పేద గొప్ప తేడాలెరగని నిద్ర -ఫోటోలు

ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అంటారు. సుఖం మాట ఎలా ఉన్నా నిద్రాదేవికి పేద గొప్ప తేడాలతో పని లేని మాట నిజం. ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని ఆదరించి జోకొట్టే సుగుణవతి నిద్రాదేవి. ఆ మాటకొస్తే సృష్టిలో నిద్రపోని జీవి అంటూ లేదు. అలసి సొలసిన శరీరాలను తన ఒడిలో చేర్చుకుని, సేదదీర్చి, తిరిగి నూతన జవసత్వాలను నింపే నిద్రమాత ప్రసన్నం కోసం మనిషి ‘నిద్ర మాత్ర’ ను కూడా కనిపెట్టాడు. నిద్ర…

కులాలవారి శ్మశానవాటికలు కోర్టుకు కొత్తేనట!

“ఇటా…, అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు…” అని ‘శ్మశాన వాటి’ కావ్యంలో గుర్రం జాషువా గారు ప్రస్తావిస్తారు. జాషువా జీవించినప్పటి పరిస్ధితి ఏమిటో గానీ ఇప్పుడైతే ఈ పరిశీలనలో వాస్తవం లేదు. దాదాపు ప్రతి ఊరిలోనూ కులాల వారీగా (బ్రాడ్ గా) శ్మశాన వాటికలు ఇప్పటికీ ఉన్నాయి. అగ్ర కులాలకు ఉమ్మడి ఒక శ్మశాన వాటిక ఉండవచ్చునేమో గానీ నిమ్న కులాలకు మాత్రం అందులో ప్రవేశం ఉండదు. రాజస్ధాన్ లో ఇలాంటి విషయం ఒకటి కోర్టు దృష్టికి…

(మత) ఆకర్షక రాజకీయాలు -ది హిందు ఎడిటోరియల్

ముంచుకొచ్చే ఎన్నికలు, ప్రభుత్వాల చర్యలకు అనివార్యంగా రంగు పులుముతాయి. ఉత్తర ప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్ధానాలకు, ఒక పార్లమెంటరీ స్ధానానికి ఉప ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పై విద్వేష ప్రసంగం చేసినందుకు అభియోగ పత్రం నమోదు చేయడానికి తీసుకున్న నిర్ణయం రాజకీయ లక్ష్యంతోనే జరిగిందా అన్నది చర్చనీయమైన ప్రశ్న. అమిత్ షా పై దాఖలు చేసిన ఛార్జీ షీటును కోర్టు పోలీసులకు వెనక్కి…

శ్వేతాబసు మీ సాఫ్ట్ టార్గెట్! -సాక్షి తన్వర్ బహిరంగ లేఖ

(కొద్ది రోజుల క్రితం పత్రికలు, ఛానెళ్లు ఓ వార్తను సంచలనం చేస్తూ ప్రచురించాయి. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ సినీ నటి శ్వేతా బసు పట్టుబడిందని ఆ వార్త సారాంశం. ఈ వార్త ప్రచురిస్తూ కొన్ని పత్రికలు అదేదో భ్రహ్మాండమైన నేరాన్ని వెలికి తీసినట్లు ఫోజు పెట్టాయి. సంవత్సరాల తరబడి భద్రతా వ్యవస్ధలకు అంతు చిక్కని నేర పరిశోధన తామే చేసినట్లు బిల్డప్ ఇచ్చాయి. ఈమె పైన గతంలో ఆరోపణలు వచ్చినా ఆమె ఖండించారని…

ఐరోపా దేశ ద్రిమ్మరుల పండుగ వర్జిన్ మేరీస్ డే -ఫోటోలు

జిప్సీలు అన్న పేరు మనం తరచుగా వినం గానీ ఐరోపా దేశాల్లో ఇది చిరపరితం. వారిని ‘రోమా’లు అని కూడా పిలుస్తారు. ఐరోపా సంపన్న దేశాలు వారి పట్ల చాలా క్రూరంగా, అవమానకరంగా వ్యవహరిస్తాయి. జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు మరింత ఘోరంగా వ్యవహరిస్తాయి. రెండేళ్ల క్రితం అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ రోమాలకు వ్యతిరేకంగా ఒక విధాన నిర్ణయం తీసుకుని వారిని దేశం నుండి తరిమి తరిమి వేధించాడు. వాళ్ళు అందించే చౌక శ్రమతో సిరులు…

