ఈ హిందూత్వ అభిమాని బూతు కూతలు చూడండి!

ఈ వ్యక్తి పేరును ఉటంకించే ధైర్యం నేను చేయలేకున్నాను. ఆ పేరు నిజానికి హిందూ ప్రజలు ఇష్టంతో కొలుచుకునే దైవం పేరు. కానీ ఈయనగారి బూతు పాండిత్యం చూస్తేనేమో హిందూ భక్తులకు తధ్యంగా అసహ్యం వేస్తుంది. మరీ ముఖ్యంగా హిందూ సంస్కృతి గొప్పదనం గురించి, సుప్రిమసీ గురించి వివరించే వ్యాసాలకూ, వీడియోలకూ ఎక్కడెక్కడ నుండో లింకులు తెచ్చే పోస్ట్ చేసే సంస్కృతీ పరిరక్షకుడు తాను రక్షిస్తానని చెప్పే సంస్కృతిని పీక నులిమి చంపడానికి ఏ మాత్రం వెనుదీయని…

హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్

బి.జె.పి మొదటిసారి సొంతగా మెజారిటీ సాధించిన నేపధ్యంలో ఆ పార్టీ మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ ఆశలు మోసులెత్తుతున్నాయి. హిందూత్వ డిమాండ్లను మోడి నెరవేర్చాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. బి.జె.పి మేనిఫెస్టోలో సాంస్కృతిక విభాగంలోకి నెట్టివేశామని ఎన్నికలకు ముందు చెప్పిన హిందూత్వ డిమాండ్లు ఇప్పుడు కేంద్ర స్ధానానికి తెచ్చే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్ ఉన్నదని సంస్ధ సిద్ధాంత కర్త ఎం.జి.వైద్య మాటల ద్వారా అర్ధం అవుతోంది. “అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు……

భారత ఇస్లాంను దురాక్రమిస్తున్న వహాబీయిజం

భారత ముస్లిం మత వ్యవస్ధ క్రమంగా వహాబీయిజం చేతుల్లోకి వెళ్తోందని, దీనిని అరికట్టకపోతే విపరిణామాలు తప్పవని ముస్లిం పెద్దలు స్పష్టం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వచ్చిన భారత ఇస్లాం ను వహాబీయిజం దురాక్రమిస్తోందని, తద్వారా విద్వేష బీజాలు నాటుతూ ఉగ్రవాద భావాలను పెంపొందిస్తున్నదని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సూఫీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియా పెంచి పోషిస్తున్న వహాబీ ముస్లిం టెర్రరిజం ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో విధ్వంసం…

ఉల్టా పల్టా: జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి -ఫోటోలు

‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అన్నారు పెద్దలు. ఆ పెద్దల భవిష్యద్దర్శనం ఎంత దూరం సాగిందో తెలియదు గానీ, ఈ ఫొటోల్లో కనపడుతున్నంత దూరం మాత్రం సాగి ఉండదని నిస్సందేహంగా చెప్పవచ్చనుకుంటాను. ఎంతో ఖర్చు పెట్టి ప్రఖ్యాత ఆర్కిటెక్చర్లను నియమించుకుని మరీ కట్టుకున్న ఇళ్ళు ఇలా తిరగేసి ఉంటాయని ఊహించగలమా? పోనీ ఒక దేశంలో ఒకరిద్దరికి పుట్టిన ఆలోచనా ఇది అంటే, కానే కాదు. కనీసం నాలుగు దేశాల్లో కట్టిన ఇళ్ళు మనం ఇక్కడ చూడవచ్చు. చైనా,…

తుపాకి పేల్చిన తూనీగలున్నయట… -వీడియో

‘అర్ధరాత్రి స్వతంత్రం’ అని ఒక సినిమా ఉంది. ఆర్.నారాయణ మూర్తి తీసిన మొదటి సినిమా ఇది. విశాఖకు చెందిన పాటల రచయిత వంగపండు ప్రసాద్ రాసి, స్వయంగా పాడిన పాట ఒకటి ఈ సినిమాలో చిత్రీకరించారు. అద్భుతమైన పాట అది. సామాన్యులే చరిత్ర నిర్మాతలనీ ఆ పాట పరోక్షంగా చెబుతుంది. ఆ పాట వింటుంటే రోమాలు నిక్క బొడుచుకుని ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకుని వస్తుంది. కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి మీరూ వినండి.  ఏం పిల్లడో…

నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో పోటీలు –దృశ్య కధలు

సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొందీ, అది మరింతగా ప్రజల చేతుల్లో కుప్పబడే కొద్దీ వార్తల నివేదనలోనూ కొత్త పోకడలు పొడసూపుతున్నాయి. అటువంటి కొత్త పోకడల్లో ఫోటో స్టోరీ ఒకటి. ఒకే ఒక ఫోటోలో ఒక వార్తమొత్తం చెప్పగలగడం ఒక ధోరణి అయితే, కొన్ని ఫోటోలను కలిపి ఒక వార్తా కధనం చూపడం మరొక ధోరణి. అనేక మాటలు చెప్పలేనిది ఒక్క ఫోటో చెబుతుంది అని వార్తా పండితులు చెప్పడం తెలిసిందే కదా! ఛందోబద్ధ కవిత్వం ఒక్క భాషా…

అందాల ఆకాశ రాజ్యం లెసోతో -ఫోటోలు

మనకి అరకు, ఊటీ లాంటి ఎత్తైన ప్రాంతాలు విహార స్ధలాలు. సముద్ర మట్టానికి ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత పడిపోతుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరం పొడవునా చల్లటి వాతావరణం జనాన్ని సేదతీరుస్తుంది. కానీ దేశం దేశమే కొండలపైన ఉంటే? ఇక ఆ దేశం అంతా అందమైన ప్రకృతి దృశ్యాలతో అలరారుతుంది. అలాంటి దేశం ఆఫ్రికా లోని లెసోతో. ప్రతి దేశానికి దిక్కులుంటాయి. అనగా ఉత్తరాన ఫలానా, దక్షిణాన ఫలానా… ఇలా. కానీ లెసోతో ఒక విధంగా దిక్కులు…

గృహిణి హత్యకు దారితీసిన ఫేస్ బుక్ స్నేహం

ఎలా అర్ధం చేసుకోవాలో, ఎవరిని తప్పు పట్టాలో తెలియని వికృత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేస్ బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్లు సృష్టిస్తున్న సామాజిక సంక్షోభం అంతా ఇంతా కాదు. వయసు లేదు, విలువ లేదు, పద్ధతి లేదు, ఎవల్యూషన్ అసలే లేదు. పరిచయం చూస్తేనేమో ఫేస్ బుక్ లాంటి వర్చువల్ ప్రపంచంలో. దాని వాస్తవ పరిణామాలేమో నిజ ప్రపంచం పైన! 43 సంవత్సరాల ఒక గృహిణి 22 సంవత్సరాల యువకుడితో (సోకాల్డ్) ప్రేమలో పడిపోయింది.…

జాబ్: డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్; జీతం: సున్న -వీడియో

ఉద్యోగం పేరు చూస్తేనేమో గొప్ప పేరు: డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్. జీతం ఎంత అంటే ఏమీ ఇవ్వం అంటున్నారు. పైగా 24 గంటలు పని చేయాలిట. ఇంటర్-పర్సనల్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా ఉండాలిట. అలా ఎలా చేస్తారంటే అనేకమంది చేస్తున్నారని చెబుతున్నాడీ పెద్ద మనిషి. ఇంతకీ అంత నిస్వార్ధంగా అంత పెద్ద బాధ్యత నిర్వహిస్తున్నది ఎవరు? వీడియో చూసి తెలుసుకోవాల్సిందే.

చలి నీళ్ళకు పిల్లలు తట్టుకోలేరనుకున్నా -ద.కొరియా నౌక కెప్టెన్

నౌక ఖాళీ చేయమని ఆదేశాలిస్తే పిల్లలు అంత చలిలో చల్లటి నీళ్ళకు తట్టుకోలేక చనిపోతారని భావించానని దక్షిణ కొరియాలో ప్రమాదానికి గురయిన ‘సెవొల్’ కెప్టెన్ కోర్టుకు తెలిపాడు. అందుకే వారిని వెంటనే పడవ ఖాళీ చేయాలని ఆదేశాలివ్వడానికి తటపటాయించానని కెప్టెన్ లీ జూన్-సియోక్ చెప్పారు. పడవ ఖాళీ చేయాలని కోరడంలో 40 ని.లు ఆలస్యం కావడంతో ఎక్కువమంది తప్పించుకోలేక నౌకలోనే చిక్కుకుపోయారు. 32 మంది మరణాలను దక్షిణ కొరియా ప్రభుత్వం ధృవీకరించగా ఇంకా 273 మంది జాడ…

