సత్యంకు పడింది పెద్ద శిక్షేనా? -కార్టూన్

రామలింగ రాజు సోదరులు, ఇతర పెద్ద మనుషులకు అవినీతికి పాల్పడినందుకు గాను హై కోర్టు శిక్షలు ప్రకటించింది. అత్యధికంగా 7 సం.ల జైలు శిక్ష + 5.5 కోట్లు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ శిక్షలను చూసి అందరూ సంతోషిస్తున్నారు. తగిన శిక్ష పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సత్యం కంపెనీ అధిపతి రామలింగ రాజు బృందం పాల్పడిన అవినీతికి పడిన శిక్ష మొత్తం కార్పొరేట్ అవినీతికి పడవలసిన శిక్షతో పోల్చితే ఎంత చిన్న దెబ్బతో సమానమో…

సర్వ మత హక్కులు కాపాడుతాం –మోడి

“ప్రతి పౌరుని యొక్క హక్కులను, స్వేచ్చను మేము రక్షించి కాపాడతాం. ప్రతి ఒక్క మతము, సంస్కృతి, నమ్మకాలకు చెందిన ప్రతి ఒక్క పౌరుడికి మా సమాజంలో సమాన స్ధానం ఉండేలా చూస్తాము. మా భవిష్యత్తులో నమ్మకాన్ని కల్పిస్తాము. ఆ భవిష్యత్తు సాధించేందుకు విశ్వాసం ఇస్తాము.” ఇవి ఫ్రెంచి గడ్డపై ప్రధాని నరేంద్ర మోడి పలికిన పలుకులు. ఫ్రెంచి నేల మనది కాదు. కనీసం మన పాత వలస ప్రభువు కూడా కాదు. ప్రధాని అక్కడికి వ్యాపార ఒప్పందాల…

రాఫెల్ కు స్వామి నో, మోడి యెస్

రాఫెల్ ఫైటర్ జెట్లు తక్షణ ప్రాతిపదికన ఏకంగా 36 కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రాన్స్ బయలుదేరుతూనే రాఫెల్ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ వెళ్ళిన ప్రధాని చెప్పినట్లుగానే ‘పడవపై చర్చలు’ జరిపి భారీ కొనుగోలుకు తలూపారు. మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయడం కాదు. ఇప్పటికే తయారై ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఫైటర్ జెట్ విమానాలనే ఇండియా కొనుగోలు చేయనుంది. జెట్ ఫైటర్ విమానాల కొనుగోలు…

క్లుప్తంగా… 8/4/15

గుజరాత్ లో ముస్లిం తరిమివేత హిందూత్వ కోరలు చాస్తూ విషం చిమ్ముతున్న వార్తలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గుజరాత్ లో భావనగర్ జిల్లాలోని ఒక చోట 60 హిందూ కుటుంబాల మధ్య నివశిస్తున్న ఒకే ఒక్క ముస్లిం కుటుంబాన్ని అక్కడి నుండి బలవంతంగా తన్ని తగలేశారు. ముస్లిం కుటుంబాన్ని బలవంతంగా తరిమి కొట్టాలని గత సం. ఏప్రిల్ లో హిందూత్వ గణానికి ఉద్భోదించిన కేసులో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఇప్పటికీ కోర్టు, ఎలక్షన్ కమిషన్…

పొగాకు లాబీకి లొంగి కేంద్ర మంత్రి తొలగింపు?

విదేశీ కంపెనీల లాభాలు పడిపోకుండా ఉండడానికీ, వీలయితే ఇంకా ఇంకా పెంచడానికీ స్వదేశీ భాజపా మంత్రుల పాట్లు అన్నీ ఇన్నీ కాకుండా పోతున్నాయి. ‘ఊరంతా ఒకదారయితే ఉలిపిరి కట్టెది మరోదారి’ అన్నట్లుగా కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూ తమ బుద్ధి మాంద్యాన్ని చాటుకుంటున్నారు. కాగా పొగాకు లాబీకి లొంగి ప్రధాని నరేంద్ర మోడి ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధన్ ను తప్పించారని ప్రతిపక్షాలు ఆరోపించడం ప్రజలు గమనించవలసిన విషయం. లేకపోతే ధూమపానం వల్ల/సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని…

