కటకటాల సంత్ రాంపాల్

ఇంజనీర్ కమ్ సంత్ రాంపాల్ ఎట్టకేలకు కటకటాల వెనక్కి చేరారు. గారడీ విద్యలతో, బూటకపు శాస్త్ర పరిజ్ఞానంతో ఉత్తర, మధ్య భారతంలో అనేకమందిని తన భక్తులు/శిష్యులుగా చేసుకున్న సంత్ రాంపాల్ ను లొంగదీయడంలో పంజాబ్ & హర్యానా హై కోర్టు ఎట్టకేలకు సఫలం అయింది. 2010 నుండి కోర్టు జారీ చేసిన 43 సమన్లను లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చిన రామ్ పాల్ లోయర్ల జోలికి వెళ్లడంతో కటకటాల వెనక్కి చేరక తప్పలేదు. 2006లో…

బానిసల రాజధానిగా ఇండియా -కత్తిరింపు

భారత దేశం పెట్టుబడిదారీ వ్యవస్ధగా మారిపోతోందని కొందరు, మారిపోయిందని మరి కొందరు అనేక యేళ్లుగా వాదిస్తున్నారు. వారిలో కొన్ని విప్లవ కమ్యూనిస్టు సంస్ధలు, ఆ సంస్ధల్లోని నాయకులు కూడా ఉన్నారు. ఈ కారణం చేతనే చీలికలకు గురి గాకుండా స్ధిరంగా పని చేస్తున్నాయని భావించిన కొన్ని విప్లవ సంస్ధల్లోనూ చీలికలు తప్పలేదు. ఇటీవల మావోయిస్టు పార్టీ నుండి సవ్యచాచి పాండా లాంటివారు బైటికి వచ్చి వేరే సంస్ధను ఏర్పాటు చేస్తూ భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధ అంతరించిన…

బాబా రాంపాల్ అరెస్టుకు సాయుధ ప్రతిఘటన

దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించని నేపధ్యంలో బాబా రాంపాల్ ని అరెస్టు చేయలేక హర్యానా పోలీసులు నిస్సహాయులుగా మిగిలారు. హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న బాబా రాంపాల్ అనేకసార్లు కోర్టుకు హాజరు కాకుండా చట్టం అంటే తనకు లెక్కలేదని చాటాడు. ఆయన్ని అరెస్టు చేసి తేవాలని పంజాబ్ & హర్యానా హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆయనకు వంట్లో బాగాలేదని కాబట్టి అరెస్టు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం బట్టి భారత దేశంలో కోర్టులు ఏ…

ప్రణమీయ హితైషికి… -కవిత

(ఈ కవిత 2000 సం.లో రాసినది. నా పుట్టిన రోజు సందర్భంగా అప్పటి మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గోపీనాధ్ గారు అభినందనలు తెలియజేస్తూ ఒక గ్రీటింగ్ పంపారు. ఆయన గ్రీటింగ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కవిత రాసి పంపాను. ఆయన గొప్ప వక్త. ముఖ్యంగా ద్రవ్య కంపెనీల వ్యాపారాభివృద్ధి కోసం ఫీల్డ్ స్టాఫ్ ను ఉత్తేజపరిచే ఉపన్యాసాలు ఇవ్వడంలో దిట్ట. ఆ తర్వాత వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని పూర్తికాలం ఉత్తేజ ప్రసంగాలు…

నేను ఏకాకిని… -కవిత

నేను ఏకాకిని జనారణ్యంలో మనుషుల్ని వెతుక్కుంతున్న జీవాన్ని మనుషుల్లో ‘మనసు’ కై దేవులాడుతున్న మానవతా పిపాసిని నటిస్తున్న నిద్రపై స్వారీ చేస్తున్న మెలకువని చచ్చిన రాకుమారుడ్ని మళ్ళీ చంపి వధ్య శిల ఎక్కనున్న చంద్రమతిని కృత్రిమత్వానికి సహజత్వానికి మధ్య దూరాన్ని కొలుస్తున్న కొలబద్దను సమూహంలో లేని సామూహికతను సమాజంలో లేని సామాజికతను కృష్ణుడిని తప్ప చూడలేని దృత రాష్ట్రుడి చూపుని కళ్ళకు గంతలు కట్టని గాంధారిని కుప్పతొట్టి బాలల కడుపు నింపుతున్న నిండు విస్తరాకుని పాలింకిన చన్నులను…