హై అలర్ట్: ఆల్-ఖైదాకు వ్యతిరేకం కాదు అనుకూలం -నిపుణులు

ఆల్-ఖైదా నేతగా చెబుతున్న అయిమన్ ఆల్-జవహిరి వీడియో వెలువడిన వెంటనే కేంద్ర హోమ్ శాఖ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. హోమ్ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్ధితిని సమీక్షించి, భద్రతా సంస్ధలకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యను నిపుణులు విమర్శిస్తున్నారు. ‘హై అలర్ట్’ అంటూ ప్రకటించిన అప్రమత్తత చివరికి మైనారిటీ ప్రజలను పోలీసులు, ఇతర బలగాలు వేధింపులకు గురిచేసి భారత ప్రధాన స్రవంతి నుండి దూరం చేసేందుకే దోహదం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.…

బాలికపై శివసేన నేత అత్యాచారం!

భారత దేశంలో గొప్ప హిందూ సంస్కృతి అలరారుతోందని చెప్పుకునే హిందూ సంస్కృతీ పరిరక్షకులకు దేశంలో కొదవలేదు. వాస్తవంలో దేశ రాజధాని ‘రేప్ కేపిటల్’ గా పేరు తెచ్చుకోగా, తమను తాము సంస్కృతీ పరిరక్షక చాంపియన్లుగా ప్రమోట్ చేసుకుంటూ సమాజంపై అడ్డదిడ్డమైన దాడులకు పాల్పడే స్వయం ప్రకటిత సైనికులకు దేశ వాణిజ్య రాజధాని ముంబై అడ్డాగా మారింది. అదిగో అలాంటి సైనికుల నాయకుడొకరు సిగ్గు విడిచి, అతి నీచ కీచక పర్వానికి దిగడంతో అభం శుభం తెలియని ఓ…

అంధులకు చెవులతో లోకాన్ని చూపుతున్న వి.టి.ఇ

‘సిరి వెన్నెల’ సినిమా చూసారా? అందులో పుట్టుకతో కళ్లులేని ఒక పాపకు కళ్ళులేని మరో యువకుడు (హీరో) తన పిల్లన గ్రోవి ద్వారా ‘బృందావనం’ ను దర్శింపజేస్తాడు. అనగా శబ్ద జ్ఞానం ద్వారా ఒక సుందర దృశ్య రూపాన్ని పాప మనసు చూసేలా చేస్తాడు. ఇటీవల, బహుశా ఓ పదేళ్ళ క్రితం ‘పెళ్లి పందిరి’ పేరుతో మరో సినిమా వచ్చింది. అందులో హీరో గారు కళ్ళు లేని హీరోయిన్ తో తన కళ్ళతోనే లోకాన్ని చూడమని చెబుతూ…

వినూత్న కళా ప్రదర్శన ‘బర్నింగ్ మేన్’ -ఫోటోలు

అమెరికా ఎడారి రాష్ట్రం నెవాడాలో ప్రతి సంవత్సరం ఓ వినూత్న కళా ప్రదర్శన జరుగుతుంది. దీనికి ‘బర్నింగ్ మేన్ ఫెస్టివల్ అని పేరు. అమెరికా పశ్చిమ తీరానికి ఒక రాష్ట్ర వరుస దూరంలో ఉండే నెవాడా ఎడారి వాతావరణం నెలకొని ఉంటుంది. ఎల్-నినో వల్ల ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో వేడి గాలులు, తక్కువ వర్షపాతంతో కూడిన వాతావరణం ఉంటే నెవాడాలో మాత్రం వర్షాలు కురుస్తాయి. నెవాడాలోని బ్లాక్ రాక్ ఎడారిలో బర్నింగ్ మేన్ వెస్టివల్ ప్రతి యేడూ…

ప్రశ్న: తన ప్రజల్ని చల్లగా చూసుకునే దేశమే లేదా?

ఎస్. రామ కృష్ణ రావు: Thanks for publishing my question in QA and detailed analysis. Let me ask you differently. Actually my intention behind asking the question was in which country typical common people are living with more peace & happily? Is it China (as it became financially stronger) or America (good governance) or England, Singapore…

