కుట్టు కూలీలే డిజైనర్లయితే… -కార్టూన్

—— స్వెట్ షాప్ వర్కర్లు తాము కుట్టే చొక్కాలను తామే డిజైన్ చేస్తే… *నేను స్కూల్ లో ఉండాల్సిన దాన్ని! *బాత్ రూమ్ బ్రేక్ లంటే నాకిష్టం! *దోపిడిని లాండ్రీ చేయడం చాలా కష్టం! *నేనేమీ తగ్గింపు ధరల ఐటెమ్ ని కాను! *నేను కుట్టిందే నువ్వు పిండుకుంటావు! *1000 చావుల 40 దారాల కౌంట్! —— అత్యంత దారుణమైన పని పరిస్ధితుల్లో, అత్యంత తక్కువ వేతనానికి, రోజుకు అనేక గంటలపాటు పని చేయించే బట్టల తయారీ…

చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు

కలుగులో ఎలుక బైటికి వచ్చేస్తోంది. పోలీసులు పెట్టిన పొగ తట్టుకోలేక పుట్టలో పాములు వరుసగా తోసుకుని బైటికొస్తున్నాయి. విందూ దారా సింగ్ ఇచ్చిన వివరాలు నిజమేనని ముంబై పోలీసులకు స్పష్టంగా అర్ధం అయింది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేతల్లో ఒకరు అయిన గురునాధ్ మీయప్పన్ పాత్ర ఉన్నదని ముంబై పోలీసుల వద్ద సరిపోయినన్ని సాక్ష్యాలు ఉన్నాయట. ఈ మేరకు ముంబై జాయింట్…

ఐ.పి.ఎల్ మాయల బూరోడు -కార్టూన్

పైడ్ పైపర్ అనేది జర్మనీలో బహుళ ప్రచారంలో ఉన్న ఒక కధ. ఓ చిన్న నగరానికి ఎలుకలు పెద్ద బెడదగా ఉండేవిట. వాటిని వదిలించుకోడానికి నగర జనం, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఒకసారి బూర (పైపర్) ఊదుకుంటూ రంగు రంగుల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆ నగరానికి వచ్చాడు. ఎలుకలను తాను తరిమేస్తానని, అందుకు తనకు తగిన ఫలితం ఇవ్వాలని కోరాడాయన. ప్రజలు, మేయర్ చర్చించుకుని పెద్ద మొత్తం ఇవ్వడానికి సరేనన్నారు.…

రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన యాపిల్!

పన్ను ఎగవేయడం ఒక కళ. ఆ కళలో ఆరితేరింది యాపిల్ కంపెనీ. ప్రపంచ వ్యాపితంగా పదుల కొద్దీ డూప్లికేట్ కంపెనీలు స్ధాపించి ‘టాక్స్ ప్లానింగ్’ పేరుతో ‘టాక్స్ ఏవేజన్’ కి పాల్పడడంలో యాపిల్ నేర్పరి అని ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను రుజువు చేస్తూ సదరు కంపెనీ 74 బిలియల్ డాలర్లు (దాదాపు రు. 4 లక్షల కోట్లకు సమానం) పన్ను ఎగవేసిందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఆరోపించడమే కాక విచారణ కూడా ప్రారంభించింది.…

విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా

అయినోడికి ఆకులు, కానోడికి కంచాలు! అదేమంటే జి.డి.పి వృద్ధి కోసం అని సాకులు. ఇదీ మన ప్రభుత్వ విధానం. స్వంతగా ఏడవ లేక పరాయి దేశాల పెట్టుబడిదారులను పిలిచి ‘మా దేశాన్ని అభివృద్ధి చేయండహో’ అని చాటింపు వేస్తున్నారు మన ఆర్ధిక మంత్రి చిదంబరం. ఎఫ్.ఐ.ఐ (విదేశీ సంస్ధాగత పెట్టుబడులు), క్యు.ఎఫ్.ఐ (క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ – అర్హిత విదేశీ పెట్టుబడులు) ల సొంతదారులు ఇప్పుడిక తమ వడ్డీ ఆదాయంపై 20 శాతం పన్ను బదులు 5…

