498A: దుష్ప్రచారం మాని పకడ్బందీగా అమలు చేయాలి

-రచన: రమా సుందరి (ఉపాధ్యక్షురాలు, ప్రగతిశీల మహిళా సంఘం, ఆంధ్ర ప్రదేశ్) భారతదేశ న్యాయం ఎప్పుడూ ఆధిపత్య వర్గాల వైవునే నిల్చోని ఉంటుంది. అందులో కూడా పురుషుల పక్షమే వహిస్తుంది. బలహీన వర్గాలు అయిన దళితులు, స్త్రీల పట్ల శీతకన్ను వేసి ఉంచటమే కాదు, అవసరమైనపుడు వారి వ్యతిరేకవర్గంలో తన స్థానాన్ని నిరభ్యరంతంగా ఖాయం చేసుకొంటుంది. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన వర్గ, కుల, లింగ సమానత్వాన్ని నామకా అయినా పాటించాలనే మొహమాటాన్ని కూడా నిస్సంకోచంగా వదిలేస్తుంది.…

ప్రశ్న: సుఖ శాంతులున్న తావు భూమిపై ఉందా?

ఎస్ రామ కృష్ణ రావు Dear Sekhar, I regularly follow your Q&A section in the teluguvartalu website. I have one question in this context. We know that every where on this world people are suffering with some problems (may be financial/political/lack of food  … and many more). I was wondering is there any place on the…

రాజకీయార్ధిక కోణంలో సమాజ విశ్లేషణ -ఈనాడు

ఈ రోజు నుండి ఈనాడు పత్రికలో ‘పొలిటికల్ ఎకానమీ’ కోణంలో సమాజాన్ని అర్ధం చేసుకోవడం ఎలా అన్న అంశంపై వ్యాసావళి ప్రారంభించాను. సమాజాన్ని, అందులో పరస్పర సంబంధంతో కలగలిసిపోయి ఉండే వివిధ అంశాలను వివిధ శాస్త్రాలుగా విడగొట్టుకుని చదువుకుంటున్నాం గానీ సామాజిక ఆచరణలో అవన్నీ ఒకటే. సామాజిక జీవనంలో రాజకీయార్ధిక కోణం అత్యంత ముఖ్యమైనది. సామాజిక జీవనానికి అదే పునాది కూడా. దీన్ని సరళంగా అర్ధం చేసుకోగలిగితే ఒక తాత్విక దృక్పధాన్ని అలవారుచుకోవడం తేలిక అవుతుంది. ఉన్నత…

నీగ్రోను చంపిన పోలీసులు, అట్టుడికిన అమెరికా -ఫోటోలు

సివిల్ పోలీసులకు మిలట్రీ ఆయుధాలను సరఫరా చేస్తే ఏమవుతుందో అమెరికాలో అదే జరుగుతోంది. రెండున్నర సంవత్సరాల క్రితం ట్రేవాన్ మార్టిన్ అనే 17 సం.ల నీగ్రో యువకుడిని ఒట్టి పుణ్యానికి కాల్చి చంపిన ఉదంతం మరువక ముందే మరో నీగ్రో యువకుడిని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. ఈసారి కూడా తెల్లజాతి పోలీసే హత్యకు పాల్పడ్డాడు. రోడ్డు మధ్యలో కాకుండా పక్కన నడవాలని ఆదేశించిన పోలీసుల ఆజ్ఞను త్వరగా అమలు చేయకపోవడమే ఆ యువకుడు చేసిన నేరం.…

మూజువాణి: తెలంగాణ మాదిరిగానే జ్యుడీషియల్ బిల్లు కూడా

సుప్రీం కోర్టు, హై కోర్టులకు జడ్జిల నియామకంలో పార్లమెంటుకు కూడా అధికారాలు కట్టబెట్టడానికి ఉద్దేశించిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. 121వ రాజ్యాంగ సవరణ, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ ఏర్పాటు లను అమలులోకి తెచ్చే బిల్లు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందడం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. తెలంగాణ బిల్లును ఆనాటి లోక్ సభ, రాజ్య సభలు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందినపుడు అనేకమంది రాజకీయవేత్తలు, ఎ.పి.ఎన్.జి.ఓ లాంటి ఆందోళన సంస్ధలు,…

