హుస్సేన్ ఒబామాది ఏ మతం?

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మతం ఏమిటన్నది అనేకమంది అమెరికన్లకు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. ఆయన ముస్లిం అని నమ్మేవారు అనేకమంది ఉన్నారు. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీని అభిమానించే అమెరికన్ ఓటర్లలో మెజారిటీ ఒబామా ముస్లిం మతానికి చెందిన కుటుంబం నుండే వచ్చారని గట్టిగా నమ్ముతున్నారు. ఆయనది ఏ మతమో తెలియదు అని చెప్పేవారిని కూడా కలుపుకుంటే ఆయన క్రైస్తవులు అని నమ్మనివారి సంఖ్య ఇంకా అనేక రెట్లు ఉంటుంది. బారక్ ఒబామా పూర్తి పేరు…

అమెరికాలో హిందూ ఆలయంపై విద్వేష దాడి

హిందూ జాతీయవాద నేత భారత ప్రధానిగా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ లోనే అనేక చర్చిలపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన ఓ హిందు ఆలయంపై విద్వేషపూరిత దాడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ నుండి వెళ్తూ వెళ్తూ మైనారిటీ మతావలంబకుల హక్కులను కాపాడాలని హిత బోధ చేసి వెళ్లారు. ఆయన సందేశానికి కొనసాగింపుగానా అన్నట్లుగా ఇప్పుడు ఆయన అధ్యక్షరికంలో ఇక్కడి చర్చిలపై దాడికి ప్రతి చర్య అమెరికా నేలపై చోటు చేసుకుంది.…

పాలిచ్చేందుకు అనుమతివ్వని కాంట్రాక్టర్, రోజుల బిడ్డ మృతి

  పసి బిడ్డ నిండు ప్రాణాల కంటే కాంట్రాక్టులో మిగిలే రూపాయి నోట్లకే ఎక్కువ విలువ కట్టిన ఓ పాషాణ హృదయుడి కఠినత్వం ఇది. మానవ విలువలు అడుగంటిన లోకం విధించిన డబ్బు బంధనాలలో తల్లి బందీ అయిందని తెలియక పాల కోసం గుక్క పట్టి ఏడ్చి ఏడ్చి విసుగెత్తి కానని లోకాలకు తరలి వెళ్ళిన పసి బిడ్డ విషాదాంతం ఇది. మెదక్ జిల్లాలో హత్నూర మండలలో హృదయాల్ని పిండి వేసే ఈ ఘోర ఉదంతం చోటు…

ప్రాణాలు ఫణంగా పెట్టే ‘టఫ్ గై’ సవాలు! -ఫోటోలు

బ్రిటన్ లో ప్రతి సంవత్సరం జరిగే ‘టఫ్ గై ఛాలెంజ్’ పోటీలు మళ్ళీ జరిగాయి. జనవరి నెల చివరి వారంలో జరిగే ఈ పోటీలు ఈసారి ఫిబ్రవరి 1 తేదీన జరిగాయి. ప్రపంచం నలుమూలల నుండి, ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల నుండి వేలాదిగా తరలివచ్చే ఉక్కు పిండాలు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఇంతవరకు ఈ పోటీల్లో చివరి వరకు నిలబడిన ‘టఫ్ గై’ ఒక్కరు కూడా లేకపోవడం బట్టి పోటీల పస ఏమిటో తెలుసుకోవచ్చు. ఛారిటీ…

నిశ్శబ్దం ఒక ఎంపిక కాదు -ది హిందు ఎడిటోరియల్

అమెరికా అధ్యక్షుడు బారక్ బారక్ ఒబామా, ఇండియాలో కుంచించుకుపోతున్న మత సామరస్యం గురించి తొమ్మిది రోజుల వ్యవధిలో రెండుసార్లు వరుసగా ప్రకటనలు గుప్పించడంపై ఇండియాలో కాస్త తత్తరపాటును సృష్టించింది. మొదటి సారి జనవరి 27 తేదీన తన భారత సందర్శనను ముగిస్తూ మత ప్రాతిపదికన లోలోపల విభజనకు గురైన దేశాలు ఎన్నటికీ ప్రగతి సాధించలేవన్న అంశాన్ని ఒబామా నొక్కి చెప్పారు; రెండోసారి ఫిబ్రవరి 5 తేదీన మాట్లాడుతూ ఆయన భారత దేశం నుండి వెలువడుతున్న మత అసహనం…

బ్లాగు వయసు నాలుగేళ్ళు!