అమెరికా కోసం అణు చట్టానికి బి.జె.పి కొత్త అర్ధం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం చేతికి రాగానే మరొక మాట చెప్పడం భారత దేశంలో రాజకీయ పార్టీలకు మామూలు విషయం. కానీ కాంగ్రెస్, బి.జె.పిలు తమ మాటల్ని తాము ఎక్కడ ఉన్నామన్నదానిపై ఆధారపడి ఒకరి మాటలు మరొకరు అరువు తెచ్చుకోవడం ఒక విశేషంగా కొనసాగుతోంది. విశేషం అనడం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి.జె.పి ఏ సూత్రాలు బోధించిందో సరిగ్గా అవే సూత్రాలను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బోధిస్తోంది. అలాగే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తన…

భూసేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్ -ది హిందు ఆర్టికల్ (2)

మొదటి భాగం తరువాత…………. – అభివృద్ధి పేరుతో… ఈ వాదనతో ఉన్న రెండో సమస్య ఏమిటంటే, ధరలపై కేంద్రీకరించడం ద్వారా మరింత మౌలికమయిన రాజకీయ సమస్యను విస్మరించింది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం రైతుల నుండి భూములను బలవంతంగా గుంజుకుని ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వాలి? కనీసం ఆంగ్లంలో అనుబంధాలు ఇచ్చినప్పటి నుండి… భూములను ఒక గ్రూపు ప్రజల నుండి తీసేసుకుని మరో గ్రూపుకు (సాధారణంగా సంపన్నులు) ఇవ్వడాన్ని “ప్రజా” లేదా “జాతీయ” లక్ష్యాన్ని నెరవేర్చడంగా ప్రభుత్వాలు సమర్ధించుకున్నాయి.…

రిపబ్లిక్ డే డాలరీకరణ! -కార్టూన్

స్వదేశీ నినాదం తమదిగా బి.జె.పి చెప్పుకుంటుంది. బి.జె.పి మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ లో ఆర్ధిక విభాగం పేరే ‘స్వదేశీ జాగరణ్ మంచ్.’ విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలని ఈ సంస్ధ అనేక దశాబ్దాలు పుస్తకాలు ప్రచురించి మరీ బోధించింది, ఇంకా బోధిస్తోంది. అలాంటి స్వదేశీ బి.జె.పి తీరా అధికారానికి వచ్చాక పక్కా విదేశీ విధానాలను కాంగ్రెస్ కంటే ఎక్కువగా వాటేసుకుని అమలు చేయడాన్ని ఎలా అభివర్ణించాలి? ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే…

భద్రతపై విభేదాలు, ఒబామా ఆగ్రా పర్యటన రద్దు

అమెరికా అధ్యక్షుడి ఆగ్రా పర్యటన రద్దయిందని భారత అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు తన భార్య మిచెల్లే ఒబామాతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శిస్తారని ఇప్పటివరకు ఇరు దేశాలు విడుదల చేసిన షెడ్యూళ్ళు చెబుతూ వచ్చాయి. కానీ ఆగ్రా పర్యటన సందర్భంగా ఒబామా భద్రత కోసం తీసుకోవలసిన చర్యల విషయమై భారత భద్రతా బలగాలకు, అమెరికా భద్రతా బలగాలకు స్వల్ప విభేదాలు తలెత్తడంతో ఒబామా తన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 24వ…

2014-15 Q3 లో టి.సి.ఎస్ తొలగింపులు 11,693

భారత దేశ ఐ.టి దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ లే-ఆఫ్ (ఉద్యోగుల తొలగింపు) ఉదంతంలో వాస్తవాలు నానాటికీ మరింతగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కంపెనీ విడుదల చేసిన మూడవ త్రైమాసిక ఫలితాలలో వాస్తవ ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఎంతో కంపెనీయే స్వయంగా ప్రకటించింది. కంపెనీ అధిపతులు మొదట చెప్పినట్లుగా కేవలం 1 శాతం మాత్రమే తొలగింపులు ఉన్నాయనడం నిజం కాదని కంపెనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ‘నాన్-పెర్ఫార్మర్స్’ పేరుతో టి.సి.ఎస్ కంపెనీ పెద్ద సంఖ్యలో…