ఢిల్లీ మెట్రోల్లో మహిళా జేబుదొంగలే ఎక్కువ

ఢిల్లీ నమోదు చేసిన విచిత్రం ఇది. ఢిల్లీ మెట్రో రైళ్లలో గత నెలలో 27 మంది జేబు దొంగలని అరెస్టు చేయగా వారిలో 26 మంది మహిళలే. ఈ నేపధ్యంలో మహిళా జేబు దొంగల సంఖ్య బాగా పెరుగుతోందని ఢిల్లీ పోలీసులు మొత్తుకుంటున్నారు. గతేడు 400 పిక్ పాకెట్ కేసుల్ని ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. అందులో 90 శాతం వరకూ మహిళలే ముద్దాయిలుగా దొరికిపోయారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. వీళ్ళెవరూ సంఘటిత గ్యాంగులకు చెందిన వారు…

భాషేదైనా కానీ ఈ బుజ్జిదాని పాట చూడాల్సిందే -వీడియో

‘సంగీతానికి ఎల్లలు లేవు’ అని సంగీతం గురించి తెలిసినవారు, తెలియని వారు కూడా తరచుగా చెప్పే మాట! ఎల్లలు అంటే ఏ ఎల్లలో తెలియదు గానీ భాషా పరమైన ఎల్లలు కూడా లేవని ఈ వీడియో చూస్తే (వింటే) వచ్చే ఆనందం ద్వారా మన అనుభవంలోకి వస్తుంది. – ఈ కొరియా పాప (లేకపోతే చైనీస్ పాపో, జపనీస్ పాపో అయినా అయి ఉండవచ్చు) పాడింది ఒక్క నిమిషం మాత్రమే. ఆల్రెడీ రికార్డ్ చేసిన పాటకు నటించిందా…

దశాబ్దాల భారతీయ శ్రమ కుప్పపోస్తే, లండన్! -ఫోటోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా బ్రిటన్ కి పేరు. మొట్ట మొదటి పౌర హక్కుల పత్రం ‘మాగ్న కార్టా’ కు ప్రాణం పోసింది బ్రిటిష్ పెట్టుబడిదారులే. రాచరికం నుండి హక్కుల కోసం పోరాడిన బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గం అనతికాలంలోనే ప్రపంచం లోని అనేక ఖండాంతర దేశాలకు బయలెల్లి అక్కడి ప్రజలకు హక్కులు లేకుండా చేశారు. బ్రిటిష్ వలస పాలకులు భారత దేశం లాంటి సంపన్న వనరులున్న దేశాలను దురాక్రమించి వలసలుగా మార్చుకుని ఒకటిన్నర శతాబ్దాల పాటు అక్కడి…

శక్తి మిల్స్ అత్యాచారం నిర్భయ ఘటనకు తీసిపోదు -కోర్టు

ముంబై లోని శక్తి మిల్స్ అత్యాచారం ఘటన ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనకు ఏ మాత్రం తీసిపోనిదని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శాలిని ఫన్సల్కర్ తన తీర్పులో వ్యాఖ్యానించారు. నిర్భయ ప్రాణం కోల్పోవలసి రాగా ముంబై బాధితురాలు తట్టుకుని నిలబడ్డారని ఆమె ఇచ్చిన సాక్ష్యం కేసుకు అత్యంత బలమైన మూలాధారం అనీ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలితో పాటు ఆమెతో వెళ్ళిన ఆమె స్నేహితుడు కూడా చివరి వరకూ నిలబడి పోరాడిన తీరు అభినందనీయం అని…

పెళ్ళి ఫార్మాలిటీ మాత్రమే -మోడి సోదరుడు

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వివాహ ప్రకటన రాజకీయ దుమారం వైపుకి ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నాయి. మోడి వివాహం చర్చ అయ్యే కొద్దీ రాహుల్ అవివాహం కూడా చర్చలోకి ఈడ్వబడొచ్చు. వివిధ పార్టీల అభ్యర్ధుల పాలనా సామర్ధ్యం, గుణగణాలు, ప్రజా పక్షపాతం లాంటి లక్షణాలు కాకుండా పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడమే ఎన్నికల ప్రచారంలో ప్రధాన ధోరణి అయ్యాక ఏమైనా జరగొచ్చు. కాగా మోడి వైవాహిక జీవితాన్ని సమర్ధిస్తూ ఆయన సోదరుడు పత్రికలకు ఎక్కడం తాజా పరిణామం. తనకు…