుక్ తో జర జాగ్రత్త!

ఫేస్ బుక్ కూడా గూగుల్ కంపెనీ ఎత్తుగడలను అనుసరిస్తోంది. యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారుల ఎస్.ఎం.ఎస్ లను, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని రికార్డు చేసి భద్రపరచుకోడానికి తమ వినియోగదారులకు ఫేస్ బుక్ వల వేస్తోందని ప్రముఖ కంప్యూటర్ భద్రతా కంపెనీ ‘కాస్పరస్కీ’ అధినేత కాస్పరస్కీ హెచ్చరించారు. యాండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని తన అప్లికేషన్ (యాప్) ను ఫేస్ బుక్ తాజాకరించి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు వీలయిన అంశాలను చొప్పించిందని ఆయన వివరించారు.  అమెరికా…

సబ్సిడీ సిలిండర్ల పెంపు, విషం కక్కుతున్న పరిశ్రమ వర్గాలు

సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంచడం తిరోగామి చర్య అని ఫిక్కి అధ్యక్షుడు సిద్ధార్ధ్ బిర్లా జారీ చేసిన ప్రకటనలో అభివర్ణించాడు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా ఈ చర్య భారం అవుతుందని ఆయన చాలా బాధపడిపోయాడు. ఆధార్ కార్డు తో ఎల్.పి.జి సిలిండర్ కు పెట్టిన సంబంధం తెంచడం వలనా, సబ్సీడీ సిలిండర్లు పెంచడం వలనా దేశానికి ఆర్ధిక కష్టాలు పెరుగుతాయని, కోశాగార క్రమశిక్షణ (Fiscal descipline) మరియు కోశాగార సమతూకం (Fiscal balance) పాటించాల్సి ఉండగా…

కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్, తిన్నది 300 పూటలు

ఓ చైనీయుడి తెలివితేటలివి. ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ విమాన టిక్కెట్ కొని, అదే టికెట్ పైన 300 రోజులు ఫస్ట్ క్లాస్ ఉచిత భోజనం ఆరగించాడా పెద్ద మనిషి. కొన్నది ఒక్క ఫస్ట్ క్లాస్ టికెటే. కానీ ఆయన తిన్నది మాత్రం 300 భోజనాలు! అదెలాగో తెలిస్తే ఈర్ష్య కలగడం ఖాయం! ఎకానమీ క్లాస్ టికెట్ కొన్నవారికి ఉచిత భోజనం పెడతారో లేదో తెలియదు గానీ ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నవారికి మాత్రం ఒక మృష్టాన్నభోజనాన్ని…

టఫ్ గై: ఆడా మగా, ముసలి ముతక తేడాయే లేదు -ఫోటోలు

ఇంగ్లండ్ లోని పెర్టన్ లో జరిగే పోటీలివి. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పోటీ అని కూడా దీన్ని చెబుతారట. అత్యంత కఠినమైన పరీక్షల్ని పెట్టే ఈ పోటీ ప్రతి సంవత్సరం జరుపుతారని తెలుస్తోంది. చిత్రం ఏమిటంటే ప్రతేడూ వేలాది మంది ఇందులో పాల్గొనడం. ఆడా, మగా; ముసలి, ముతకా అన్న తేడా లేకుండా ఈ పోటీల్లో పాల్గొనడం నిజంగా అబ్బురమే. అబ్బురం ఎందుకో ఈ ఫోటోల్ని చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ పోటీల నుండి బైటపడ్డవారు ఖచ్చితంగా…

ప్రపంచంలో అతి పెద్ద ఒంటెల పండగ -ఫోటోలు

అతి పెద్ద ఒంటెల పండగే కాదు, అతి పెద్ద పశువుల పండగ కూడా కావచ్చిది. రాజస్ధాన్ లో కార్తీక మాసంలో పుష్కర్ సరస్సు ఒడ్డున జరిగే ఈ పండగ/సంతలో దాదాపు 2 లక్షలకు పైగా పాల్గొంటారని అంచనా. 50,000కు పైగా ఒంటెలు ఇందులో పాల్గొంటాయి. భక్తులు పౌర్ణమి సమీపించే కొందీ పుష్కర్ ను సందర్శించే యాత్రికుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. పౌర్ణమి రోజు పుష్కర్ లో స్నానం ఆచరిస్తే మంచిదని భక్తుల నమ్మిక. జనమూ, వారితో…

ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…

ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ విషయంలో తలెత్తిన విభేదాలు చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని బలిగోరే వైపు నడుస్తున్నాయా? కాంగ్రెస్ చేసిన హెచ్చరిక ఈ అనుమానం కలిగిస్తోంది. అక్రమ మాదక ద్రవ్య వ్యాపారం, వ్యభిచారం నేరాలలో సంబంధం ఉన్న ఆఫ్రికా ర్యాకెట్ పై దాడి చేయాలన్న ఎఎపి మంత్రి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదు. ఫలితంగా ఎఎపి మంత్రే స్వయంగా దాడి చేయడంతో మొదలైన రగడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బహిరంగ ఆందోళనకు దిగడం వరకు దారి…

అసమాన వ్యవస్ధలకు పునాది అసమానతల బాల్యం -ఫోటోలు

ప్రపంచ వ్యాపితంగా ఏ దేశం చూసినా అసమానతలతో నిండి ఉన్నదే. బాల్యం నుండే అసమానతలను సహజ న్యాయంగా చూపించే వ్యవస్ధలో, మతంలో, నమ్మకాల్లో ఆ అసమానతల్ని రూపుమాపే బదులు న్యాయబద్ధం చేసే సూత్రాలకు కొదవ లేదు. ప్రపంచంలో ఏ మూల చూసినా ఇదే పరిస్ధితి. కొందరు నోట్లో బంగారు స్పూన్ తో పుడితే అనేకమందిని కటిక నేల ఆదరించి సాకుతుంది. ఈ ఫోటోలు చేప్పేదీ అదే.

సునందది ఆకస్మిక, అసహజ మరణం -ఎఐఐఎంఎస్

కేంద్ర మంత్రి శశి ధరూర్ భార్య సునంద పుష్కర్ మరణం “ఆకస్మికం, అసహజం” అని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు చెప్పారు. విష ప్రయోగం జరగలేదని నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు జరుపుతామని తెలిపారు. శరీరంపై గాయాలున్నాయని తెలిపారు. ఢిల్లీలో ప్రఖ్యాతి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్ధ డాక్టర్లు ఈ విషయాలు తెలిపారు. డాక్టర్ల నిర్ధారణలతో హత్య అన్న అనుమానాలు తలెత్తాయి. సునంద పుష్కర్ శరీరంపై గాయాలున్నాయని డాక్టర్లు చెప్పడాన్ని బట్టి ఆమెపై దాడి…

శశిధరూర్ భార్య సునంద ఆత్మహత్య?!

కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ తమ హోటల్ గదిలో చనిపోయి కనిపించారు. ఎఐసిసి సమావేశాలకు హాజరయిన శశి ధరూర్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హోటల్ కి వచ్చారని హోటల్ సిబ్బందిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. కానీ శశిధరూర్ తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదని, హోటల్ సిబ్బంది తమ వద్ద ఉన్న మాస్టర్ కార్డ్ తో తెరిచి చూడగా సునంద పుష్కర్ చనిపోయి కనిపించారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. తమ సమాచారానికి ఆధారం…

దేవయాని: అమెరికా ఆఫర్ తిరస్కరించిన ఇండియా

దేవయాని విషయంలో చివరి క్షణాల్లో అమెరికా ఇవ్వజూపిన ఒక ఆఫర్ ను భారత ప్రభుత్వం తిరస్కరించిన సంగతి వెల్లడి అయింది. దేవయానిపై మోపిన నేరారోపణల తీవ్రతను తగ్గించి నమోదు చేస్తామని, అందుకు సహకరించాలని అమెరికా అధికారులు కోరారు. అయితే తగ్గించిన ఆరోపణలు కూడా క్రిమినల్ ఆరోపణలే కావడంతో అందుకు భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలను పూర్తిగా రద్దు చేయడం తప్ప మరో పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని ఇండియా స్పష్టం చేయడంతో అమెరికా తాను అనుకున్న పని…

మంచుతో శిల్పాలు చెక్కినారు…

మనిషి సృజనాత్మకతకు అవధుల్లేవు అనడానికి ఈ మంచు శిల్పాలు ఒక సూచిక. శిల్పాల సంగతి అటుంచి చైనాలో మంచుతో ఏకంగా భవనాలే నిర్మించడం ఫొటోల్లో చూడొచ్చు. ఉత్తరార్ధ గోళంలో ఉన్న దేశాల ప్రజలకే ఈ మంచు శిల్పాలు చెక్కే అవకాశం వస్తుందనుకుంటాను. అంటార్కిటికాకు దగ్గర్లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కూడా శిల్పాలు చెక్కే మంచు అందుబాటులో ఉంటుందేమో. బిగ్ బెన్ గడియారం దగ్గర్నుండి వివిధ జంతువులు, వివిధ మైధాలజీల పాత్రలు, టైటానిక్ పడవలాంటి ఘటనల వరకూ భారీ…