టి.సి.ఎస్ లే-ఆఫ్ కు సీనియర్ల అధిక వేతనాలే కారణం -2

భారత వ్యాపార, ఐ.టి రంగాలను ట్రాక్ చేసే Track.in అనే బిజినెస్ వెబ్ సైట్ ప్రకారం మధ్య స్ధాయి మేనేజర్లను, కన్సల్టెంట్లను తన లే-ఆఫ్ (ఉద్యోగాల తొలగింపు) కు టి.సి.ఎస్ లక్ష్యంగా చేసుకుంది. టి.సి.ఎస్ లో ఇలా ఎన్నడూ జరగలేదనీ ఉద్యోగ భద్రతకు పేరు గాంచిన టి.సి.ఎస్ ఇప్పుడు తన ఏ, బి, సి, డి, ఇ రేటింగులలో చివరి 3 రేటింగుల వారిని అందరినీ తొలగించాలని లక్ష్యంగా చేసుకుందని ట్రాకిన్ తెలిపింది. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను…

టి.సి.ఎస్ లే-ఆఫ్: సీనియర్ల వేతనాలు కారణం కాదా?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి.సి.ఎస్) కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద, మెరుగైన 10 సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. భారత దేశంలో నయితే ఇదే అతి పెద్ద సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ. ఈ కంపెనీలో చేరితో ఉద్యోగ భద్రత ఉంటుందని కూడా ఇటీవలి వరకూ ఒక భావన వ్యాప్తిలో ఉండేది. అలాంటి కంపెనీ ఆ వంకా, ఈ వంకా పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోందని, ఎటువంటి నోటీసు, తగిన చెల్లింపులు లేకుండా…

టి.సి.ఎస్ లో సామూహిక తొలగింపులు

భారత దేశంలో అతి పెద్ద సాఫ్ట్ వేర్ ఉత్పత్తి మరియు సేవల కంపెనీగా ప్రసిద్ధి గాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి.సి.ఎస్) కంపెనీ గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ నుండి తొలగించబడిన ఉద్యోగులు ఈ మేరకు బెంగుళూరు/కర్ణాటక డిప్యూటీ లేబర్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వారు అధికారికంగా ఇంకా ఫిర్యాదు చేయవలసి ఉందని తెలుస్తోంది. ఉద్యోగులను సామూహికంగా తొలగించే కార్యక్రమాన్ని టి.సి.ఎస్ కంపెనీ యాజమాన్యం చేపట్టిందని ఉద్యోగులు చెబుతున్నారు.…

చైనాలో జీమెయిల్ బంద్!

అధికారికంగా ప్రకటించకుండానే గూగుల్ మెయిల్ సర్వీస్ ను చైనా బొంద పెట్టింది. లేదా బంద్ చేసింది. తద్వారా అమెరికా సామ్రాజ్యం తరపున ప్రపంచ మెయిల్, సర్చ్, ట్యూబ్, మొబైల్ వినియోగదారులందరి వివరాలను రహస్యంగానూ, బహిరంగంగానూ సేకరిస్తున్న గూగుల్ కంపెనీ అరాచకాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న దేశంగా చైనా తన పేరు నిలబెట్టుకుంది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని, కంప్యూటర్ ప్రపంచాన్ని సొంత లాభాల కోసం విచ్చలవిడిగా వినియోగించడం మైక్రో సాఫ్ట్ ప్రారంభించగా అదే పనిని అనేక మెట్ల ఎత్తుకు సిగ్గు…

చైనా బులెట్ ట్రైన్ మనకు సాకారం అయ్యేనా?

భారత దేశంలో అతి పొడవైన మార్గంలో బులెట్ ట్రైన్ రైలు, ట్రాక్ నిర్మించాలని చైనా భావిస్తోంది. కానీ జపాన్ ఇస్తున్న పోటీ వల్ల చైనా ఇవ్వజూపుతున్న సహాయం వెనక్కి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్ చొరబడడంతో మెక్సికోలో బిడ్డింగ్ పూర్తయిన బులెట్ ట్రైన్ ప్రాజెక్టు సైతం చైనా చేజారడంతో ఇండియాలోనూ అదే జరగవచ్చని చైనా అనుమానిస్తోంది. ఇండియా మాత్రం అన్ని అవకాశాలను తెరిచి ఉంచుకుని చైనా అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇండియాకు చెందిన ‘హై స్పీడ్ రైల్…