కన్నడం మాట్లాళ్లేదని ఈశాన్యీయులను చావబాదారు

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా భారత దేశంలో జాతి విద్వేషం (రేసిజం) లేదని గర్వంగా చెబుతుంటారు. (తద్వారా జాతి విద్వేషాన్ని తలదన్నే కులవివక్ష ఉనికిని నిరాకరిస్తారు.) ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షతో పాటు భాషా వివక్ష కూడా అమలు చేయవచ్చని బెంగుళూరులోని ముగ్గురు భాషా పరిరక్షకులు చాటారు. తద్వారా జాతి వివక్షలోని ఒక వింత రూపాన్ని ఆవిష్కరించారు. మంగళవారం రాత్రి బెంగుళూరులోని ఒక హోటల్ లో జరిగిందీ ఘటన. బెంగుళూరు (నార్త్-ఈస్ట్) డి.సి.పి వికాస్ కుమార్ ప్రకారం…

నిశి రాత్రిన వెలుగు దివ్వె -ది హిందు ఎడిట్

(భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఈ యేడు నీలం రంగు లైట్ ఎమిటింగ్ డయోడ్ ను ఆవిష్కరించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. ఈ అంశంపై ది హిందూ ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం ఇది. -విశేఖర్) జపాన్ లోని నగోయా యూనివర్సిటీకి చెందిన ఇసము ఆకసాకి మరియు హిరోషి అమనో లకూ, సాంతా బార్బార లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కు చెందిన షుజీ నకమూర లకు భౌతిక శాస్త్రంలో ఇచ్చిన నోబెల్ బహుమతి వారి…

జైలా, బెయిలా? -కార్టూన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎ.ఐ.ఎ.డి.ఏం.ఎ అధినేత్రి, ప్రస్తుతం బెంగుళూరులో ఊచలు లెక్కబెడుతున్న రాజకీయ నాయకురాలు జయలలిత కేసు కొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు ముందుకు రానుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో 4 సం.ల జైలు శిక్షను సెషన్ కోర్టు విధించింది. శిక్ష రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుకు అప్పీలు చేసిన జయలలిత, అప్పీలుపై విచారణ జరిపే లోపు తనకు బెయిలు ఇవ్వాలని హై కోర్టును కోరారు. సదరు అప్పీలును హై…

జేసుదాసు గారూ, మీరు కూడానా?!

అద్భుతమైన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రాక్పశ్చిమ దేశాల శ్రోతలను అలరించిన సినీ నేపధ్య గాయకుడు కె.జె.జేసుదాసు తప్పుడు కారణాలతో పతాక శీర్షికలను ఆక్రమించారు. సో కాల్డ్ హిందూ సంస్కృతీ పరిరక్షకులు, మతోన్మాద పెత్తందార్లు, ఖాప్ పంచాయితీలు, రాజకీయ నాయకులు, పోలీసు బాసులు, బాబాలు… ఇలా అందరి వంతు అయింది, తన వంతే మిగిలింది అన్నట్లుగా జేసు దాసు గారు స్త్రీల వస్త్ర ధారణపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలకు ఆయన గాంధీ జయంతి వేడుకలను…

విశ్వనరుడి లిప్తకాల జీవనం -ఫోటోలు

‘నేను విశ్వ నరుడ్ని’ అని చాటుకున్నారు మహా కవి గుర్రం జాషువా. భారతీయ కుల వ్యవస్ధకు నిరసనగా అది ఆయన చేసిన మానవీయ ప్రకటన. ఈ విశ్వంలో నరులంతా పుట్టుకతో సమానులేననీ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ మనిషి ఏర్పరుచుకున్నదే అనీ ఆయన విశ్వసిస్తూ, కులం లేని విశ్వంలో తన చోటును వెతుక్కున్నారు. ‘డెయిలీ లైఫ్’ శీర్షికన ఫోటోగ్రాఫర్లు విశ్వ వ్యాపిత జీవన దృశ్యాలను సేకరించి ప్రచురించే ఫోటోలు గుర్రం జాషువా ప్రకటనను గుర్తుకు తెస్తాయి. ప్రపంచంలో…