అమ్మాయిలకు ప్రవేశం లేని యూనివర్సిటీ లైబ్రరీ -కార్టూన్

“ఈ పుస్తకంలో అమ్మాయిలకు చాలా రిఫరెన్స్ లు ఉన్నాయి సార్ – చదవడం కొనసాగించమంటారా?” ****************** “ఒక స్త్రీ విద్యావంతురాలయితే ఒక కుటుంబం మొత్తం విద్యావంతం అవుతుంది” అని సాధారణ సత్యంగా చెబుతుంటారు. కానీ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు) వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించి అలహాబాద్ హై కోర్టు చేత చీవాట్లు తిన్నారు. ఎ.ఎం.యు లోని మౌలానా ఆజాద్ లైబ్రరీ అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంధాలయం. విచిత్రంగా ఇందులోకి…

అంటరానితనం సజీవం, పాటించువారు బ్రాహ్మణులు -సర్వే

“అంటరానితనం అమానుషం, చట్ట రీత్యా నేరం” అని భారత ప్రభుత్వం గత 67 యేళ్లుగా ప్రచారం చేస్తోంది. అంటరానితనం నిర్మూలించడానికి అని చెబుతూ చట్టాలు చేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా భారత దేశంలో అంటరానితనం సజీవంగా కొనసాగుతోందని జాతీయ, అంతర్జాతీయ సంస్ధల సర్వేలో వెల్లడి అయింది. జాతీయ అనువర్తిత ఆర్ధిక పరిశోధనా సంస్ధ (National Council for Applied Economic Research -NCAER) వారు నిర్వహించిన భారత మానవాభివృద్ధి సర్వే (Indian Human Development Survey -IHDS)…

వివాహాల్లో లైంగిక హింస సర్వ సాధారణం -సర్వే

వైవాహిక జీవితంలో జరుగుతున్న అత్యాచారాలను గుర్తించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కోర్టులే కాదు, పార్లమెంటు సభ్యులు కూడా వైవాహిక జీవితంలో అమలయ్యే బలవంతపు లైంగిక జీవనాన్ని గుర్తించడానికి నిరాకరిస్తారు. వివాహంలో లైంగిక హింసను గుర్తించడం అంటే భారత దేశ సంస్కృతీ సాంప్రదాయాలను అగౌరవపరచడమే అని భావించే మహిళా ఎం.పిలు కూడా మన చట్ట సభల్లో కూర్చొని ఉన్నారు. అలాంటి వారు చివరికి మహిళా కమిషన్ లో సైతం ఆసీనులై ఉండడం ఓ విపత్కర పరిణామం. భారత దేశంలో…

మోడి రెండు ముఖాలు -కరణ్ ధాపర్

(సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ లో ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమం నిర్వాకులు గానూ, హెడ్ లైన్స్ టుడే న్యూస్ ఛానెల్ లో ‘టు ద పాయింట్’ కార్యక్రమం సంధానకర్తగానూ జర్నలిస్టు కరణ్ ధాపర్ సుప్రసిద్ధులు. ఆర్.ఎస్.ఎస్ నేతృత్వంలోని సంఘ్ పరివార్ సంస్ధలు బోధించే అశాస్త్రీయ నమ్మకాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఏకంగా ఒక అత్యాధునిక పరిశోధనా ఆసుపత్రి ప్రారంభంలో వ్యక్తం చేయడాన్ని విమర్శిస్తూ ఆయన ది హిందు పత్రికకు రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) *****************…

(ఖాతాదారుల) వెల్లడికి మించి వెళ్లాలి… -ది హిందు ఎడిట్

పన్నుల విషయాల్లో గోప్యత అనేది ప్రాధమిక (అధికార) కార్యకలాపాల్లో అనుసరించవలసిన ప్రక్రియలలో తప్పనిసరి భాగమే కాకుండా పన్నుల ఎగవేతను నివారించేందుకు కావలసిన అంతర్జాతీయ సహకారంలో అత్యవసర దినుసు కూడా. అయితే, ఇతర దేశాలు పంచుకున్న వివరాలపై తగిన విధంగా చేయవలసిన పరిశోధనను ఎగవేసేందుకు అది సాకు కారాదు. కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ లో 627 మంది పేర్లతో కూడిన జాబితాను అందించక తప్పని పరిస్ధితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేలా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంలో మనకు…