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున బ్లాగ్ ప్రారంభించిన సంగతి వర్డ్ ప్రెస్ వాళ్ళ శుభాకాంక్షలు అందుకునే వరకూ గుర్తు రాలేదు. బ్లాగ్ ప్రారంభించింది ఒకందుకే అయినే ఇంకా మరిన్ని విధాలుగా బ్లాగ్ ఉపయోగపడుతోందని పాఠకుల స్పందనల ద్వారా తెలిసింది. గత సంవత్సరం ఇదే రోజు చెప్పినట్లు ఎందరో పాఠకులు, హితాభిలాషుల ఉత్సాహ ప్రోత్సాహాలు లేకుండా నాలుగేళ్ల పాటు ఈ బ్లాగ్ కొనసాగడం సాధ్యపడి ఉండేది కాదు. వారందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఈ బ్లాగు నాకు సంబంధించినంతవరకు…

ఐదోసారి ఢిల్లీ చర్చిలపై దాడి, ఎన్నికల కోసమేనా?

ప్రజల మధ్య మత తత్వ సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు అలవాటు పడ్డ మతతత్వ శక్తులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కలిసి మెలసి జీవిస్తున్న ప్రజల మధ్య మతపరమైన భావోద్వేగాలను విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రత్యనిస్తున్నాయని ఐదోసారి మరో చర్చిపై జరిగిన దాడితో స్పష్టం అవుతోంది. జాతీయ రాజధానిలో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడంలో హిందూత్వ శక్తులు నిమగ్నం అయ్యాయి. విధానాలను చూపి విజయం సాధించడం మాని…

జీవన విధానాల్ని శాసిస్తున్న మొబైల్ ఫోన్ -ఫోటోలు

ఆధునిక ప్రపంచంలో ప్రజల జీవన విధానాల్ని దాదాపుగా శాసిస్తున్న ఉపకరణం, మొబైల్ ఫోన్! జీవన విధానాల్ని మొబైల్ ఫోన్ తిరగరాస్తోందని కొందరు చెబుతారు గాని అది ఒకింత ఓవర్ స్టేట్ మెంట్. అప్పటికే స్ధిరపడిన జీవన విధానంలో కొన్ని పనుల్ని మొబైల్ ఫోన్ చాలా సులభతరం చేసిన మాట నిజమే. కానీ మొబైల్ కంపెనీలా లేక వినియోగదారులా ఎవరు ఎక్కువ లాభ పడ్డారు అని ప్రశ్నించుకుంటే మాత్రం కంపెనీలే ఎక్కువ లాభం పొందుతున్నాయని తధ్యంగా చెప్పవచ్చు. ఒకనాడు,…

కుల రాజకీయ చెదలు పట్టిన సృజన -కార్టూన్

తమిళనాట కులాల కార్చిచ్చు రగిలి సమస్త సామాజిక గతిని నమిలి పారేస్తోంది. ముఖ్యంగా సమాజ ప్రగతికి దోహదం చేసే సృజనాత్మక రచనలను అది దహించివేస్తోంది. కాలకూట విషం కక్కుతూ అటు ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తూ ఇటు రాజకీయ చైతన్యాన్ని మొద్దుబార్చుతోంది. ప్రఖ్యాత రచయిత పెరుమాళ్ మురుగన్ తాను రచయితగా చచ్చిపోయానని, రచనలన్నింటిని ఉపసంహరించుకుంటున్నానని, ఇక రచనలు చేయబోనని ప్రకటించడం ఈ ఒరవడిలో జరిగిన పరిణామమే. మురుగన్ నాలుగు సంవత్సరాల క్రితం రాసిన మధోరుబాగన్ నవల ఇటీవల…

సునంద పుష్కర్: ఆత్మహత్య కాదు హత్యే!