వేడి సెగల డ్రాగన్ షేక్-హ్యాండ్ -కార్టూన్

చైనా ప్రధాని లీ-కెషాంగ్ భారత్ పర్యటన నేటితో మూడో రోజులోకి ప్రవేశించింది. ఈ రెండు రోజుల్లోనే పలు కీలక ఒప్పందాలు కుదిరాయని ఇరు దేశాల ప్రధాన మంత్రులు సంయుక్త విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. పలు ‘అవగాహనా ఒప్పందాలు’ (Memorandum of Understanding -MoU) కుదిరాయని కూడా వారు తెలిపారు. పర్యటన ప్రారంభంలో ‘తొలుత వాణిజ్య సంబంధాలు బాగా అభివృద్ధి చేసుకుని సరిహద్దు సమస్య దీర్ఘకాలికంగా పరిష్కరించుకుందాం’ అని లీ-కెషాంగ్ చెప్పినట్లు ది హిందు పత్రిక ప్రకటించింది. తీరా…

యాహూ ఒడిలో టంబ్లర్, గూగుల్ ‘మేయర్’ పాచిక

గూగుల్ అభివృద్ధిలో దశాబ్ద కాలం గడిపి ప్రత్యర్ధి కంపెనీ ‘యాహూ’ సి.ఇ.ఓ గా పది నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన మెరిస్సా మేయర్, కొత్త బాధ్యతల్లో తన మొదటి పాచిక విసిరినట్లు కనిపిస్తోంది. అంతర్జాలంలో విస్తృత యూజర్ బేస్ ఉన్న టంబ్లర్ బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేయడానికి యాహూ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి) తెలిపింది. 1.3 బిలియన్ డాలర్లకు (దరిదాపు 7,000 కోట్ల రూపాయలు) బేరం కుదిరినట్లు ఎ.పి వార్తా సంస్ధ సమాచారం.…

పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో భాగంగా శ్రీశాంత్ బుక్కయ్యాడా?

ఈనాడు పత్రిక ప్రకారం క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లు, స్పాట్ ఫిక్సింగ్ లు అన్నీ కలుపుకుని ఈసారి చేతులు మారిన మొత్తం అక్షరాలా రు. 47,000 కోట్లు. ఇది గత సంవత్సరం రు. 43,000 కోట్లట. అంటే 2జి, బొగ్గు కుంభకోణాలను తలదన్నే మొత్తాలు క్రికెట్ ఫిక్సింగ్ వ్యాపారంలో ఇమిడి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తాల్లో శ్రీశాంత్, చండీలా, చవాన్ లకు అందింది కోటి రూపాయలకు మించలేదు. మరి మిగిలిన మొత్తం ఎవరి చేతులకు చేరినట్లు, ఎవరి…

క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయాడు. అతనితో పాటు రాజస్ధాన్ రాయల్స్ కి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారు ఝామున అరెస్టు చేయడంతో ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ విషయాలు బైటికి వచ్చాయి. ఏప్రిల్ నుండే తాము ఆటగాళ్ల పైనా, బుకీల పైనా నిఘా పెట్టామని వారిని తప్పులు చేయనిచ్చి అరెస్టు చేశామని పోలీసులు సగర్వంగా, సంచలనాత్మకంగా ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ ధోనీయే కుట్ర చేసి తమ…

కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

భూ గ్రహం ఉత్తర ధ్రువం అయిన ఆర్కిటిక్ ఖండం వద్ద మంచు గడ్డలు వేగంగా కరిగిపోతున్నాయి. దానితో ఆ ఖండం వద్ద దాగిన అపార ఖనిజ, చమురు వనరుల కోసం పోటీ పేరుగుతోంది. ఈ పోటీలో భారత దేశం కూడా ప్రవేశించిన పరిణామం చోటు చేసుకుంది. ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఇండియాకు ‘పరిశీలక’ హోదా ఇస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియా, చైనాలతో పాటు ఆరు దేశాలకు ఈ హోదా…

బంగారం దిగుమతులు పైకి, వాణిజ్య లోటు ఇంకా పైకి

భారతీయుల బంగారం దాహం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ముప్పుగా పరిణమిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియా బంగారం దిగుమతులు 138 శాతం పెరిగాయి. దీనితో వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో తరుగు ఏర్పడి, కరెంటు ఖాతా లోటు (Current Account Deficit) పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులు పెరిగిన ఫలితంగా ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు అమాంతం 17.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచ…