అమిత్ షా: కమల దళాలే ఆక్టోపస్ చేతులవ్వాలి -కార్టూన్

బి.జె.పి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన అమిత్ షా భారత దేశం కోసం తాను కంటున్న కలలేమిటో వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి అమిత్ షాకు అప్పగించడానికి బి.జె.పి కార్యర్గం లాంఛన ప్రాయంగా ఆమోద ముద్ర వేసిన అనంతరం ఆయన బి.జె.పి జాతీయ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్రసంగించారు. సదరు ప్రసంగంలో తన ఉద్దేశ్యాలేమిటో శాంపిల్ గా వివరించారాయన. ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఐడియాలజీ ఒక్కటే దేశాన్ని శాసించిందని ఇక నుండి కాంగ్రెస్ ఐడియాలజీని పక్కకు నెట్టి కేవలం బి.జె.పి…

స్టేటస్ కో కోసమే జ్యుడీషియల్ కమిషన్ బిల్లు

సుప్రీం కోర్టు, హై కోర్టుల జడ్జిల నియామకాలకు సంబంధించి యు.పి.ఏ చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించేవైపుగా పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టులకు, హై కోర్టులకు జడ్జిలను నియమించే అధికారం ప్రస్తుతం పూర్తిగా సుప్రీం చేతుల్లో లేదా న్యాయ వ్యవస్ధ చేతుల్లో ఉంది. దీనిని మార్చేవైపుగా ఎన్.డి.ఏ ప్రభుత్వం నూతన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ఈ రోజు ప్రవేశపెట్టింది. ఫలితంగా యు.పి.ఏ పదేళ్ళలో చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించనుంది. నూతన ఆర్ధిక విధానాలలో భాగంగానూ, ప్రపంచ…

ఎనలైజ్: వ్యవసాయ సబ్సిడీలు ఎందుకివ్వాలి? -ఈనాడు

‘అధ్యయనం’ ధారావాహికలో ఆరవ భాగం నేటి ఈనాడు పత్రికలో ప్రచురితమయింది. గత వారం ‘ఎనలైజ్’ అనే డైరెక్టివ్ గురించి వివరించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఓ ఉదాహరణ తీసుకుని ఈ వారం వివరించాను. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి గత సంవత్సరం జనరల్ స్టడీస్ పేపర్ లో ఇచ్చిన ప్రశ్నను ఉదాహరణగా తీసుకున్నాను. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్ లో చూడాలనుకుంటే కింది లంకె పైన క్లిక్ చేసి చూడగలరు. ఈ లంకే…

రిలయన్స్ చేతిలో ఐ.బి.ఎన్ ఛానెళ్లు, ఎడిటర్ల రాజీనామా

నెట్ వర్క్ 18 మీడియా గ్రూపుకు చెందిన మీడియా ఛానెళ్లు రిలయన్స్ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ గ్రూపులోని వివిధ ఛానెళ్ల ఎడిటర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. రిలయన్స్ యాజమాన్యం ఎడిటోరియల్ విధానంలోనూ, న్యూస్ కవరేజీ లోనూ జోక్యం చేసుకోవడం పెరగడంతో తాను రాజీనామా చేయక తప్పలేదని ఒక ఎడిటర్ చెప్పగా అదే విషయాన్ని మరో ఎడిటర్ పరోక్షంగా సూచించారు. భారత చట్టాలను ఎగవేస్తూ ప్రభుత్వం విధించే కోట్ల రూపాయల అపరాధ రుసుములను ఎగవేయడంలోనూ అగ్రభాగాన ఉన్న…

యు.పి.ఎస్.సి: భాష రాజకీయాల జీనీ వదిలారా? -కార్టూన్

సివిల్స్ పరీక్షల్లో మూడేళ్ళ క్రితం ప్రవేశపెట్టిన CSAT (Civil Services Aptitude Test) ప్రశ్న పత్రంపై మరోసారి రగడ రేగింది. హిందీ ప్రాంతాల వాళ్ళు ప్రధానంగా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. ఆంగ్లేతర మాధ్యమాలలో పరీక్ష రాసేవారికి వ్యతిరేకంగా కుట్ర చేశారని, గ్రామీణ నేపధ్యం ఉన్న వాళ్ళను ఉన్నత స్ధాయిలకు రాకుండా అడ్డుకునేందుకే ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షించే భాగాన్ని ప్రవేశపెట్టారని వారు విమర్శిస్తున్నారు. త్వరలో జరగబోయే సివిల్స్ పరీక్షలను వాయిదా వేసి తమ సమస్యలను పరిష్కరించాలని…