కేంద్ర మాజీ మంత్రి, ఐరాస సెక్రటరీ జనరల్ కి పోటీ పడిన భారతీయుడు శశిధరూర్ మరోసారి చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తోంది. ఆయన భార్య సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదని, ఎవరో ఆమెకు విషం ఇచ్చి చంపారని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు సునంద పుష్కర్ మరణం విషయమై హత్య కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. రష్యాలో తయారయిన విషం ఇచ్చి సునందను చంపారని, ఈ సంగతి శశి ధరూర్ కు…

నాకు బస్సు, నా గార్డులకు కార్లా? -యశోదాబెన్ ఆర్.టి.ఐ

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈ దేశ ప్రధాని భార్య మండి పడుతోంది. ప్రోటో కాల్ పేరుతో తన రక్షణ కోసం 10 గార్డులను నియమించి వారి ప్రయాణానికి కార్లు ఇచ్చారని, తనకు మాత్రం ప్రభుత్వ ప్రయాణ వాహనం బస్సులో మాత్రమే వెళ్ళే అవకాశం దక్కిందని ఇదెక్కడి విడ్డూరమని ఆమె ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రోటోకాల్ అంటే ఏమిటో చెప్పాలని ఆమె సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు గార్డులను నియమించిన ఆదేశాలు…

2014 నేషనల్ జాగ్రఫిక్ ఫోటో పోటీ విజేతలు -ఫోటోలు

నేషనల్ జాగ్రఫిక్ మేగజైన్ 2014 సంవత్సరానికి గాను ఫోటో పోటీ విజేతలను ప్రకటించింది. ఎప్పటిలాగానే జనం (People), ప్రకృతి (Nature), స్ధలం (Places) అనే మూడు విభాగాల్లో పోటీ నిర్వహించబడింది. అత్యున్నతమైన గ్రాండ్ బహుమతిని పీపుల్ విభాగం విజేతకు దక్కింది. హాంగ్ కాంగ్ లో చీకటి ఆలుకుని ఉన్న ఒక రైలు పెట్టెను ఒక యువతి చేతిలోని మొబైల్ ఫోన్ ప్రకాశింపజేస్తున్న దృశ్యాన్ని బ్రియాన్ యెన్ చిత్రీకరించగా అది గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకుంది. మొబైల్ ఫోన్…

నేపాల్: ప్రకృతి, జీవితం -ఫోటోలు

హిమాలయ రాజ్యమైన నేపాల్ సహజంగానే ప్రకృతి సౌందర్యాలకు నిలయం. ఇటీవలి వరకు ఫ్యూడల్ రాచరికంలో మగ్గిన ఫలితంగా అక్కడ దరిద్రానికి కొదవ లేదు. ఒక పక్క రాచరికం మిగిల్చిన సంపన్న భవనాలు, మరో పక్క ఆ మూడు రోజుల కోసం స్త్రీలను బందిఖానా చేసే చౌపడి గుడిసెలు! ప్రకృతి ఒడిలో నిండా మునిగినట్లుండే నేపాల్ జనజీవనానికి ప్రతిబింబాలు ఈ కింది ఫోటోలు. నేపాల్ ని ‘ప్రపంచపు పైకప్పు’ (roof of the world) అని కూడా పిలుస్తారట!…

చిన్న శవపేటికలను పూడ్చడమూ కష్టమే!

“అతి చిన్న శవపేటికలు అత్యంత బరువైనవి” అంటూ తాలిబాన్ పైశాచిక హత్యాకాండను పాక్ ప్రజలు నిరసించారు. “చిన్న శవ పేటికలను పూడ్చడం చాలా కష్టమయింది” అని సమాధుల తవ్వకం దారు తాజ్ ముహమ్మద్ గాద్కదిక స్వరంతో, దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు. పెషావర్ లోని అతి పెద్ద శ్మశాన వాటికలో సమాధులను తవ్వేవారిలో తాజ్ ముహమ్మద్ ఒకరు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం శవాలను సాధ్యమైనంత త్వరగా పూడ్చిపెట్టాలి. దానితో డిసెంబర్ 16 తేదీన అమానుష రీతిలో దాడి జరగగా…

మోడి మార్కు లక్ష్మణ రేఖ -కార్టూన్

ప్రధాని నరేంద్ర మోడి తన లక్ష్మణ రేఖ ప్రకటించారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘రామ్ జాదే – హరామ్ జాదే’ అంటూ చేసిన ప్రసంగం ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడంతో ఆయన ‘కొత్త మంత్రులు, పార్టీ నేతలు’ ‘నియంత్రణ’లో ఉండాలని లక్ష్మణ రేఖ గీశారు. ఇంత గొడవ జరుగుతుంటే ప్రధాని ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు గర్జించడంతో పార్లమెంటుకు వచ్చిన ప్రధాని ‘కొత్త మంత్రి, గ్రామీణ నేపధ్యం, అంతా కొత్త. అయినా ఆపాలజీ…