రేటింగ్ కంపెనీలు: అమెరికాకి పోటీగా చైనా రంగంలోకి

అమెరికా రేటింగ్ కంపెనీలకు పోటీగా చైనా తన స్వంత రేటింగ్ కంపెనీని రంగంలోకి దించుతోంది. దశాబ్దాలుగా మార్కెట్ ఎకానమీ దేశాలలో రేటింగ్ కంపెనీల మార్కెట్ ను శాసిస్తున్న మూడు అమెరికా కంపెనీలకు ఇప్పటి వరకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), మూడీస్, ఫిచ్… ఈ మూడు క్రెడిట్ రేటింగ్ కంపెనీలదే ఇప్పటివరకు రేటింగ్ లను జారీ చేయడంలో ఇష్టారాజ్యం. ఆర్ధికంగా అమెరికాకు పోటీగా ఎదిగిన చైనా క్రమ క్రమంగా…

తుపాకుల కాపలాలో అమెరికా స్వేచ్ఛ! -కార్టూన్

స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు తానే అసలు ప్రతినిధినని చెప్పుకుంటుంది అమెరికా. వ్యక్తిగత స్వేచ్ఛను మించింది లేదని అంటుంది అమెరికా. (స్వేచ్ఛా హక్కు లాంటి ప్రాధమిక హక్కులకు హేతుబద్ధమైన పరిమితులు -reasonable restrictions- ఉండాలంటుంది భారత రాజ్యాంగం.) భారీ లిబర్టీ విగ్రహం సాక్షిగా చూపే అమెరికాలో లిబర్టీ, శిలగా తప్ప బతకలేని పరిస్ధితి అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో స్వేచ్ఛను స్ధాపిస్తానంటూ బాంబులు, ఫిరంగులతో బయలుదేరే అమెరికా అత్యంత కరుడుగట్టిన నియంతృత్వ రాజ్యాలకు కాపలా కాయడమే కాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన…

బంగ్లాదేశ్ ఫ్యాషన్ విధ్వంసం -4 కార్టూన్లు

ప్రపంచం నలుమూలలకి ఫ్యాషన్ దుస్తుల్ని అందించే బంగ్లాదేశ్ బట్టల ఫ్యాక్టరీ కార్మికుడి వేతనం నెలకి 38 డాలర్లు. అంటే దాదాపు 2 వేల రూపాయలు. దుస్తుల తయారీకి వినియోగించే శ్రమలో అతి కొద్ది భాగం మాత్రమే దాని సొంతదారుకు దక్కగా మిగిలినదంతా ఫ్యాక్టరీ ఓనరు, ఆ ఫ్యాక్టరీ నడిచే భవనం ఓనరు. తయారైన దుస్తుల్ని అద్దాల ఎ.సి గదుల్లో పెట్టి అమ్మే ఫ్యాషన్ దుకాణం ఓనరు, వీళ్ళకు ఫైనాన్స్ అందించే వడ్డీ వ్యాపారి…. ఇలాంటివారంతా పంచుకు తింటున్నారు.…

బంగ్లాదేశ్ ప్రమాదం: ఆదుకోడానికి ముందుకు రాని కంపెనీలు

బంగ్లాదేశ్ లో ఎనిమిది అంతస్ధూల భవనం కూలిపోయి 400 మందికి పైగా మరణించిన ప్రమాదంలో బాధిత కార్మికులను ఆడుకోడానికి పశ్చిమ దేశాల కంపెనీలు ముందుకు రావడం లేదు. కూలి పోయిన భవనంలో నడుస్తున్న అనేక బట్టల తయారీ కంపెనీలు ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల బహుళజాతి కంపెనీలకు దుస్తులు సరఫరా చేస్తాయి. నెలకు 38 డాలర్లు చెల్లించే అత్యంత హీనమైన వేతనాలతో బిలియన్ల కొద్దీ డాలర్ల లాభాలు గుంజే ఫ్యాషన్ బట్టల కంపెనీలు తమకు లాభాలు ఆర్జించిపెడుతున్న…