బస్సు డోర్ లాక్ అయిపోయి రాలేదు…

(ఇది తులసి గారు తన వ్యాఖ్య ద్వారా ఇచ్చిన సమాచారం. -విశేఖర్) బస్సు పట్టాలపైకి వచ్చి నాలుగు నిమిషాలు ఆగిపోయింది. ఆ నాలుగు నిమిషాల్లో పిల్లల్ని కాపాడేందుకు డ్రైవర్, క్లీనర్ ప్రయత్నం చేశారు. ఘటన జరిగింది ఉదయం కాబట్టి రైల్వే క్రాసింగ్ వద్ద ఎవరూ లేరు. అందుకే కొత్తవాడైన డ్రైవర్ భిక్షపతి స్కూల్ కరస్పాండెంట్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ చెయ్యడమెందుకు త్వరగా పిల్లల్ని దించివేయవచ్చు కదా అను అనుమానం కలుగుతుంది. అయితే ఆ సమయంలో బస్ డోర్…

బస్సు కండిషన్ దాచి డ్రైవర్ పైకి నెట్టేశారు -ఎబిఎన్

తెలంగాణలో మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అందరూ నిర్ధారించారు. అది వాస్తవం కాదని కండిషన్ లో లేని బస్సును పక్కనబెట్టకుండా తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందని స్కూలు పిల్లలను ఉటంకిస్తూ ఎ.బి.ఎన్ ఛానెల్ తెలిపింది. ఈ విషయం అధికారులకు తెలిసినా డ్రైవర్ పైకి తప్పు నెట్టేసి స్కూలు యాజమాన్యాన్ని కాపాడుతున్నారని తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతున్నారని, రైలు వస్తున్న సంగతి…

చందమామ అందిన ఆ రోజులు… -ఫోటోలు

పాటల్లో పాడుకోవడమే తప్ప నిజంగా చందమామను అందుకోగలమని మనిషి అప్పటివరకూ ఊహించలేదు. ‘చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు’ అన్న పాట అమెరికన్లు చంద్రుడి మీద కాలు పెట్టకముందు వెలువడిందో తరవాత వెలువడిందో తెలియదు. ఒకవేళ ముందే ఈ పాట రాసి ఉన్నట్లయితే ‘మనవాళ్లు ముందే చెప్పారు’ అని గర్వంగా చెప్పుకోవచ్చునేమో! పసి పిల్లల్ని మాయపుచ్చి జోకొట్టడానికి అద్దం చూపి చంద్రుడిని కిందికి దింపిన తల్లులు మనిషే ఎగిరి వెళ్ళి చంద్రుడిని అందుకున్నాడని తెలిసి ఎలా…

మేము ఈల వేస్తే…. -కార్టూన్

అదేదో సినిమాలో తాను ఈల వేస్తే గోల్కండ కోట ఎగిరి పడుద్ది అని పాడతాడు. ఆయన సంగతేమో గానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అది కూడా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు రాజకీయ పెద్దల అవినీతి, అవకతవకల గురించి ఈల వేయడం మొదలు పెడితే జనానికి తెలియని చాలా అఘాయిత్యాలు బైటికి వస్తాయి. ఒక సంస్ధలో పని చేస్తూ, ఆ సంస్ధలో జరిగే అక్రమాలను బైటికి, రహస్యంగా గానీ బహిరంగంగా గానీ, చెబితే దానిని ఆంగ్లంలో విజిల్ బ్లోయింగ్…

2013లో రేపిస్టుల్లో 95 శాతం బాధితులకు తెలిసినవారే

ప్రతి 100 మంది రేపిస్టుల్లో 95 మంది బాధితులకు తెలిసినవారేనని జాతీయ నేర నమోదు సంస్ధ (National Crime Record Bureau -NCRB) తెలిపింది. ‘2013లో భారత దేశంలో నేరాలు’ పేరుతో ఎన్‌సి‌ఆర్‌బి నివేదికను విడుదల చేసింది. నివేదికలో మహిళలపై నేరాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను పొందుపరిచింది. నివేదిక ప్రకారం అత్యాచార నేరాలకు సంబంధించి ఐ.పి.సి సెక్షన్ 376 కింద 2013 సంవత్సరంలో దేశవ్యాపితంగా 33,707 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 31,807 కేసుల్లో నిందితులందరూ బాధితులకు…