మెక్సికో మాఫియా: ‘మిస్సింగ్ 43’ కోసం ఆందోళనలు -ఫోటోలు

మెక్సికో డ్రగ్స్ మాఫియా ముఠాల అరాచకాలకు పెట్టింది పేరు. మెక్సికో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలు నడిపే స్ధాయిలో అక్కడి డ్రగ్స్ మాఫియాలు విలసిల్లుతున్నాయి. పోలీసు విభాగాలు కూడా బహిరంగంగానే మాఫియా ముఠాలకు దన్నుగా నిలుస్తాయి.  మాఫియా ముఠాల పెత్తనానికి సవాలుగా పరిణమించారో, మరే కారణమో తెలియదు గానీ గత సెప్టెంబర్ 26 తేదీన ఇగువాల అనే పట్టణంలో పోలీసులు, ముసుగులు ధరించిన మాఫియా బలగాలు మూకుమ్మడిగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులు ఉపాధ్యాయులపై తుపాకులతో…

బి.జె.పి నేతలు చేసింది లవ్ జిహాద్ కాదా?

  -ప్రవీణ్ భాజపా నాయకులు తమ వ్యక్తిగత జీవితాలలో వెనుకబాటు నమ్మకాలని నమ్మరు. ఆ పార్తీ సీనియర్ నాయకులలోనే నలుగురు మతాంతర వివాహాలు చేసుకున్నారు. వాళ్ళు జనం మీదకి మాత్రం వెనుకబాటు నమ్మకాలని రుద్దుతారు. లవ్ జిహాద్ అనేది నిజంగా జరిగితే షానవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీలు చేసినది కూడా లవ్ జిహాద్ కాదా? వాళ్ళకి భాజపాలో ఉన్నత స్థానం ఎందుకు ఇచ్చినట్టు? ఈ కింది వివాహ సంఘటనలు కూడ “లవ్ జిహాదే” నా? అశోక్…

లవ్ జిహాద్: మీరట్ అమ్మాయి కాదన్నా పంతం వీడని హిందూత్వ

  భారత దేశంలో ఇస్లామిస్టు సంస్ధలు ‘లవ్ జిహాద్’ కు కుట్ర చేస్తున్నాయని చెప్పడానికి మీరట్ అమ్మాయి కేసు పాఠ్య గ్రంధం లాంటి ఉదాహరణగా ఆర్.ఎస్.ఎస్ తదితర హిందూత్వ సంస్ధలు కోడై కూశాయి. తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేసుకుని, అత్యాచారం చేశారని ఆ అమ్మాయి మొదట్లో ఆరోపించింది. ఆ తర్వాత అసలు సంగతి వెల్లడిస్తూ రాజకీయ పార్టీలు, సంస్ధల ఒత్తిడితో, తన తండ్రి బలవంతం చేయడంతో తాను ఆ విధంగా చెప్పానని, తన తల్లిదండ్రుల…

ఎబోలా: వణికిపోతున్న ఆధునిక ప్రపంచం -ఫోటోలు

  మానవ వైద్య పరిజ్ఞానానికి ప్రాణాంతక వ్యాధులను కలిగించే వైరస్ లు ఇప్పటికీ కొరకరాని కొయ్యలుగానే ఉంటున్నాయని ఎబోలా వైరస్ విస్తృతి తెలియజేస్తోంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.  శత్రు దేశాలను లొంగ దీసుకోవడానికీ, సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్న దేశాలను దారికి తెచ్చుకోవడానికీ సామ్రాజ్యవాద దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రాణాంతక వైరస్ లను తమ ప్రయోగశాలల్లో భద్రపరచడమే కాకుండా, జెనెటిక్ ప్రక్రియల ద్వారా సరికొత్త ప్రాణాంతక వైరస్ లను సృష్టిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడం నాణేనికి మరో…

వైజాగ్ లో చంద్రబాబుకు ఎల్-బోర్డు -కార్టూన్

వాహన తోలకం (డ్రైవింగ్) నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? తోలకం నేర్చుకుంటున్న వాహనానికి L-బోర్డు తగిలిస్తాం. రోడ్డు రవాణా విభాగం వాళ్ళు ఈ మేరకు నిబంధన విధిస్తారు. తోలకం నేర్చునేవారు తమ దరిదాపుల్లో ఉన్నప్పుడు ఇతర వాహనదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఎల్-బోర్డు సూచిస్తుంది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక ఆశలు కల్పించారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని కొన్నాళ్లు చెప్పారు. నయా రాయపూర్ నిర్మాణం బాగుందని కొన్నాళ్లు…