తెరేష్ బాబు విభజన గీత -సంస్మరణ

కవి, తెలంగాణ రాష్ట్ర వాసి పైడి తెరేష్ బాబు గారు చనిపోయారని మిత్రుల ద్వారా తెలిసింది. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ ఉద్యమ భావజాల సంబంధం వ్యక్తిగత పరిచయాలకు అతీతమైనది. ఆ కారణం వలన ఆయనకు నాకు మధ్య భావాత్మక వారధిగా నిలిచిన ‘విభజన గీత’ను, సంస్మరణ కోసం పునర్ముద్రిస్తున్నాను. పీడిత జనం ప్రపంచంలో ఏమూల ఉన్నా వారికి కూడా తెలియని ఒక సార్వజనీన ఏకత్వం వారి మధ్య ఏర్పడిపోయి ఉంటుంది. అది ఒక్కోసారి…

ఈ పెద్దాయనను ఎలా అర్ధం చేసుకోవాలి?

పై ఫోటోలో సూటు బాబుల మధ్య వినమ్రంగా నిలబడ్డ పెద్దాయన పేరు కళ్యాణ సుందరం. ఆయన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యంతో నోట మాట రాక స్ధాణువులమై పోతాం. తన సర్వస్వం అవసరంలో ఉన్నవారి కోసం ధారపోసిన కళ్యాణ సుందరం లాంటి పెద్ద మనుషుల్ని చూస్తే మనమూ మనుషులమైనందుకు కాస్త గర్విస్తాం. ఆయనతో ఏదో విధంగా సంబంధం కలుపుకుని ఇంకా గర్వించడానికి ప్రయత్నిస్తాం. ఈయన తెలుగు వారై ఉంటే కాస్త ఎక్కువ గర్వపడదాం అనుకున్నాను. తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు…

గుజరాత్ లో మత కొట్లాటలు, 140 మంది అరెస్టు -ఫోటోలు

గుజరాత్ లో మరోసారి మత పరమైన అల్లర్లు చెలరేగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడి పోటీ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిచి, అనంతరం వదులుకున్న వదోదర నగరంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ‘వసుధైక కుటుంబం’ భారత దేశ సిద్ధాంతం అని న్యూయార్క్, వాషింగ్టన్ డి.సిలలో ప్రధాని చెప్పుకుంటున్న సమయంలోనే ఆయన పోటీ చేసిన వదోదరలో మత కొట్లాటలు చెలరేగడం గమనార్హమైన విషయం. గత గురువారం నుండి వదోదరలో అల్లర్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఫేస్…

భూమికి దూరంగా… గాలిలో తేలుతూ… -ఫోటోలు

విమానాలు సరే! ఉన్నచోటనే గాలిలో తేలిపోయే ఆటలు, ఆట వస్తువులు మనిషికి ఇప్పుడు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఆటలు, ఆట వస్తువులు ఉనికిలోకి రావడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. భారీ ఉత్పత్తులు తీయగల యంత్రాలను కనిపెట్టాక ఆర్ధిక పిరమిడ్ లో అగ్రభాగాన తిష్ట వేసిన కలిగిన వర్గాలకు తీరికే తీరిక! ఈ తీరిక సమయం క్రమంగా మానసిక జబ్బులకు దారి తీయడం మొదలైంది. ఈ ప్రమాదాన్ని తప్పించడానికి వారికి అత్యంత తీవ్ర…

న్యాయానికి సుదూర రహదారి -ది హిందు ఎడిట్

(అక్రమ ఆస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది 4 సం.ల కారాగార శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. సహ నిందితులకు 4 సం.ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఫలితంగా అవినీతి కేసులో శిక్ష పడిన మొదటి ఉన్నత స్ధాయి నేతగా జయలలిత చరిత్ర పుటలకు ఎక్కారు. అవినీతి కేసుల్లో నేతలు తప్పించుకుపోకుండా ఇటీవల చేసిన చట్టం ఫలితంగా ఎం.ఎల్.ఏ పదవి, తద్వారా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన…