స్పెయిన్ హోళీ ‘లా టొమాటినా’ -ఫోటోలు

పండుగలు ఎలా ప్రారంభం అవుతాయో తెలియజేసే పండగ స్పెయిన్ లో ఓ పట్టణం వారు జరుపుకునే ‘లా టొమాటినా’. వివిధ సంస్కృతుల మధ్య పైకి కనిపించని ఉమ్మడి ప్రవాహం ఉంటుందని కూడా ఈ పండగ తెలియజేస్తుంది. ఇటీవలే (1945) మొదలైనందున స్పెయిన్ ‘టమోటా యుద్ధం’ పండుగ మూలం ఏమిటో స్పష్టంగా రికార్డయింది. ఆగస్టు నెలలో చివరి బుధవారం నాడు జరుపుకునే ఈ పండుగ రోజున అక్కడ చేరిన జనం ఒక గంట పాటు టమోటాలు ఒకరిపై ఒకరు…

బీహార్ బకెట్ ఛాలెంజ్: మోడికి అవమానం? -కార్టూన్

ఐస్ బకెట్ ఛాలెంజ్! ఇది గత కొద్ది వారాలుగా ప్రపంచాన్ని ఊపేస్తున్న సవాలు. ఎ.ఎల్.ఎస్ అనే మోటార్ న్యూరాన్ వ్యాధి గురించిన అవగాహన పెంచేందుకు అమెరికాలోని ఏ.ఎల్.ఎస్ అసోసియేషన్ వారు ప్రారంభించిన ఈ సవాలు ప్రపంచ వ్యాపితంగా అనేకమంది సెలబ్రిటీలను రంగంలోకి లాగుతోంది. ఏ.ఎల్.ఎస్ పూర్తి రూపం అమియోట్రోపిక్ లాటరల్ స్కెలేరోసిస్. ఇది ప్రాణాంతక వ్యాధి. లౌ గెహ్రిగ్స్ వ్యాధి అని కూడా దీనిని పిలుస్తారు. ఈ వ్యాధి సోకితే మెదడు, వెన్నుపాముల్లోని మోటార్ న్యూరాన్ కణాలు…

ప్రధాని సభల్లో కాంగ్రెస్ సి.ఎంలకు అవమానం -కార్టూన్

‘మొహం చాటేశాడు’ అంటారు. అది ఇదేనేమో! మోడి భక్తాగ్రేసరుల ఎగతాళి, వెక్కిరింపులు, కూతలు ఇతర పార్టీల నేతలకు సమస్యగా మారింది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించని నాయకుల పట్ల ఆగ్రహంతో దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఎరుగుదుము. సభల్లో తమ సమస్యలపై నాయకులను జనం నిలదీయడం ఎరుగుదుము. కానీ ప్రధాని అంతటి రాజ్యాంగ, మరియు దేశాధినేత పాల్గొన్న సభల్లో ఆయనకు మద్దతుగా ఇతర పార్టీల రాజ్యాంగ, రాష్ట్రాధినేతలను ఎగతాళి చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఒక నేతపై ఉండే…

మానవ స్వభావం అనేది ఒకటుందా?

(‘మానవ ప్రవృత్తి, ‘మానవ స్వభావం’, ‘మానవ నైజం’… ఇలాంటి పదబంధాలన్నీ ఒకే అర్ధం ఇచ్చేవి. సమాజంలో మానవ స్వభావం అనేది ఒకటుందని, దాని ప్రకారం ప్రతి మానవుడూ నడుచుకుంటారని ఈ పదాలు మనకు చెబుతాయి. ఈ అంశాన్ని చర్చించమని ఇద్దరు ముగ్గురు మిత్రులు ఈ మెయిల్ ద్వారా కోరారు. ఒకరిద్దరు నన్నే అడిగారు. ఈ అంశం పైన గతంలో ఒక ఆర్టికల్ రాశాను. పౌర హక్కుల సంఘం నేతగా ఉంటూ అనంతరం ‘మానవ హక్కుల సంఘం’ను స్ధాపించిన…

చరిత్ర పుటలు: రైట్ బ్రదర్స్ మొదటి విమానం -ఫోటోలు

గాలిలో ఎగురుతున్న పక్షులను చూసిన మనిషి తానూ అలా ఎగరాలని కలలు కన్నాడు. ఆ కలలతోనే అనేక కధలు అల్లుకున్నాడు. జానపద కధల దగ్గరి నుండి, పురాణేతిహాసాల వరకు మనిషి ఏదో విధంగా పక్షుల్లా గాలిలో ప్రయాణం చేశాడు. పక్షి మీద కూర్చొని కావచ్చు, తనకే రెక్కలు కట్టుకుని కావచ్చు లేదా తాను పక్షిలా మారి కావచ్చు… రకరకాలుగా తన ఊహలకు అందిన మేరకు ఎగిరినట్లు రాసుకుని తృప్తి పడ్డాడు. అంతటితో ఆగి ఉంటే మనిషి మనిషి…