అవాంఛనీయ ఉపసంహరణ -ది హిందు ఎడిటోరియల్

(లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రధాన నినాదాలు అభివృద్ధి, ఉపాధి. అధికారంలోకి వచ్చాక ఈ నినాదాలకు కట్టుబడి ఉండడానికి బదులు సరిగ్గా వ్యతిరేక చర్యలను బి.జె.పి ప్రభుత్వం తలపెడుతోంది. మిలియన్ల మంది గ్రామీణ పేదలకు కాస్తో, కూస్తో వరంగా పరిణమించిన గ్రామీణ ఉపాధి పధకంలో కోత విధించడం ద్వారా మోడి ప్రభుత్వం తన హామీని అడ్డంగా ఉల్లంఘిస్తోంది. ఈ అంశంపై ఈ రోజు హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం ఇది. -విశేఖర్) ప్రపంచంలో అతి…

మంగళయానం విజయవంతం

భారత పత్రికల ప్రకారం భారత దేశం చరిత్ర లిఖించింది. భారత ప్రధాని నరేంద్ర మోడి ప్రకారం మొట్ట మొదటి ప్రయత్నంలోనే ఒక ఉపగ్రహాన్ని అంగారకుడి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొట్ట మొదటి దేశంగా భారత దేశం చరిత్రపుటలకు ఎక్కింది. 11 నెలల క్రితం నవంబర్ 5 తేదీన పి.ఎస్.ఎల్.వి -సి25 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (MOM) అనే ఉపగ్రహం ఈ రోజు (సెప్టెంబర్ 24, 2014) విజవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది.…

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు బహిరంగ లేఖ -ది హిందూ

(బాలీవుడ్ నటి దీపికా పడుకోనె కేంద్రంగా ఆంగ్ల పత్రికల మధ్య ఒక యుద్ధం లాంటిది కొద్ది రోజులుగా నడుస్తోంది. ఎప్పుడో సంవత్సరాల క్రితం నాటి వీడియోను వెలికి తీస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఓ.ఐ) పత్రిక విలేఖరి ఒక సంచలన శీర్షిక పెట్టి ట్వీట్ చేశారు. ఇది నచ్చని దీపిక టి.ఓ.ఐ  ఘాటుగా స్పందించారు. ఆమె స్పందనతోనైనా తన తప్పు సవరించుకోని టి.ఓ.ఐ మరిన్ని దీపిక ఫోటోలను ప్రచురించి ‘నీదే తప్పు’ అన్నట్లుగా ఒక ఆర్టికల్ ప్రచురించింది.…

నిద్రాదేవి ఒడిలో… -ఫోటోలు 2

కొందరు ఎంత కోరుకున్నా నిద్ర పట్టి చావదు. కొందరు అలా కన్ను మూస్తే చాలు ఇలా గురక మొదలు పెట్టేస్తారు. మొదటి తరగతి వారు నిద్ర కోసం పరితపిస్తూ అసంతృప్తితోనే జీవితం గడిపేస్తుంటారు. ‘కష్టములెట్లున్నను’ నిద్రాదేవి ఒడిలోకి జారిపోగల అల్ప సంతృప్తిపరుల అదృష్టమే అదృష్టం. ఈ ఫోటోలు చూడండి. బస్సులో కూర్చోవడానికి సీటు దొరక్క నిలబడే ప్రయాణిస్తూ చేతులు ఎత్తి పట్టుకుని మరీ నిద్ర పోగల లావోస్ పెద్ద మనిషిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆ…

వాళ్ళు ఇండియా కోసం ఏమైనా చేస్తారు -మోడి

భారత ప్రధాని నరేంద్ర మోడి నుండి ఇంతవరకు వినని మాటలు వినబడుతున్నాయి. దాదాపు ప్రతి (భారతీయ) మతానికి చెందిన సాంప్రదాయ దుస్తులు ధరించినప్పటికీ ముస్లింల టోపీ (skull cap) ధరించడానికి మాత్రం నిర్ద్వంద్వంగా నిరాకరించిన నరేంద్ర మోడి ఈ రోజు ముస్లింల దేశభక్తిపై పొగడ్తల వర్షం కురిపించారు. “నా అవగాహన ఏమిటంటే, వాళ్ళు మన దేశ ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. భారతీయ ముస్లింలు వారి ట్యూన్ లకు నాట్యం చేస్తారని ఎవరైనా భావించినట్లయితే వారు భ్రమల్లో ఉన్నట్లే”…